అహ్మదాబాద్ (Ahmedabad) నుండి లండన్‌కు (London) బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-171, టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది. సాధారణంగా విమానం టేకాఫ్ అయిన వెంటనే వేగంగా ఎత్తు పెరుగుతుంది. కానీ ఈ విమానం కేవలం 672 అడుగుల ఎత్తు వరకు మాత్రమే వెళ్లి అక్కడి నుంచే కిందపడిపోయింది. ఇది విమానయానంలో అత్యంత అరుదైన ఘటనలలో ఒకటి.

అత్యాధునిక బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్
ఈ ప్రమాదం మరింత భయానకంగా మారడానికి గల ప్రధాన కారణం, ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ మోడల్. ఇది అత్యంత ఆధునిక టెక్నాలజీ కలిగిన విమానాల్లో ఒకటి. సాధారణంగా ఇలాంటి విమానాల్లో ఇంజిన్ విఫలమైనా కూడా పైలట్‌కు కొన్ని ప్రత్యామ్నాయ అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ప్రమాదంలో పరిస్థితి పూర్తిగా వేరేలా కనిపిస్తోంది.
టేకాఫ్ తర్వాత వెంటనే మేడే సిగ్నల్
‘టేకాఫ్ అయిన తరువాత మేడే (Mayday) కాల్ వచ్చింది, అంటే విమానం తీవ్రమైన ప్రమాదంలో ఉందని అర్థం. లిఫ్ట్ తగ్గిపోతుండగా, పైలట్లు విమాన నోస్‌ను పైకి లాగేందుకు ప్రయత్నించారని, అయినప్పటికీ అది పట్టుకోల్పోతూ కిందకు దిగిపోయింది’ అని నిపుణులు విశ్లేషించారు. విమాన వేగం గరిష్ఠంగా 174 నాట్స్ (సుమారు గంటలకు 322 కి.మీ మాత్రమే ఉండటం, ఇది సాధారణంగా అవసరమైన వేగానికి తక్కువగా ఉండటం, ఇంజిన్లు తగిన శక్తిని ఉత్పత్తి చేయలేకపోయినట్లు చూపుతుందని చెప్పారు.
లిఫ్ట్ కోల్పోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమా?
విమానంలో లిఫ్ట్ అనే శక్తి (ఎయిరోడైనమిక్ ఫోర్స్) సరిగ్గా పని చేయకపోవడమే ప్రమాదానికి దారితీసినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. విమానం ఎత్తుకు ఎగరడానికి ఇబ్బంది పడుతోందని, ఆ తర్వాత లిఫ్ట్ (ఏరోడైనమిక్ శక్తి) పట్టుకోల్పోయి కిందపడిపోతూ భీకర పేలుడుతో అగ్నిగోళంలా పేలిపోయినట్టు చూపించాయి.
ల్యాండింగ్ గేర్ పైకెత్తకుండానే సమస్యలు ప్రారంభం
వీడియోలో కనిపించిన దృశ్యాలను బట్టి విమానం టేకాఫ్ అయిన వెంటనే ల్యాండింగ్ గేర్ ఎత్తలేదు. ‘టేకాఫ్ సరిగానే జరిగింది. కానీ, ల్యాండింగ్ గేర్ పైకి తీసేసే ముందు విమానం కిందకు దిగడం మొదలైంది. ఇది ఇంజిన్ శక్తి కోల్పోయినప్పుడు లేదా విమానం లిఫ్ట్ చేయడం ఆపినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. అసలైన కారణాన్ని దర్యాప్తు వెల్లడిస్తుంది’ అని మాజీ పైలట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ తెలిపారు.
ప్రయాణికుల వివరాలు
విమానంలో మొత్తం 242 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనడియన్, 7 మంది పోర్చుగీస్ పౌరులు ఉన్నారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక హాట్‌లైన్ నెంబర్‌ను 1800 5691 444 అందుబాటులో ఉంచింది: అయితే, మీడియా ప్రతినిధులు, ప్రత్యేక ప్రయాణికులు ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చెయవద్దని ఎయిరిండియా సూచించింది.
Read also: Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంలో ఇద్దరు మణిపురి ఫ్లైట్ అటెండెంట్ల దుర్మరణం