📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tourism Sector :పర్యాటక రంగంలో భద్రతకే మొదటి ప్రాధాన్యత

Author Icon By Sudha
Updated: July 18, 2026 • 5:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tourism Sector : భారతీయులలో అంతర్జాతీయ విహారయాత్రల పట్ల ఆసక్తి గడిచిన కొద్ది కాలంగా ఊహించని స్థాయిలో వృద్ధి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలను సందర్శించాలనే కాంక్షతో లక్షలాది మంది ప్రజలు విదేశీ ప్రయాణాలను ప్రణాళిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం, థాయ్లాండ్, సింగ పూర్, మలేషియా వంటి ప్రాంతాలు భారతీయ పర్యాటకు లకు అత్యంత అనుకూలమైన వేదికలుగా మారాయి. ఈ దేశాలలోని వైవిధ్యభరితమైన సంస్కృతి, ప్రకృతిఅందాలు, సులభతరమైన ప్రయాణ వసతులు పర్యాటకులను విశేషం గా ఆకర్షిస్తున్నాయి. అయితే పర్యాటక రంగం ఇంతగా విస్తరిస్తున్న తరుణంలో, ఇటీవల వియత్నాం దేశంలో చోటు చేసుకున్న స్పీడ్ బోట్ ప్రమాదం అంతర్జాతీయ పర్యాటక రంగంలో భద్రతా ప్రమాణాల ఆవశ్యకతను, అత్యవసర రక్షణ చర్యల ప్రాముఖ్యతను ప్రపంచానికి స్పష్టంగా గుర్తు చేసింది.

Read Also : Odisha Rath Yatra : రథయాత్రలో 103 మంది మొబైల్ దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

Tourism Sector

Tourism Sector : జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాల

విహారయాత్ర అనేది మానసిక ఉ ల్లాసాన్ని, జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాలను అందించాల్సిన అద్భుతమైన అనుభవం. కానీ అతిచిన్న నిర్లక్ష్యం లేదా భద్రతా లోపాలు సంభవించి నప్పుడు ఆ ఆహ్లాదకరమైన వాతావరణం క్షణాల్లో తీవ్ర విషాదంగా మారుతుందనే కఠిన వాస్తవాన్ని వియత్నాం పడవ ప్రమాద ఘటన నిరూపించింది. అందుబాటులోకి వచ్చిన ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణంలో ఆకస్మాత్తుగా తీవ్ర మైన మార్పులు సంభవించాయి. ఆ సమయంలో స్పీడ్ బోట్ చురుగ్గా, వేగంగా మలుపు తిరగడం, అదే క్షణంలో పడవలోని ప్రయాణికులందరూ ఒకే వైపునకు కదలడం వల్ల జలవాహనం తన సమతుల్యతను కోల్పోయి ఒక్కసా రిగా నీటిలో బోల్తా పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రయాణికుల రక్షణకు అవసరమైన ప్రాణరక్షక జాకెట్లు బోట్లో అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిని ప్రతి ప్రయా ణికుడు నిబంధనల ప్రకారం ధరించాడా లేదా అనే అంశం ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

Tourism Sector

పర్యాటకులకు కనీస అవగాహన

జలరవాణా రంగంలో ప్రాణరక్షక జాకెట్లు, సీటు బెల్టులు, ప్రయాణానికి ముందు ఇచ్చే అత్యవసర రక్షణ సూచనలు కేవలం కాగితాలకే పరి మితమయ్యే నిబంధనలు కావు. అవి మానవ ప్రాణాలను కాపాడే అత్యంత విలువైన రక్షణ కవచాలు. ప్రస్తుత రోజు ల్లో ప్రతి సంవత్సరం కోట్లాది మంది భారతీయ పౌరులు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. వివిధ కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థలు, స్నేహితుల సమూహాలు, కుటుంబాలుపెద్ద సంఖ్యలో అంతర్జాతీయ పర్యాటక ప్యాకేజీలను ఎంచుకుం టున్నారు. అయితే పర్యాటకులు తాము సందర్శించబోయే ప్రదేశాలలోని అందాలపై, వినోదంపై చూపేఆసక్తితోపాటు, అక్కడ లభించే భద్రతావసతులపై కూడా సమానమైన శ్రద్ధ చూపించాల్సిన బాధ్యత ఉంది. పర్యాటక సేవల నిర్వాహ కులు అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేస్తున్నారా లేదా అని ప్రయాణికులు ముందే పరిశీలించాలి. ప్రమాదకర పరిస్థితులు ఎదురైన ప్పుడు ఎలాస్పందించాలి. ప్రాణరక్షక పరికరాలను ఏ విధంగా ఉపయోగించాలని పర్యాటకులకు కనీస అవగాహన ఉండటం అవసరం. పర్యాటకరంగ నిర్వహణసంస్థలుకూడా వాతావరణ పరిస్థితులు అనుకూలించనప్పుడు ఎంతటి లాభదాయకమైన ప్రయాణాలనైనా నిస్సంకోచంగావాయిదా వేయాలి. ప్రతి ప్రయాణా నికి ముందు పర్యాటకులకు తప్పనిసరిగా రక్షణ సూచనలను వివరించాలి. |

-సి. హెచ్. ప్రతాప్


Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News Hospitality Industry latest news Latest Telugu News Telugu News Tourism safety tourism sector Tourist Security Travel Safety Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.