గేమ్ చేంజ‌ర్‌’ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ను ఫ్యాన్స్‌తో క‌లిసి జ‌రుపుకున్న రామ్ చ‌ర‌ణ్‌

గేమ్ చేంజ‌ర్‌’ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన సినీ స్థాయిని పెంచుకున్నాడు.త్రిబుల్ ఆర్’వంటి అద్భుత విజయం తర్వాత, రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్‘ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది.ఇది ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. దిల్ రాజు బ్యానర్‌పై 350 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, ఆయన 50వ ప్రాజెక్ట్ కూడా.సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన గేమ్ చేంజర్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రిలీజ్ రోజు నుంచే సినిమాకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.186 కోట్లు వసూలు చేసింది. పండుగ సీజన్‌ కావడంతో రెండో రోజు కూడా దూసుకెళ్లింది.

గేమ్ చేంజ‌ర్‌’ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ను ఫ్యాన్స్‌తో క‌లిసి జ‌రుపుకున్న రామ్ చ‌ర‌ణ్‌

మెగా అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి వసూళ్లలో మంచి ఊపు వచ్చింది.రామ్ చరణ్ ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించాడు.ప్రజా నాయకుడు అప్పన్నగా, ప్రజా సమస్యలపై పోరాటం చేసే కలెక్టర్ రామ్ నందన్‌గా చరణ్ చూపిన నటన అందర్నీ ఆకట్టుకుంది.ఆయన డాన్స్‌లు కూడా ప్రేక్షకులను అలరించాయి. హీరోయిన్ కియారా అద్వానీ తన గ్లామర్‌తో ఆకట్టుకోగా, అన్జలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, జయరాం,సునీల్ వంటి ప్రముఖులు తమ పాత్రల్లో బాగా ఒదిగిపోయారు.దర్శకుడు శంకర్ ప్రతి సన్నివేశాన్ని గ్రాండియస్‌గా తీర్చిదిద్దారు.నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ సినిమా నిర్మించారు.

మొదటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా,విడుదల తర్వాత ఆ అంచనాలను మించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.రామ్ చరణ్‌ను శంకర్ ఎలా చూపిస్తారో అని ఎదురుచూసిన ప్రేక్షకులకు అదిరిపోయే అనుభూతి వచ్చింది.చరణ్ మాస్ పెర్ఫార్మెన్స్, శంకర్ మాస్టర్ టేకింగ్ కలిసి ఈ సినిమాను సంక్రాంతి సీజన్‌లో కలెక్షన్ల తుఫాను సృష్టించేందుకు కారణమయ్యాయి.సినిమాను ఘనవిజయంగా మార్చిన అభిమానులు చరణ్ ఇంటికి వెళ్లి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

Related Posts
మన్మధుడు స్టార్ట్ కావడానికి ముందు ఇంత పెద్ద స్టోరీ నడిచిందా.. చివరకు నాగ్ అలాంటి నిర్ణయం
manmadhudu

నాగార్జున ప్రధాన పాత్రలో విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందిన "మన్మధుడు" సినిమా గురించి మనందరికీ బాగా తెలుసు ఈ చిత్రం 2002 సంవత్సరంలో డిసెంబర్ 22న విడుదల అయి, Read more

NTR: కొత్త లుక్ లో ఎన్టీఆర్
NTR: కొత్త లుక్ లో ఎన్టీఆర్

RRR ప్రభావం – ఎన్టీఆర్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిన తీరు తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుండగా, జపాన్ లో అయితే ఈ క్రేజ్ విపరీతంగా కనిపిస్తోంది. Read more

తొలిసారి దర్శకత్వం అంతర్జాతీయ అవార్డు
తొలిసారి దర్శకత్వం అంతర్జాతీయ అవార్డు

సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు సంబంధించిన మార్పులు ఎప్పుడూ ఆసక్తికరమే.గతంలో స్టార్ హీరోయిన్‌లుగా ప్రేక్షకులను అలరించిన చాలామంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. అత్త, అమ్మ, Read more

నాని న్యూ లుక్‌ ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం
hero nani

యంగ్ హీరో నాని ఇప్పుడు ఓ కొత్త లుక్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.ప్రస్తుతం "హిట్ 3" చిత్రంలో నటిస్తున్న నేచురల్ స్టార్ నాని, ఆ సినిమాలో గ్రే హెయిర్‌తో Read more