📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Weightage : ‘వెయిటేజి’తో ప్రమాణాలకు ‘పరీక్ష!

Author Icon By Sudha
Updated: July 8, 2026 • 4:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Weightage : దేశ విద్యా వ్యవస్థలో ప్రవేశ పరీక్షల చుట్టూ చర్చ కొత్తది కాదు. అయితే ఇటీవల నీట్, జేఈఈ వంటి జాతీయ ప్రవేశ పరీక్షలకు 50 శాతం, ఇంటర్మీడియట్ లేదా బోర్డు పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇవ్వాలనే ప్రతి పాదన మళ్లీ విద్యా రంగంలో చర్చకు దారి తీసింది. ఇది కేవలం ప్రవేశాల విధానానికి సంబంధించిన అంశంమాత్రమే కాదు. దేశంలో పాఠశాల విద్య భవిష్యత్తు, కోచింగ్ సంస్కృతి, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, సామాజిక న్యాయం, ప్రభుత్వ విద్యావ్యవస్థ వంటి అనేక అంశాలను తాకే కీలక మైన సంస్కరణ. గత పదేళ్లుగా దేశంలో ప్రవేశ పరీక్షలే విద్యార్థుల జీవితాన్ని శాసిస్తున్నాయి. వైద్య విద్య కావాలంటే నీట్, ఇంజినీరింగ్లో ప్రతిష్టాత్మక సంస్థల్లో చేరాలంటే జేఈఈ. ఈ రెండు పరీక్షల్లో వచ్చిన ర్యాంకులే విద్యార్థి భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి. ఫలితంగా పాఠశాలలు, కళాశాలల్లో జరిగే బోధన కంటే కోచింగ్ సెంటర్లే ప్రధాన విద్యా కేంద్రాలుగా మారిపోయాయి. ‘చదువు’ అనే పదానికి అర్ధమే మారిపోయింది. పుస్తకాలను అర్థం చేసుకోవడం కాదు, ప్రశ్నలను గుర్తించడం. విజ్ఞానం కాదు, వేగం. అవ గాహన కాదు, మార్కులు ఇదే నేటి పరిస్థితి.

Read Also : Jawahar Navodaya 6th class admission: నవోదయలో ఉచిత చదువు.. జులై 31 చివరి తేదీ

Weightage

Weightage : 50 శాతం వెయిటేజీ ఇవ్వాలనే ప్రతిపాదన

ఇంటర్మీడియేట్ చదివే విద్యార్థి కళాశాలకు వెళ్లేది హాజరుకోసంమాత్రమే. అసలు చదువు కోచింగ్ కేంద్రాల్లోనే జరుగుతోంది. కొందరు విద్యార్థులు రెండు సంవత్సరాల పాటు కుటుంబానికి దూ రంగా హాస్టళ్లలో ఉంటూ రోజుకు 14 నుంచి 16 గంటల వరకు కోచింగ్ తీసుకుంటున్నారు. ఇది విద్యకాదు, యాంత్రిక శిక్షణ. విద్యార్థుల బాల్యం, సృజనాత్మకత, ఆలోచనా శక్తి, సామాజిక జీవితం అన్నీ ఈ పోటీలో కనుమరుగైపోతున్నా యి. ఇలాంటి పరిస్థితుల్లో బోర్డు పరీక్షలకు 50 శాతం వెయిటేజీ ఇవ్వాలనే ప్రతిపాదనలో సహజంగానే ఆకర్షణ కనిపిస్తుంది. ఎందుకంటే అలా చేస్తే విద్యార్థి ఏడాది పొడ వునా చదవాల్సి ఉంటుంది. తరగతి గదిలో బోధనకువిలువ పెరుగుతుంది. ఉపాధ్యాయుల పాత్ర బలపడుతుంది. పాఠ శాల విద్య మళ్లీ కేంద్ర బిందువుగా మారుతుంది. కేవలం ఒక రోజు నిర్వహించే పరీక్షతోనే భవిష్యత్తు నిర్ణయమవు తుందనే అన్యాయం కొంతవరకు తగ్గుతుంది. ఒక్కరోజు పరీక్షలో అనారోగ్యం, ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల విద్యార్థి ఆశించిన ఫలితం సాధించకపోవచ్చు. అంత మాత్రాన అతని రెండేళ్ల శ్రమను కొట్టిపారేయడం సమంజసం కాదు. బోర్డు పరీక్షల మార్కులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల విద్యార్థి నిరంతర అధ్యయనానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఇది విద్యా తత్వశాస్త్రం పరంగా కూడా సముచితమైన ఆలో చనే. అయితే ఈ ప్రతిపాదనకు మరో కోణం కూడా ఉంది.

