हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

IRCTC : జనరల్ క్లాస్ ప్రయాణీకులకు శుభవార్త..

Sudheer
IRCTC : జనరల్ క్లాస్ ప్రయాణీకులకు శుభవార్త..

భారతీయ రైల్వేలు, ముఖ్యంగా ఐఆర్‌సిటిసి (IRCTC) ప్రయాణికుల సౌకర్యం కోసం మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకు జనరల్ కోచ్‌లో ప్రయాణించే వారికి తినే విషయమై అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యను పరిష్కరించేందుకు తాజాగా ఐఆర్‌సిటిసి ప్రత్యేక ఆహార సేవలను ప్రారంభించింది. జనరల్ క్లాస్‌లో ప్రయాణించే వారికి నాణ్యమైన భోజనాన్ని నేరుగా వారి సీటు వద్దకు అందించనున్నారు. ఇది ఏసీ కోచ్ ప్రయాణికులకు ఇచ్చే భోజనంతో సమానంగా ఉంటుంది.

రూ.80కే నాణ్యమైన భోజనం – ఫుడ్ బాక్స్‌ స్పెషాలిటీ

ఈ పథకం కింద అందించే భోజనం అన్నం, పప్పు, కూర, రొట్టె, ఊరగాయ లాంటి పౌష్టికమైన పదార్థాలతో కూడి ఉంటుంది. వీటిని శుభ్రంగా ప్యాక్ చేసి అందించనున్నారు. ఒక్కొక్క భోజన ఫుడ్ బాక్స్ ధర కేవలం రూ.80 మాత్రమే. పైగా ఇందులో చెంచా, నాప్‌కిన్ వంటి అవసరమైన సామగ్రి కూడా ఉంటాయి. జనరల్ కోచ్ ప్రయాణికులు ఇక తినేందుకు బుక్ చేయాల్సిన అవసరం లేకుండా, కేవలం కోచ్‌లోనే వీటిని పొందే అవకాశం కలుగుతుంది.

కొత్త సేవలు ప్రారంభమైన రైళ్లు, స్టేషన్లలో సీటింగ్ సౌకర్యం కూడా

ఈ సేవలు మొదటగా కొన్ని ముఖ్య రైళ్లలో ప్రారంభమయ్యాయి. గోమతి ఎక్స్‌ప్రెస్, కైఫియత్ ఎక్స్‌ప్రెస్, శ్రీనగర్ గంగానగర్-న్యూఢిల్లీ ఇంటర్‌సిటీ, అయోధ్య ఎక్స్‌ప్రెస్, బరౌని–న్యూఢిల్లీ క్లోన్ ఎక్స్‌ప్రెస్, దర్భంగా–న్యూఢిల్లీ క్లోన్ ఎక్స్‌ప్రెస్ మొదలైన రైళ్లు ఇందులో ఉన్నాయి. అంతేకాక, న్యూఢిల్లీ, వారణాసి, గోరఖ్‌పూర్, లక్నో వంటి స్టేషన్లలో జనరల్ క్లాస్ ప్రయాణికులకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. దీంతో వారు నిలబడి తినాల్సిన అవసరం లేకుండా కూర్చొని సౌకర్యంగా భోజనం చేయవచ్చు. ప్రయాణికుల అభ్యున్నతికై చేపట్టిన ఈ చర్యపై ప్రజలు ఐఆర్‌సిటిసీని ప్రశంసిస్తున్నారు.

Read Also : Nara Lokesh : లోకేష్ చొరవ తో వైజాగ్ కు పెట్టుబడుల వెల్లువ!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870