The White House : ప్రపంచానికి మకుటాయమానమైన ఆ శ్వేత సౌధం కూలుతున్న దృశ్యం గల్ఫ్ లో స్పష్టంగా గోచరి స్తోంది. ఇరాన్ యుద్ధంలో అపజ యంతోబాటు, గల్ఫ్ నుంచి ఇరవై సైనిక స్థావరాలను ఖాళీ చేయడంతో అమెరికా పతనం ప్రారంభం కాబో తోంది. దాదాపు అర్థ శతాబ్దంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతం అమెరికా సైనిక వ్యూ హానికి కేంద్రంగా ఉంది. బహ్రెయిన్, ఖతార్, కువైట్, యూఏఈ, సౌదీ ఇంకా ఇతర ప్రాంతాలలో ఉన్న అరబ్ దేశాల్లో భారీ అమెరికా స్థావరాలు ఉన్నాయి. చమురు నౌకల రవాణా మార్గాలనునాటి కమ్యూ నిస్టు సోవియట్ యూనియన్ దాడి చేయకుండా రక్షించే నెపంతో అమెరికా సుమారు ఇరవై సైనిక స్థావరాలను గల్డ్ ప్రాంతంలో ఏర్పాటు చేసింది. గత ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఓటమి అంచులో ఉంది. మూడు రోజుల్లో ఇరాన్ను స్వాధీనం చేసుకుం టానని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 110 రోజులైనా ఇరాన్ను దారికి తెచ్చుకోలేకపోయాడు. పైగా తన వాచా లత్వంతో నాటో దేశాలను, అరబ్ మిత్ర దేశాలను దూరం చేసుకున్నాడు. అమెరికా ఓటమికి అనేక కారణాలు ఉన్నా యి. అమెరికా శక్తిని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అతిగా ఊహించుకున్నాడు.
Read Also : Donald Trump: ఇరాన్‌పై మరోసారి ట్రంప్ హెచ్చరికలు.. అణు కేంద్రాలపై ఫోకస్
The White House : ట్రంప్కు తగిలిన మొదటి అతి పెద్ద షాక్ ఇదే
నాటో, అరబ్ దేశాలు (13) ఇజ్రాయెల్, తను కలిసి దాడి చేస్తే మూడు రోజుల్లో వెనెజులాలాగా ఇరాన్ సాగిలబడి పోతుందని ట్రంప్ కలగన్నాడు. కానీ నాటో మిత్రులుగానీ, అరబ్ దేశాలుగానీ యుద్ధంలో పాల్గొ నకుండా ప్రేక్షక పాత్ర వహించాయి. ఇప్పటికే ఆర్ధిక మాం ద్యాలతో ఇబ్బంది పడుతున్న నాటో దేశాలు ఉ క్రెయిన్, ఇరాన్ యుద్ధం వల్ల వచ్చే అవాంచనీయ పరిణామాలను ఎదుర్కొనడానికి సిద్ధంగా లేవు. అందుకే ట్రంప్ వ్యక్తిగతంగా దూషించినా బ్రిటన్, ఫ్రాన్స్ అధ్యక్షులు ఇరాన్ వైపు కన్నెత్తి చూడలేదు. ఇక అరబ్ మిత్ర దేశాల వెన్నుపోటును డోనాల్డ్ ట్రంప్ మాత్రమే కాదు. ప్రపంచంలో రాజకీయ పరిశీలకులు ఎవరూ ఊహించలేకపోయారు. 2025 జూన్లో 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ను కాళ్లబేరా నికి తీసుకురావడంతో అరబ్ దేశాలకు ఇరాన్పై నమ్మకం పెరిగింది. మళ్లీ ఫిబ్రవరి 28న అమెరికా యుద్ధం ప్రారం భించేలోపు అరబ్ దేశాలు ఇరాన్ రహస్యంగా కట్టేసాయి. తాజా యుద్ధంలో అమెరికా సైనిక స్థావరాలను తుక్కుకింద కొట్టేసిన ఇరాన్ అరబ్ భూభాగాలపై కనీసం బజూకారాకెట్ లను కూడా ప్రయోగించలేదు. ట్రంప్కు తగిలిన మొదటి అతి పెద్ద షాక్ ఇదే. ఇంత కాలం యుద్ధం జరుగుతున్నా అరబ్ దేశాల్లో జనజీవనానికి ఎటువంటి అంతరాయంలేదు. ఇరాన్ దాడిలో కూలిపోవాల్సిన ఖలీఫా టవర్ వెలుగులు విరజిమ్ముతూనే ఉంది.