కొత్త అన్యాయాలకు తావివ్వవచ్చు

దేశంలో ఒకే విధమైన విద్యా ప్రమాణాలు లేవు. ఒక రాష్ట్ర బోర్డులో 98 శాతం మార్కులు సాధించడం సాధారణమైతే, మరొక బోర్డులో 90శాతం కూడా సాధించడం కష్టమవుతుం ది. కొన్ని బోర్డులు మార్కులను ఉదారంగా ఇస్తుంటే, మరి కొన్ని కఠినంగా మూల్యాంకనం చేస్తాయి. ఈ అసమాన పరి స్థితుల్లో బోర్డు మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇవ్వడం కొత్త అన్యాయాలకు తావివ్వవచ్చు. అదే విధంగా మార్కుల ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఇప్ప టికే 95 శాతానికి పైగా మార్కులు సాధించే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. వెయిటేజీ పెరిగితే ఈ పోటీ మరింత తీవ్రరూపం దాల్చుతుంది. విద్యాప్రమాణాలు మెరుగుపడకపోయినా మార్కులు మాత్రం పెరిగే పరిస్థితి ఏర్పడే ప్రమాదాన్ని విస్మరించలేం. ఈ సందర్భంగా కోచింగ్ పరి శ్రమ గురించి కూడా మాట్లాడాల్సిందే. నేడు వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారిన కోచింగ్ రంగం దేశవిద్యా విధానాన్నే ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. తల్లిదండ్రుల ఆర్ధిక స్థోమతే కొన్నిసార్లు విద్యార్ధి అవకాశాలను నిర్ణ యిస్తోంది. లక్షల రూపాయలు ఖర్చు చేయగలిగిన కుటుం బాలకు మెరుగైన కోచింగ్ లభిస్తే, గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ కుటుంబాల పిల్లలు వెనుకబడుతున్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాల స్ఫూర్తికి విరుద్ధం. బోర్డు పరీక్షలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తే ఈ అసమా నత కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.

Weightage

పారదర్శక పరీక్షా వ్యవస్థ ..

ప్రభుత్వ కళాశాలల్లో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకుకూడా అవకాశం పెరు గుతుంది. కానీ దీనికి ముందు దేశవ్యాప్తంగా బోర్డు పరీక్షల్లో ఒకే ప్రమాణాలను అమలు చేయాలి. లేకపోతే ఒక రాష్ట్ర విద్యార్థికి లభించేప్రయోజనం మరో రాష్ట్రవిద్యార్థికి అందదు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కూడా ఈ చర్చలో విస్మ రించరాదు. ప్రవేశ పరీక్షల ఒత్తిడి కారణంగా ప్రతి సంవత్స రం అనేక మంది విద్యార్థులు తీవ్రమైన ఆందోళన, నిరాశ, మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. విద్య అనేది వ్యక్తి త్వ వికాసానికి దో హదపడాలి తప్ప, జీవితాన్ని భారంగా మార్చకూడదు. దేశవ్యాప్తంగా ఒకేస్థాయి మూల్యాంకన విధానం, మార్కుల సాధారణీకరణ, పారదర్శక పరీక్షా వ్యవస్థ అమలు చేయడం అత్యవసరం. విద్యా విధానం ఎవరినీ శిక్షించే విధంగా ఉండకూడదు. ప్రతిభను వెలికితీసే విధంగా ఉండాలి. కోచింగ్ కేంద్రాల విజయాన్ని కాదు, పాఠశాల విద్య విజయాన్ని కొలిచే వ్యవస్థను నిర్మిం చాలి. తరగతి గదిలో బోధించే ఉపాధ్యాయుడికి విలువ లేకుండా, కోచింగ్ సెంటర్లో బోధించే అధ్యాపకుడే భవిష్యత్తును నిర్ణయించే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వ విద్యా వ్యవస్థ క్రమంగా బలహీనపడుతుంది. నీట్, జేఈఈలకు 50 శాతం వెయిటేజీ ఇవ్వాలా వద్దా అన్నది కంటే, దేశానికి ఎలాంటి విద్యా వ్యవస్థ అవసరమన్నదే అసలు ప్రశ్న. విద్యను మార్కుల పోటీ నుంచి జ్ఞాన సాధన దిశగా మళ్లించగలిగితేనే దేశ భవిష్యత్తు బలవడుతుంది. ఆదే నిజమైన విద్యా సంస్కరణకు తొలి అడుగు.

-తిప్పర్తి శ్రీనివాస్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

assessment Breaking News education evaluation criteria latest news Latest Telugu News standards Telugu News Vaartha Weightage

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.