📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Single Window : సింగిల్ విండోలపై రాజకీయ పట్టు మంచిదేనా?

Author Icon By Sudha
Updated: September 7, 2026 • 4:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Single Window : రైతు రుణం, ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోళ్లతో ముడి పడిన ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘాలు ప్రజల నోట సింగిల్ విండోలుగా పేరుపొందాయి. రైతుల భాగస్వామ్యంతో నడిచే ఈ సంస్థలకు నాయకత్వాన్ని రైతులే ఎన్నుకోవా లా? లేక ఎన్నికలు నిర్వహించకుండా రాజకీయ, పరిపాలనా నియామకాల తో పాలకవర్గాలను ఏర్పాటు చేయా లా? తెలంగాణలో ఇప్పుడు ఇదే అసలు ప్రశ్న. జీవో ఆర్ నంబర్ 597కు సంబంధించిన న్యాయపరమైన పరిణామాలు ఈ చర్చకు మరింత ప్రాధా న్యం తెచ్చాయి. ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకో వడం, గతఎన్నికైన పాలక వర్గాల కొనసాగింపుపై హైకోర్టు ముందు చోటుచేసుకున్న పరిణామాలు ఒక విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. తాత్కాలిక ఏర్పాట్లు శాశ్వత పరిష్కారం కావు. సహకార రంగానికి దీర్ఘకాలిక మార్గం చట్టబద్ధమైన ఎన్నికలే. తెలంగాణలో మొత్తం 60,925 సహకార సంఘాలు ఉన్నట్లు అందుబాటులో ఉన్న గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో రైతులకు ప్రత్యక్ష సంబంధం ఉన్న పీఏసీఎస్లు 906. తొమ్మిది జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల వరిధిలోని ఈ సంఘాల్లో 906 చైర్మన్ పద వులు, సుమారు పది వేల డైరెక్టర్ స్థానాలు ఉన్నాయి.

Read Also : AP pensions eligibilit: గ్రామాల్లో మళ్లీ పెరిగిన పింఛన్ల టెన్షన్


Single Window

Single Window : రైతు ఓటుపై తాళం

అంటే గ్రామీణ స్థాయిలో వేలాది నాయకత్వ అవకాశాలు, రైతుల ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడిన కీలక వ్యవస్థ. జీవో 597 చుట్టూ సాగిన పరిణామాలు ఈ పదవుల భవి ష్యత్తుపై కొత్త చర్చకు తెరతీశాయి. రైతు సంస్థల నాయ కత్వం ఎన్నికల ద్వారా రావాలా, నియామకాల ద్వారా రావాలా అన్న ప్రశ్నకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. తాత్కాలిక పాలన ప్రజాస్వామ్యానికి శాశ్వత ప్రత్యామ్నా యం కాదు. సింగిల్ విండోలు సాధారణ ప్రభుత్వ కార్యా లయాలు కావు. సభ్యుల భాగస్వామ్యం, ఆర్థిక కార్యకలా పాలు, రుణాలు, గ్రామీణ వ్యవసాయ అవసరాలతో ముడి పడిన సహకార సంస్థలు. ప్రభుత్వం వాటిని పర్యవేక్షించ వచ్చు. అవకతవకలు జరిగితే విచారణ చేయవచ్చు. నిధుల దుర్వినియోగం నిర్ధారణైతే బాధ్యులపై చర్యలు తీసుకో వచ్చు. ఓటర్ల జాబితాల్లో లోపాలుంటే సరిచేయవచ్చు. కానీ కొందరి తప్పుల పేరుతో చట్టబద్ధంగా ఓటు హక్కు ఉన్న రైతు సభ్యుల ఎన్నికల అవకాశాన్ని నిరవధికంగా పక్కనపెట్టడం సరైన పరిష్కారం కాదు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోండి.. కానీ రైతు ఓటుపై తాళం వేయకండి. జగిత్యాల జిల్లా పోతారం సింగిల్ విండో సొసైటీ రైతుల ఐక్యతతో రెండు కోట్ల రూపాయల ఆదా యాన్ని సొంతంగా సమకూర్చుకుందని స్థానికులు చెబు తున్నారు. ఎన్నికైన పాలకవర్గం ఉంటే ప్రశ్నించే గొంతుకు అవకాశం ఉంటుంది. నామినేటెడ్ వ్యవస్థలో భిన్నాభిప్రా యాలకు స్థానంతగ్గిపోతుందన్న ఆందోళన ఉంది. సంఘా ల ఆర్ధిక వనరుల వినియోగంపై పారదర్శకత, సభ్యులకు జవాబుదారీతనం ఉండాలంటే ప్రజాస్వామ్యబద్ధమైన పాలకవర్గాలే బలమైన మార్గం.


Single Window

మా సంఘానికి నాయకుడిని మేమే ఎన్నుకునే రోజు

ఇది ఒక్కపోతారంసమస్య కాదు, రాష్ట్రవ్యాప్తంగా సహకార రంగం భవిష్యత్తుకు సం బంధించిన అంశం. రైతు డబ్బు, రైతు భాగస్వామ్యంఉన్న చోట రైతు స్వరం కూడా ఉండాలన్నదే సహకార స్ఫూర్తి. సహకార సంఘం అధ్యక్ష పదవి ఎవరికైనా రాజకీయ బహుమతిగా మారకూడదు. రైతు ప్రయోజనాలకుకట్టుబడి పనిచేసే వ్యక్తి సభ్యుల విశ్వాసాన్ని ఎన్నికల్లో పొందే అవ కాశం ఉండాలి. రాజకీయ పార్టీలకు చెందిన రైతులుకూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, గెలవవచ్చు, ఓడిపోవచ్చు. అదే ప్రజాస్వామ్యం. కానీ ముందుగానే నామినేషన్ల ద్వారాపాలక వర్గాలను ఏర్పాటు చేస్తే ఎంపికకు ప్రమాణం ఏమిటి? రైతు ప్రయోజనమా, రాజకీయ విధేయతా? అన్న సందేహాలు రావడం సహజం. వాటికి తెరపడాలంటే ఎన్నికలే ఉత్తమ మార్గం. ఇక తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి. పదవీకాలం ముగిసిన సంఘాల వివరాలను వెల్లడించాలి. చట్టం, సంఘాల ఉపనియమాల ప్రకారం ఓటు హక్కు ఉన్న సభ్యులతో పారదర్శక ఓటర్ల జాబితాల ను సిద్ధంచేయాలి. అభ్యంతరాలకు అవకాశం ఇచ్చి వాటిని పరిష్కరించాలి. అనంతరం దశలవారీగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలి. ఎన్నికలు పూర్తయ్యే వరకు అవసర మైనచోట మాత్రమే పరిమిత కాలపు చట్టబద్ద ఏర్పాట్లు ఉండాలి. అవి శాశ్వత నామినేటెడ్ పాలనగా మారకూడదు. రైతు సంక్షేమం అంటే కేవలం రుణమాఫీ, సబ్సిడీలు, పథకాలే కాదు. రైతుకు తన సంస్థనిర్వహణలో భాగస్వామ్యంకల్పిం చడం కూడా సంక్షేమమే. ‘మా సంఘానికి నాయకుడిని మేమే ఎన్నుకునే రోజు ఎప్పుడు?’ అన్న రైతు ప్రశ్న కేవ లం పదవుల వివాదం కాదు. సహకార వ్యవస్థ స్వరూపం, రైతు భాగస్వామ్యం, గ్రామీణ ప్రజాస్వామ్యానికి సంబం ధించిన పరీక్ష. ఈ ప్రశ్నకు ప్రభుత్వం మాటలతో కాదు ఎన్నికల నోటిఫికేషన్తో సమాధానం చెప్పాలి. నామినేటెడ్ పోస్టులు వద్దు, సింగిల్ విండోలకు ఎన్నికలు కావాలి! రాజకీయ పట్టు కాదు రైతు ఓటే గెలవాలి!

-శ్రీశైలం దూడం

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Breaking News Governance government latest news Latest Telugu News political control political influence Politics single window Telugu News Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.