చైనాలో వరదలు (China Floods) మానవ జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వాయవ్య, నైరుతి ప్రాంతాల్లో కుండపోత వర్షాలు దంచికొడుతుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఇప్పటివరకు వరదలతో ఆరుగురు మరణించినట్లు (Six people are reported dead) అధికారులు ప్రకటించారు.గుయిజౌ ప్రావిన్సులోని రోంగ్‌జియాంగ్ కౌంటీ అత్యంత దారుణ పరిస్థితిని ఎదుర్కొంటోంది. వారం వ్యవధిలోనే రెండుసార్లు భారీ వరదలు వచ్చాయి. అందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. స్థానికంగా ప్రసిద్ధి గల ‘విలేజ్ సూపర్ లీగ్’ ఫుట్‌బాల్ స్టేడియం కూడా రెండు సార్లు నీట మునిగింది. ప్రజలలో భయాందోళనలు పెరుగుతున్నాయి.చైనా జలవనరుల శాఖ క్విన్‌ఘై ప్రావిన్సులో లెవెల్-4 ఎమర్జెన్సీని ప్రకటించింది. రాబోయే మూడు రోజుల్లో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఎల్లో రివర్ ఉపనదుల్లో నీటి మట్టం ప్రమాదకరంగా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

ఇప్పటికే పలు ప్రావిన్సుల్లో హెచ్చరికలు అమలులోనే ఉన్నాయి
సిచువాన్, గాన్సు, చాంగ్‌కింగ్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే అత్యవసర పరిస్థితులు అమలులో ఉన్నాయి. వరదల ముప్పుతో ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేసింది.సిచువాన్ రాష్ట్రంలోని చెంగ్డు నగరంలో కొండచరియలు విరిగిపడటంతో రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ రహదారి మార్గాలు మూసివేశారు.
పది ప్రావిన్సులకు మరోసారి హెచ్చరికలు – అధికారులు అప్రమత్తం
ఇంకా పది ఇతర ప్రావిన్సుల్లో భారీ వర్ష సూచనలతో ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. నదీ ఒడ్డు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అన్ని విభాగాలు కృషి చేస్తున్నాయి.చైనాలో విపత్తుల తీవ్రత ఆధారంగా నాలుగు స్థాయిల హెచ్చరికలు ఉంటాయి. ప్రస్తుత లెవెల్-4 తక్కువ స్థాయి అయినా, పరిస్థితి ఎప్పుడైనా ముప్పుగా మారే అవకాశం ఉంది.
Read Also : Ola Uber : ఓలా, ఊబర్ కొత్త రూల్స్… ప్రయాణికులు తప్పకుండా తెలుసుకోవాలి!