ఈటో మోటార్స్ ఫ్లిక్స్ బస్ ఎలక్ట్రిక్ బస్సును మొదటిసారి తెలంగాణలో ప్రారంభించడం

ప్రయాణికులకు అదిరే శుభవార్త!

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు అదిరే శుభవార్త. కేవలం 99 రూపాయలతో సౌకర్యవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవచ్చు.హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఫ్లిక్స్‌ ఈవీ బస్సుల్ని తెలంగాణ రవాణాశాఖమంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈటీవో మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్‌ బస్‌ ఇండియా ఈ బస్సుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ఈవీ (విద్యుత్‌ వాహనాలు)లను ప్రోత్సహిస్తోందన్నారు . ప్రతి వాహనం ఈవీ ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అన్నారు.

Advertisements
flixbus India featured 760x570


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని ఈ మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచడం కోసం కొత్త విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ‘రాష్ట్రంలో ఈవీ పాలసీ ప్రకారం, రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్‌ను 2026 డిసెంబర్ 31 వరకు మినహాయింపు ఇచ్చాము.. ఈ విధానం వల్ల కాలుష్యాన్ని తగ్గించడం, నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడం సాధ్యమవుతుంది. ఈ సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రూ. 99తో ప్రయాణించవచ్చని వివరించారు. అన్ని ప్రభుత్వ పథకాలు ఈ బస్సుల్లో వర్తిస్తాయని, 5 గంటల్లోనే గమ్యస్థానం చేరుకోవచ్చన్నారు ఆ తర్వాత విజయవాడ-విశాఖపట్నం మధ్య కూడా తమ బస్సుల్ని ప్రారంభిస్తామని తెలిపారు.

‘ఈటో మోటార్స్ ఫ్లిక్స్ బస్ ఎలక్ట్రిక్ బస్సును మొదటిసారి తెలంగాణలో ప్రారంభించడం రాష్ట్రంలో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న కొత్త చర్యలు చూపిస్తాయి. రవాణా శాఖకి సంబంధించిన అన్ని నిబంధనలను పాటించాలి ఈవీ బస్సుల వినియోగం పెరిగితే, భవిష్యత్తులో మరిన్ని రకాల ఈవీ బస్సులు ప్రవేశపెట్టాలి’ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Related Posts
గాంధీ కుటుంబంతో నాకు మంచి అనుబంధం – సీఎం రేవంత్
తెలంగాణ నిధుల కోసం ఢిల్లీలో ధర్నాకు సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబంతో తనకున్న అనుబంధంపై స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను గాంధీ కుటుంబ సభ్యులతో ఫొటోలు దిగించి నిరూపించుకోవాల్సిన Read more

ప్రతి మహిళకు రూ.35000 ఇవ్వాలి – ఎమ్మెల్సీ కవిత డిమాండ్
kavitha demand

ప్రజాక్షేత్రంలో పోరాటానికి దిగుతామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ప్రతి మహిళకు Read more

హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి..ఘనస్వాగతం పలికిన సీఎం
cm revanth welcomed the pre

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణు Read more

తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ఐసెట్ 2025 పూర్తి షెడ్యూల్ విడుదల

వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ Read more

×