Free seeds should be given to those farmers.. Harish Rao

Harish Rao: ఆ రైతులకు ఉచిత విత్తనాలు ఇవ్వాలి: హరీశ్ రావు

Harish Rao : రుణమాఫీ పూర్తిగా అమలు చేయకుండా రేవంత్ ప్రభుత్వం గొప్పలు చెబుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో సరైన సమయంలో రైతుబంధు, రైతు భీమా ఇచ్చామని గుర్తుచేశారు. ఇవాళ(శనివారం) నంగూనూర్ మండలం రాజగోపాల్ పేటలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను హరీష్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు.

Advertisements
 ఆ రైతులకు ఉచిత విత్తనాలు ఇవ్వాలి

వడగళ్ల వర్షంతో నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలి

గత కేసీఆర్ ప్రభుత్వం చనిపోయిన రైతులకు రైతు భీమా ఇచ్చిందని, కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదని చెప్పారు. వానకాలం పంటలకు ఉచిత విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేక పచ్చి రొట్టె విత్తనాలను ఇవ్వడం లేదని అన్నారు. కౌలు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వడగళ్ల వర్షంతో నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని హరీష్‌రావు కోరారు.

భీమా పథకం మూడు నెలల నుంచి ఇవ్వడం లేదు

పంటల భీమా ఇస్తామని ఇంతవరకు రైతులకు పంటల భీమా ఇవ్వలేదని హరీష్‌రావు అన్నారు. గత యాసంగి పంట నష్టం 1350 ఎకరాలని ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భీమా పథకం మూడు నెలల నుంచి ఇవ్వడం లేదని అన్నారు. చనిపోయిన అన్నదాతల కుటుంబాలు రైతు భీమా కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోతున్నాయని చెప్పారు. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భీమా ప్రీమియం కట్ట లేదా అని నిలదీశారు. బీఆర్‌ఎస్ పార్టీకి పేరు వస్తోందని రైతుబంధు పథకాన్ని పూర్తిగా ఇవ్వడం లేదని హరీష్‌రావు మండిపడ్డారు.

Related Posts
తెలంగాణలో 10 మంది ఐపీఎస్ అధికారులు బ‌దిలీ

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో తాజాగా 10 మంది ఐపీఎస్ ఆఫీస‌ర్లు బ‌దిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2021, Read more

ఐఏఎస్లు బానిసల్లా పనిచేయొద్దు – ఈటల
Government should support Telangana farmers.. Etela Rajender

ప్రభుత్వాలు ఐదేళ్లపాటు మాత్రమే , ఐఏఎస్ అధికారులు 35 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల తీరుపై భారతీయ జనతా పార్టీ Read more

లండన్ వాల్వ్స్ 2024 వద్ద మెరిసిన ఇండియా..
India shines at London Valves 2024

GISE 2024 మరియు పిసిఆర్ లండన్ వాల్వ్‌లలో ప్రదర్శించబడిన మెరిల్ యొక్క సంచలనాత్మక హార్ట్ వాల్వ్ ఆవిష్కరణ “మైవల్ ఆక్టాప్రో THV” కార్డియోవాస్కులర్ మరియు స్ట్రక్చరల్ హార్ట్ Read more

Telangana Tourists : శ్రీనగర్‌ హోటల్‌లో 80 మంది తెలంగాణ పర్యటకులు
80 Telangana tourists in Srinagar hotel

Telangana Tourists : శ్రీనగర్‌కు తెలంగాణ జిల్లాల నుంచి పలువురు పర్యటకులు వెళ్లారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో వీరు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీనగర్‌లోని ఓ హోటల్‌లో దాదాపు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×