📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Venezuela earthquake : వెనిజులా విలవిల

Author Icon By Sudha
Updated: June 27, 2026 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Venezuela earthquake : సహజ వనరులకు సంపన్నమైన ‘వెనెజులా’ ఒక్క సారిగా ప్రకృతి కళ్లెర్ర చేసి ఒకే ఒక నిమిషంలో 235 మందిని పొట్టన పెట్టుకుంది. ఎన్నో ఆర్ధిక రాజ కీయ, సామాజిక సంక్షోభంతో అతలాకుతలమవుతున్న ఆ దేశానికి నిన్నటి తాజా భూకంప విలయం సృష్టించిన విధ్వంన నష్టం తక్కువేమీ కాదు. లాటిన్ అమెరికాలో అత్యంత ధనిక దేశంగా పేర్కొనబడే వెనెజులాను అన్ని సమస్యలు ఒకేసారి చుట్టుముట్టేస్తున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం, భారీ వలసలు ఆ దేశాన్ని ఇబ్బందుల్లో ముంచెత్తాయి. కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న ఈ దేశం గత యేడాది ఆ దేశ అధ్యక్షుడిని అమెరికా బందీ చేయడంతో తీరని నష్టం పొందింది. తాత్కాలిక పాలనలో ఏమాత్రం కుదుర్చుకున్నట్లు లేదు. తీరా ఈ ఉత్పాతం పెను భూకంపంతో వెనెజులా చిగురుటాకులా వణికిపోయింది. నిమిషం వ్యత్యాసంలో రెండు భారీ భూ ప్రకంపనల ‘డబ్లెట్’ తో దేశమంతా ఒక్కసారిగా అల్లాడి పోయింది. కరాకస్, లా గువైరాల్లో భారీ విధ్వంసమే జరిగింది. భారీ భవనాలెన్నో కుప్ప కూలాయి. విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలు నామ రూపాల్లేకుండా పోయాయి. భూకంప తీవ్రత మానవ నష్టం భారీగానే జరిగింది.

Read Also : A series of earthquakes in Venezuela: వెనెజులాను వణికిస్తున్న వరుస భూకంపాలు: 4.9 తీవ్రతతో మరోమారు ప్రకంపనలు

Venezuela earthquake

Venezuela earthquake :ఎంత ప్రాణ నష్టం వాటిల్లిందో చెప్పలేని పరిస్థితి

ఉత్తర వెనెజులాలో గురు వారం రెక్టర్ స్కేలుపై 7.2, 7.5 తీవ్రతలతో రెండు శక్తివంతమైన భూకంపాలు నమోదయ్యాయి. కూలిన భవన శిధిలాల్లో వేల మంది ఉండి ఉండచ్చునని ఒక అంచనా. కానీ శిధిలాలు తొలగిస్తే తప్ప ఎంత ప్రాణ నష్టం వాటిల్లిందో చెప్పలేని పరిస్థితి. ఒక ప్రకృతి విపత్తు ఎంతటి మానవ విషాదంగా మారుతుందో ఈ భూకంప దుర్ఘటనలు వివరిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ముందుగా కాలిఫోర్నియా, తర్వాత వెనెజులా, ఆ తర్వాత జపాన్లో వరుస భూకంపాలు రావడం నిజంగా ఆశ్చర్యకరమే. వెనెజులా భూకంపం గురించి గూగుల్ కాస్త ముందుగానే అప్రమత్తం చేసింది. ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక సంకేతాలు పంపింది. అయినా తక్షణ అప్రమత్తత చేసుకోగల వ్యవస్థలను వెనెజులా అభివృద్ధి చేసుకోలేక పోయినందున ప్రాణనష్టం తగ్గించు కోలేకపోయింది. ప్రకృతి విపత్తులను అడ్డుకోవ డం మానవ సాధ్యం కాదు. కానీ వాటి ప్రభావాన్ని తగ్గించు కునే విధంగా మానవాళిని సిద్ధం చేయడంలో వెనెజులా వెనుకబడింది. ఈ విషాద తీవ్రత, అప్రమత్తత లేని భూకంప వాతావరణం వెరసి వెనెజులాను ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితులు తెచ్చి పెట్టాయి. నాణ్యమైన మౌలిక సదుపాయాలున్న చోట్ల ప్రకృతి విపత్తులను మానవ విపత్తులుగా మారకుండా గణనీయంగా తగ్గిం చుకోవడం ఎంతో అవసరం. ఎన్నో చమురు బావుల్ని, సంపదను తనలో ఇముడ్చుకున్న వెనెజులాలో భూకంప నిరోధక నిర్మాణ నిబంధనలంటూ ఏమీ లేవు. ఎప్పటి కప్పుడు పాత భవనాల భద్రతా అంచనాలు, నూతన భవనాల నిర్మాణంలో ఆధునిక నిర్మాణ వ్యవస్థలను బలోపేతం చేయడంలో అక్కడి పాలనా వ్యవస్థకు ఇంకా అలవాటుకాలేదు.

