సాయిరెడ్డికి బీజేపీ నుంచి బంపర్ ఆఫర్? – ఏపీ రాజకీయాల్లో మళ్లీ మారిన గాలి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీట్‌కు చేరుకున్నాయి. తాజాగా మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయ సాయిరెడ్డిపై బీజేపీ చూపిస్తున్న ఆసక్తి పలు అనుమానాలు, చర్చలకు దారి తీస్తోంది. కొద్ది రోజుల కిందటే రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నానని ప్రకటించిన సాయిరెడ్డికి, ఇప్పుడు బీజేపీ తిరిగి పెద్ద స్థాయిలో ఆఫర్ ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన నిర్ణయం మళ్లీ మారుతోందా? అనే చర్చ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కూటమిలోనూ, బీజేపీ శ్రేణుల్లోనూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. మరి ఇది కేవలం ప్రచారమా? లేక వాస్తవమేనా? అన్నది ఆసక్తికరంగా మారింది.
జాతీయ స్థాయికి వ్యూహాలు మార్చిన బీజేపీ – ఏపీలో విస్తరణ పథకం స్పష్టమవుతోంది
బీజేపీ ప్రస్తుతం రాష్ట్ర స్థాయికి మాత్రమే పరిమితం కాకుండా, జాతీయ స్థాయిలో కూడా కొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. NDA కూటమిలో కొనసాగుతూ, మరోవైపు స్వతంత్రంగా తమ బలాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ఏపీలో నూతన ప్రణాళికలకు రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా పలు కీలక రాజకీయ నాయకులను పార్టీలోకి ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేసింది. రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాన్ని సాయిరెడ్డికి కేటాయించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అంతేకాదు, ఢిల్లీ కేంద్రంగా బీజేపీ టాప్ లీడర్ల మధ్య ఈ అంశంపై చర్చలు తీవ్రంగా సాగుతున్నట్లు వార్తలు వచ్చాయి.
సాయిరెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదేనా?
రాజకీయాలకు గుడ్ బై చెబుతూ.. తన భవిష్యత్తు వ్యవసాయ రంగంలోనే ఉండబోతున్నానని విజయ సాయిరెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడే ఆయన బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారని, అప్పుడే ఆయనకు అవకాశాల దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయనే ప్రచారం సాగుతోంది. పార్టీ మార్పునకు ముందు రాజీనామా చేసి.. కొంత గ్యాప్ ఇవ్వటం ద్వారా ప్రజల్లో ఉన్న నెగటివ్ వైబ్ తగ్గించాలని బీజేపీ వ్యూహంగా భావించిందని తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే సాయిరెడ్డి ముందుగానే వైసీపీకి రాజీనామా చేసి.. ప్రస్తుతం బీజేపీలోకి వచ్చే దశను రూపొందించుకున్నట్లు సమాచారం.
టీడీపీ అభ్యంతరం – కూటమి ఐక్యతపై కొత్త ప్రశ్నలు
విజయ సాయిరెడ్డి రాజ్యసభలోకి తిరిగి బీజేపీ నుంచి వెళ్లే ప్రసక్తి వస్తే, టీడీపీ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వైసీపీలో నెంబర్ టూ స్థాయిలో ఉండి టీడీపీపై తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తిని ఇప్పుడు బీజేపీ తన కూటమిలోకి తీసుకుంటే, అది ప్రజల్లో చెడు సందేశం ఇస్తుందనే అభిప్రాయాన్ని టీడీపీ నేతలు వెల్లడిస్తున్నారు. చంద్రబాబు నాయుడు సైతం ఈ విషయంపై స్పష్టమైన అభిప్రాయం చెప్పినట్లు సమాచారం. దీనివల్ల కూటమిలో ఐక్యతపైనే పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఇక ముందు టీడీపీ అభిప్రాయాన్ని పట్టించుకుంటుందా? లేదా… స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
సాయిరెడ్డి చేరికతో ఏపీ రాజకీయాలపై ప్రభావం
వైసీపీ పాలనపై పదే పదే ఆరోపణలు చేసిన సాయిరెడ్డిని బీజేపీ తమ కూటమిలోకి తీసుకుంటే, అది ఒకవైపు వైసీపీకే పెద్ద షాకు అవుతుంది. మరోవైపు టీడీపీకి ఇది ఊహించని విషయంల మారవచ్చు. గతంలో జగన్ కోటరీని టార్గెట్ చేస్తూ మద్యం, పోర్టు, భూ కుంభకోణాలపై స్పందించిన సాయిరెడ్డి ఇప్పుడు బీజేపీలోకి వస్తే, కేంద్ర దృష్టిలో ఈ అంశాలను మరింత ఎత్తున తీసుకెళ్లే అవకాశముంది. ఇది వైసీపీకి గట్టి దెబ్బగా మారవచ్చు. అదే సమయంలో బీజేపీకి కూడా ఓ సీనియర్ రాజకీయ నేతను తమ జట్టులో కలుపుకునే అవకాశమవుతుంది. ఇది భవిష్యత్ ఎన్నికల వ్యూహాలపై బీజేపీకు ఎక్కువ ఆధిపత్యం కల్పిస్తుంది.
READ ALSO: Vontimitta temple: నేడు ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి కల్యాణోత్సవం