📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Opposition : బలమైన ప్రతిపక్షం చరిత్రాత్మక అవసరం

Author Icon By Sudha
Updated: August 11, 2026 • 5:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Opposition : ప్రతిపక్షాల పునర్నిర్మాణమే ప్రజాస్వామ్యానికి బలం భారతదేశ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, ప్రతి దశ లోనూ సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులకు అను గుణంగా కొత్త రాజకీయ శక్తులు, కొత్త భావజాలాలు అవి ర్భవించాయి. స్వాతంత్ర్యానంతరం భారత జాతీయ కాంగ్రెస్ దేశ రాజకీయాలను దశాబ్దాల పాటు ప్రభావితం చేసింది. అనంతరం అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) నేప థ్యంలో జనతా పార్టీ ఆవిర్భావం, ప్రాంతీయ పార్టీల ఎదు గుదల, సామాజిక న్యాయ ఉద్యమాల ప్రభావంతో వెనుక బడిన వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం పెరగడం వంటి పరి ణామాలు భారత ప్రజాస్వామ్యాన్ని మరింత విస్తృతం చేశాయి. మండల్ ఉద్యమం, రైతాంగ పోరాటాలు, దళితబహుజన ఉద్యమాలు, ప్రాంతీయ స్వాభిమాన ఉద్యమా లు దేశ రాజకీయాలకు కొత్త దిశను చూపించాయి. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంద్వారా సమాఖ్య వ్యవస్థ మరింత బలపడింది. కేంద్రరాష్ట్ర సంబం ధాలపై కొత్త చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే గత దశాబ్దంలో బిజెపి దేశ రాజకీయాల్లో ప్రధాన శక్తిగా ఎది గింది. బలమైన సంస్థాగత నిర్మాణం, విస్తృత ఎన్నికల వ్యూహం, నాయకత్వ కేంద్రీకరణ, సంక్షేమ పథకాల ప్రచా రం, డిజిటల్ ప్రచార వ్యవస్థ వంటి అంశాలు ఆపార్టీ విజ యాలకు దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొం టున్నారు.

Read Also : Rekha Gupta : ‘సరైన దుస్తులు ధరించండి’ AAP MLAకి రేఖా గుప్తా హితవు

Opposition

Opposition : బాధ్యతాయుతమైన ప్రతి పక్షం కూడా అవసరం

అనేకరాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ తన ప్రభావాన్ని విస్తరించగలిగింది. ఇదే సమయంలో ప్రతిపక్ష రాజకీయా లు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భావజాల స్పష్ట త లోపించడం, నాయకత్వ విభేదాలు, ప్రాంతీయ ప్రయో జనాలకే పరిమితమవడం, సమన్వయ లోపం, దీర్ఘకాలిక ప్రత్యామ్నాయ కార్యాచరణను ప్రజల ముందుంచడంలో వైఫల్యం వంటి కారణాలు ప్రతిపక్షాల బలహీనతరు దారి తీశాయి. కేవలం అధికార వ్యతిరేకత సరిపోదు. ప్రజల విశ్వా సాన్ని గెలుచుకునే విధానాలు, విశ్వసనీయ నాయకత్వం, కార్యాచరణ కూడా అవసరం. ఈనేపథ్యంలో కాంగ్రెస్, వివిధ ప్రాంతీయ పార్టీలు, రైతు, కార్మిక, విద్యార్థి, మహిళా, దళిత, ఆదివాసీ, వెనుకబడిన వర్గాల ప్రజా సంఘాలు పరస్పర సంభాషణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే అలాంటి సమన్వయం రాజ్యాంగ విలు వలు, ప్రజాస్వామ్య సూత్రాలు, విధానాలపై ఆధారపడాలి. కేవలం ఎన్నికల కూటమిగా మాత్రమే పరిమితం కాకూడ దు. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, సమాఖ్య వ్యవస్థ, పారదర్శక పరిపాలన, ఉపాధి, విద్య, ఆరోగ్యం, వ్యవసా యం, ఆర్థికాభివృద్ధి వంటిఅంశాలపై ప్రత్యామ్నాయ కార్యా చరణను ప్రజలకు వివరించగలిగితేనే బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పడే అవకాశంఉంటుంది. భారత ప్రజా స్వామ్యం బలంగా ఉండాలంటే అధికార పక్షంఎంత బలం గా ఉండాలో, అంతేబలమైన, బాధ్యతాయుతమైన ప్రతి పక్షం కూడా అవసరం. అధికారాన్ని ప్రశ్నించే స్వరం ప్రజాస్వామ్యానికి అంతర్భాగం. అదే సమయంలో ప్రతి పక్షం కూడా విమర్శలతో పాటు నిర్మాణాత్మక సూచనలు, అమలు చేయగల విధానాలను ప్రజల ముందుంచాలి. భారత రాజకీ యాల భవిష్యత్తు ఒకే పార్టీ విజయం లేదా ఓటమితో నిర్ణ యించబడదు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ స్ఫూర్తినికాపాడే ప్రజాస్వామ్య సంస్కృతి, సామాజిక సమానత్వాన్ని బలోపేతం చేసే విధానాలు, బాధ్యతాయుత రాజకీయ పోటీ ఇవే దేశ ప్రగతికి నిజమైన పునాదులు.

-సురేష్ కాలేదు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News Democracy Indian Politics latest news Latest Telugu News opposition Political Opposition Strong Opposition Telugu News Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.