ప్రకృతి విపత్తు

ఈనాటి భూకంపం చాలా రోజుల తర్వాత వచ్చినందున భూకంప సమీక్ష అప్రమత్తత కష్ట మైనదే. వెనెజులా భూకంపం ప్రమాదనంతర చర్యలు, విపత్తు నిర్వహణా సామర్ధ్యాల విషయమై ప్రపంచానికే ఓ హెచ్చరిక కాగలదు. ప్రపంచ వ్యాప్తంగా జపాన్, చిలీ, వంటి భూకంప ప్రభావిత దేశాలు, కఠిన నిర్మాణ ప్రమా ణాలు, ముందస్తు హెచ్చరికల ప్రమాణాలు, ప్రకృతి విప త్తులనెదురో వడంలో ప్రజలకు అవగాహన, సిబ్బందికి శిక్షణ వంటివన్నీ ఆయా దేశాలను స్వయం సిద్ధం చేస్తా యి. కానీ మిగిలిన దేశాల్లో ఈ వ్యవస్థలు లోపభూ యిష్టంగా ఉన్నాయి. ఇప్పటికే వెనెజులా ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, సరైన పాలనాలేమి వంటి అంశాలు ఆ దేశాన్ని తిరోగమనంలోకి నెట్టుతున్నాయి. భూకంప ప్రభావంతో ఎంతో మంది నిరాశ్రయుల య్యారు. జూన్ 25న తెల్లవారుఝామున 3.34 నిమి షాలకు వెనెజులాలో భూకంపం జరిగింది. కాస్త అటూ ఇటూలో మూడు ఖండాల్లో భూకంపాలు రావడానికి ఏమాత్రం సంబంధం లేదు. మొత్తంగా వెనెజులాకే ఎక్కువ నష్టం సంభవించింది.

Venezuela earthquake

ఆండ్రాయిడ్ ఫోన్ల

గతం కన్నా నయం ‘భూకంపం చెప్పి రాదనే’ పరిస్థితి నుంచి ఈసారి వెనె జులాలో భూకంపం వస్తోందని గూగుల్ ఆ దేశంలోని లక్షలాది ఆండ్రాయిడ్ ఫోన్లలో భూకంప హెచ్చరికలను ముందే మోగించింది. కానీ వారిలో సంసిద్ధత కనుపిం చలేదు. దాని బాధ్యత పాలక ప్రభుత్వాలు రూపొందించే ప్రణాళికలు, వ్యవస్థ లదే. గూగుల్ ఆండ్రాయిల్ ఎర్త్ క్వేక్, అలర్ట్ సిస్టమ్ ఉండటం తక్షణ స్పందనతో ప్రజల్ని తనకున్న వనరుల మేరకు భూకంప హెచ్చరికలు పంప డం ఆధునిక యుగంలో ఆహ్వానించదగినదే. గూగుల్ తపని తాను చేసింది. స్వల్ప సమయంలో భూమి కంపించడంతో ఎవరూ ఏమాత్రం జాగ్రత్త పడలేకపో యారు. ఇంతవరకు గతం ప్రస్తుతంలోకి వస్తే వెనెజులా ప్రభుత్వం ఏవిధంగా భూకంప పర్యవసానాలను గట్టె క్కించగలదో వేచి చూడాలి. దెబ్బతిన్న ఇల్లు ఆసుపత్రుల పునర్నిర్మాణం కోసం రూ.1890 కోట్లతో ప్రత్యేక ఫండ్ను ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేగ్జి ప్రకటించారు. వెనెజులాలో గత వందేళ్లలో సంభవించిన అతిపెద్ద భూకంపం ఇదే. సమీపంలోని బ్రెజిల్, కొలం బియా సహా మరికొన్ని దేశాల్లో భూకంపనలు వ్యాపిం చాయి. అక్కడ పెద్ద నష్టమేమీ లేదు. భూప్రకంపనలతో వేలాది మంది చనిపోయి ఉండొచ్చునని అధికారులు అంచనా వేశారు. ఏదిఏమైనా వెనెజులాలకు రాకూడని కష్టం వచ్చింది. ఇప్పుడు బాధితులకు సత్వర సేవలను ఆధునిక విధానంలో అందించడమొక్కటే ఆ దేశ లక్ష్యంగా కనపడుతోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News Earthquake latest news Latest Telugu News Natural Disaster South America Telugu News Vaartha Venezuela Venezuela Earthquake

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.