అమెరికాతో వాణిజ్య లావాదేవీలు రద్దు
యుద్ధంలో భారతీయులు సుమారు యాభై మంది చనిపోయారు. కానీ ఒక్క అరబ్ దేశీయుడు కూడా చనిపోలేదు. నాటో నేతలు ‘పిరికిపందలు’ అంటూ బ హిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసినా ట్రంప్ సౌదీన యువరాజు సల్మాన్ అబ్దుల్ను కూడా బండ బూతులు తిట్టాడు. ఇంగ్లీషులో ఫోర్ లెటర్ వర్డ్ వాడటంతో సల్మాన్ అబ్దుల్కు కోపం వచ్చి అమెరికాతో వాణిజ్య లావాదేవీలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. నిన్నటి వరకూ సన్నిహి తంగా ఉన్న సౌదీ మూటాముల్లే సర్దుకుని వెళ్లి పొమ్మని అమెరికాకు దారి చూపెడుతోంది. అమెరికా సైనికుల సంఖ్య 13 లక్షలు, కాగా గల్ఫ్ సైనిక స్థావరాల్లో 50 వేలమందిని మోహరించింది. దేశ రక్షణ బడ్జెట్ 800 బిలియన్ డాలర్ల లో 60 బిలియన్ డాలర్లు గల్ఫ్ లో వ్యయం చేస్తోంది. ఆదా యం చెప్పుకోడానికి ఏమీ లేదు. గల్ఫ్ ఆదా చేసిన డబ్బు ను నౌకాదళ విస్తరణ, సెమీకండక్టర్ పెట్టుబడులు, ఎఐ రక్షణ, సాంకేతికత అభివృద్ధికి కేటాయించవచ్చని నిపుణులు ట్రంప్కు హితవు చెబుతున్నారు. అంటే ‘మనకు యుద్ధాలు చేయడం రాదు. నోర్మూసుకుని కూర్చో’ అని చెప్పడం అన్న మాట. ప్రతిరోజూ రెండు బిలియన్ డాలర్లు ఖర్చవుతున్నా యి. ఇరాన్ దాడుల్లో ఫిఫ్త్ ప్లీట్తో సహా రాడార్లు అన్నీ ధ్వంసం అయ్యాయి.
అమెరికా అప్పు లు రెట్టింపు
గల్ఫ్ నుంచి అమెరికా పారిపోతే అంతర్జాతీయంగా తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయి. గల్ఫ్ చైనా, రష్యాల, భారత్ల ప్రభావం పెరుగుతుంది. అమెరికా గుత్తాధిపత్యం పోయి స్వేచ్ఛా వాతావరణం నెల కొంటుంది. విశ్వవ్యాప్తంగా ఈ ప్రభావం ఉంటుంది. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఇతర దేశాలు సొంత రక్షణ వ్యవస్థలను సమకూర్చుకోవాల్సిందే. గల్ఫ్ దేశాలు డాలర్ను వదిలి ఇతర కరెన్సీలలో వ్యాపారాలు చేస్తాయి. డాలర్ విలు వ తగ్గడం మొదలవుతుంది. పారిశ్రామిక వేత్తలు అమెరికా సెక్యూరిటీలు కొనడం మానేసి అమ్మకం మొదలు పెడతారు. దీనితో డాలర్ మారకం విలువ పడిపోయి ఆ మెరికా అప్పు లు రెట్టింపు అవుతాయి. చివరగా ప్రపంచానికే శిఖరాయ మానమైన శ్వేతసౌధ రాజకీయ ప్రాభవం మసకబారుతుంది. అమెరికా వదిలి వెళ్లిపోతే అరబ్ దేశాలపైకూడా దాని ప్రభా వం ఉంటుంది. ఇది గమనించి సౌదీ అరేబియా విజన్ 2030 లో భాగంగా చమురుపై వచ్చే ఆదాయానికిబదులుగా టూరి జం, టెక్నాలజీ, లాజిస్టిక్స్, తయారీ పరిశ్రమలపై ఆదాయం పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. అరబ్ దేశాలకు ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్లకు భద్రత ఉండదు. ఇజ్రాయెల్ ముప్పు ఉంటుంది. ఈ కారణం గా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రారు. వచ్చినా అనేక షరతులు విధిస్తారు. ప్రస్తుతం అన్ని ఒడుదుడుకులను ఎదుర్కొని చైనా మాత్రమేగల్ఫ్ ప్రాంతం లోని పోర్టులు, రిఫైనరీలు, టెలికం, ఇంకా ఇతర మౌలికరం గాలలో పెట్టు బడులు పెడుతోంది. అమెరికా నిష్క్రమించడం చైనాకు ప్రధానంగా కలిసి వచ్చే అవకాశం కాగలదు.
-సరికొండ రవీంద్రనాథ్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: