unnamed file

ముఖ్యమంత్రి రేసు నుంచి ఏక్‌నాథ్‌ శిండే వైదొలుగుతున్నారా?

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి తరఫున సీఎం పదవి చేపట్టనున్నారనే సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతున్నది. మహారాష్ట్ర 14వ అసెంబ్లీ పదవీ కాలం నేటితో (మంగళవారం) ముగియనున్నది. దీంతో ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందనే వార్తలు వచ్చాయి. వీటిని అధికారులు ఖండించినప్పటికీ.. తదుపరి సీఎం అభ్యర్థి ఎవరు కాబోతున్నారనేది కూటమి ఇంకా తేల్చకోలేకపోతున్నది. బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆపార్టీ హైకమాండ్‌తో పాటు రాష్ట్ర నాయకత్వం అంటుండగా.. ‘బీహార్‌ ఫార్ములా’ ప్రకారం ఏక్‌నాథ్‌ శిండేను కొనసాగించాలని శివసేన పట్టుబడుతున్నది. ఈ సస్సెన్స్‌ కొనసాగుతున్న సమయంలోనే సీఎం శిండే పెట్టిన ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది. దీంతో ఆయన సీఎం రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.

మంగళవారం తెల్లవారుజామున ఏక్‌నాథ్‌ శిండే తన సోషల్‌ మీడియా ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం సాధించడంతో మా ప్రభుత్వం రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నది. మహాకూటమిగా మేం ఎన్నికల్లో కలిసి పోటీ చేశాం. నేటికీ కలిసే ఉన్నాం. నాపై ప్రేమతో కొన్ని సంఘాల వారు నన్ను కలవడానికి ముంబయి వస్తామని అడుగుతున్నారు. వారి అభిమానానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిజేస్తున్నాను. అయితే నాకు మద్దతుగా అలా ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేస్తున్నా. బలమైన, సుసంపన్న మహారాష్ట్ర కోసం మహాకూటమి బలంగా ఉన్నది. అలాగే కొనసాగుతుంది కూడా’అని శిండే రాసుకొచ్చారు. దీంతో ముఖ్యమంత్రి రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఆయన సూచనప్రాయంగా చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో 288 సీట్లకు గాను.. 200 కు పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అయితే.. మరాఠా గడ్డపై దేవెంద్ర ఫడ్నవీస్ సీఎం పదవీని అధిష్టిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు షిండే వర్గం మాత్రం.. సీఎం సీటును వదులుకొనేందుకు సిద్దంగా లేనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం మహారాజకీయాలు మాత్రం రసవత్తరంగా మారాయని చెప్పుకొవచ్చు.

Related Posts
బంగారాన్ని నిల్వ ఉంచుతున్న రిజర్వు బ్యాంకు..
బంగారాన్ని నిల్వ ఉంచుతున్న రిజర్వు బ్యాంకు..

సమాచారం ప్రకారం, సామాన్యులకు అందని స్థాయిలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి పుత్తడి ధర రూ. 88,285కి చేరుకున్నాయి. ప్రపంచ మార్కెట్లలో ఒడిదొడుకులు, Read more

Modi: రూ.వేల కోట్లలో నల్లధనం బయటపడింది – మోదీ
PM Modi: మోదీ విదేశీ పర్యటనలకు రూ. 258 కోట్లు ఖర్చు కేంద్రం వెల్లడి!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నల్లధనంపై తీసుకుంటున్న చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 'వాట్ ఇండియా థింక్స్ టుడే' సదస్సులో ప్రసంగించిన మోదీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడుల Read more

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లు.. వారికి తొలి ప్రాధాన్యత – సీఎం రేవంత్
CM Revanth Reddy will start Indiramma Houses today

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు ‘ఇందిరమ్మ ఇళ్లు’ కేటాయిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, వీరికి Read more

నేడు ప్రవాసీ భారతీయ అవార్డులను ప్రదానం
నేడు ప్రవాసీ భారతీయ అవార్డుల ప్రదానం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఒడిశాలో నిర్వహిస్తున్న 18వ ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) సదస్సు ముగింపు సమావేశంలో ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను ప్రదానం Read more