formula e race hyderabad kt

ఫార్ములా ఈ కార్ రేస్ లో దూకుడు పెంచిన ఈడీ

ఫార్ములా ఈ కార్ రేస్‌లో అవినీతి ఆరోపణలపై ఏసీబీ, ఈడీ దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ-కార్ రేస్‌కు సంబంధించిన లావాదేవీలపై లోతైన విచారణ చేపట్టిన ఈడీ, ఇప్పటికే కేసు నమోదు చేసింది. 55 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్, స్పాన్సర్‌షిప్ విషయంలో స్పష్టత లేకపోవడమే ప్రధాన కారణమని సమాచారం.

ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు అరవింద్ కుమార్, ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈ రేస్‌కు సంబంధించిన వివరాలను సేకరించిన ఏసీబీ, నిబంధనలకు విరుద్ధంగా నిధులు వినియోగించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఫార్ములా ఈ కార్ రేస్ కోసం ప్రభుత్వం ఇచ్చిన స్పాన్సర్‌షిప్‌ గురించి ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. స్పాన్సర్‌గా ప్రకటించిన కొన్ని కంపెనీలు చివరి నిమిషంలో తప్పుకోవడంపై ప్రశ్నలు నెలకొన్నాయి.

ఈ వ్యవహారంలో పాల్గొన్న కంపెనీల లావాదేవీల వివరాలను ఈడీ సేకరించింది. హిమాయత్‌నగర్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ను సందర్శించనున్న ఏసీబీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి ట్రాన్సాక్షన్ వివరాలు కోరనుంది. బ్యాంకింగ్ లావాదేవీలు, ఆర్థిక వనరుల వినియోగంపై అధికారులు మరింత సమాచారం సేకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏసీబీ, ఈడీ సంయుక్తంగా పని చేస్తూ, నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్‌కు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, నిధుల వినియోగంపై ఇప్పటికే వివాదాలు రేగగా, ఈ విచారణ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Related Posts
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. భారతీయుల మృతి
Russia Ukraine war.. Indian

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 12 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రష్యా తరఫున యుద్ధంలో పాల్గొంటున్న వీరిలో ఇంకా 16 మంది అదృశ్యంగా ఉన్నారని Read more

తమిళనాడులో చరిత్ర తిరగరాస్తాం – విజయ్ ధీమా
vijayparty

తమిళ సినీ నటుడు దళపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత, తన తమిళగ వెట్రి కజగం పార్టీ ద్వారా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ Read more

తెలంగాణ భవిష్యత్తును తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డి: కవిత
తెలంగాణ భవిష్యత్తును తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డి: కవిత

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ముసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ప్రాజెక్ట్ కోసం రూ.4,100 కోట్ల ప్రపంచ బ్యాంక్ రుణాన్ని కోరుతూ ప్రభుత్వం ప్రపోజల్ Read more

సీటెట్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల
exame

నిరుద్యోగులు ఎదురు చూస్తున సీటెట్‌ పరీక్ష ప్రకటన విడుదల అయింది.CTET | ఉపాధ్యాయ అర్హత పరీక్ష సీటెట్‌ అడ్మికార్డులను సీబీఎస్సీ (CBSE) విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *