Single-teacher school : ఏకోపాధ్యాయ పాఠశాలల్లో, 5 తరగతులు, 18 సబ్జెక్టులు, సుమారు 250కి పైగా పాఠాలు, 800పీరియడ్లు, 200 పనిదినాలలో సుమారు 180 బోధనా రోజులు, నీతి ఆయోగ్ చెప్పినట్టు 14 శాతం బోధనేతర పనులు, కాంప్లెక్స్. సమావేశాలు, అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలు ఇవన్నీ ఏకపాధ్యా యుని ప్రతి పాఠశాల దిన చర్య బహుళ తరగతి, బ హు భాషా నేపథ్యాల విద్యార్థులు, వివిధ స్థాయి విద్యా సామ ర్థ్యాల విద్యార్థులు, రెండు మాధ్యమాలు ఇలా లెక్కిస్తే ఏకో పాధ్యాయ పాఠశాలల ఉపాధ్యాయుల, మానసిక ఒత్తిడి, బోధనలో ఎదురౌతున్న సమస్యలు వర్ణనాతీతం. మరొక వైపు తక్కువ మంది పిల్లలు 5 శాతం లేదా 10 శాతం కావొచ్చు. వారిలో ఎంతమంది ప్రతి రోజూ పాఠశాలకు వస్తారో తెలియని అనిచ్చితి. పిల్లలతో కళకళలాడాల్సిన ప్రాంగణంలో ఉపాధ్యాయులకు పిల్లలకు ఒక నిశ్శబ్ద వాతావరణం, ఆటలు, పాటలు, వినోదం కొరవడిన ఒక నిర్లిప్తత. ఒకే ఉపాధ్యాయుడు సవ్యసాచిలా ప్రధానోపాధ్యా యుడుగా, సబ్జెక్టు బోధకుడుగా, సమయ పాలకుడిగా బహుళ తరగతులు, అకడమిక్ బాధ్యతలు. దీనికి తోడు ఉ దయం ఉపాహార, మధ్యాహ్న భోజన నిర్వహణ, స్టాక్ నమోదు, రిపోర్టుల తయారీ, ప్రాంగణంలో శుచి శుభ్రతలపై జవాబుదారీతనం, తలిదండ్రులకు, అధికారులకు, ప్రభుత్వా నికి ఒకే ఒక్కరు అన్నట్టు తనే జవాబుదారు. అయితే వర్క్ ఎడ్జెస్టుమెంట్ ప్రాతిపదికన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అదనపు ఉపాధ్యాయులను నియమించినట్లు, బ హుళ తరగతి బోధనకై మాడ్యూల్ రుపొంచింది ప్రత్యేక శిక్షణ అందించినట్లు, ఈ లోటును చాలా రాష్ట్రాలు భర్తీ చేస్తు న్నట్టు తెలుస్తోంది. అయితే పదిమంది లేదా తక్కువ నమోదు వున్న పాఠశాలల పరిస్థితిని పునఃసమీక్షించాల్సిన అవసరం, ఒక శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ రూపొం దించడం తప్పనిసరి.
Read Also : NEET PG Counselling: అక్టోబర్ 12 నుంచి నీట్ పీజీ రిజిస్ట్రేషన్లు
Single-teacher school : బడుగు బలహీన వర్గాల పిల్లల విద్యా హక్కు ఎలా?
దేశంలో యూ డైన్ 2025-26 ప్రకారం ఏకోపాధ్యాయ పాఠశాలలు 1.00,843 లక్షలు ఉండంగా ఆ బడుల్లో 29.14 లక్షల మంది పిల్లలు చదు వుతున్నట్టు, వీరిలో 27.7 శాతం మంది గిరిజన, షెడ్యూల్ కులాలకు చెందిన పిల్లలు చదువుతున్నారు. ఈ పాఠశాలలు 89 శాతం గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. నీతి ఆయోగ్ డైన్ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 4793 అనగా 11.5 శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలుండగా, 30 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు 60శాతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా 16,357 పాఠశాలలు అనగా 26.9, దేశంలో అత్యధిక శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలున్న రాష్ట్రంగా ప్రథమ స్థానంలో ఉండగా తెలంగాణ రాష్ట్రం తక్కువ శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నట్టు తెలు స్తోంది. ఉత్తరప్రదేశ్లో 7,874, జార్ఖండ్ 9827, మహా రాష్ట్ర 9269, కర్ణాటక 8042, వెస్ట్ బెంగాల్ 6769, రాజస్థాన్ 6200 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నట్టు నివేదిక. ఒకే ఉపాధ్యాయుడితో పాఠశాలలు నడుస్తుంటే ప్రభుత్వ పాఠశాలలపై ఆధారపడి చదువుతున్న బడుగు బలహీన వర్గాల పిల్లల విద్యా హక్కు ఎలా? సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయులు లేక, ఒక ఉపాధ్యాయుడు ఇటు పాఠాలు, పరిపాలన, పాఠశాలేతర బాధ్యతలు నిర్వహిస్తుం టే బాలల భవిష్యత్తు ఎలా నిర్మించబడుతుందని నిపుణులు వాపోతాన్నారు.
విద్యా విధాన ప్రధాన లక్ష్యం
బహుళ తరగతులు, బహు భాష, విభిన్న స్థాయి విద్యా సామర్ధ్యాలు, పాఠశాలలో ఒక్కరున్నా ఇద్దరు పిల్లలున్నా సంఖ్యప్రతిపాదికను పరిగణించకుండా, నాణ్య మైన చదువు అందుబాటులో తేవడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం. తరగతి గదిలో 20 మందిలో 10 మంది బాగా రాణిస్తుంటే వారే మన టార్గెట్ అనుకుంటే సాధించాల్సిన సమ్మిళిత విద్యకు అన్యాయం జరిగినట్టే. ఎవరైతే అభ్యసనా సామర్థ్యాలను సాధించలేక వెనుకబడి ఉన్నారో, తరగతి గదిలో అందరితో బాటు వారిని తీర్చిదిద్దడం విద్యా విధాన ప్రధాన లక్ష్యం. తక్కువ నమోదు. ఏకోపాధ్యాయ పాఠశాల లపై ప్రత్యేక శ్రద్ధ కనబరచకపోతే బాలల విద్యా హకు స్త్రీలకు విఘాతం కలిగినట్టే. ఈ పరిస్థితిని విశ్లేషిస్తే మారుమూల గిరిజన ప్రాంతాల్లో బహుభాషా విషవలయంలో చిక్కుకున్న విద్యార్థుల పరిస్థితి మరింత జఠిలంగా ఉంటుందనేది నిత్య సత్యం, ఎక్కువ శాతం గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోనే ఈ తరహా పాఠశాలలు ఉన్నట్టు గణాంకాలు తెల్పుతున్నాయి. మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, దుస్తులు వంటి ఉచితాలు కన్నా నాణ్యమైన విద్యను అందించి ప్రతి పిల్లవాడిని ప్రయోజకుడిగా ఉత్తమ పౌరుడిగా తీర్చి దిద్దడం ప్రధాన లక్ష్యం. తక్కువ నమోదు, ఏకో పాధ్యాయుని పాఠ్య బోధన, అరకొర నదుపాయాలు, అలవికాని బోధనా వ్యూహాలువెరసి ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం సన్నగిల్లి ఉన్న పిల్లల్ని దగ్గ రలో వున్న ప్రైవేట్ బడుల్లో చేరుస్తున్నారు లేదాబడి మాని పించేసి పనుల్లో పెడుతున్నారు.
భాగస్వామ్యాన్ని బలోపేతం చెయ్యాలి
ఏకోపాధ్యాయులు ప్రయ త్నించినా సహ ఉపాధ్యాయులు కనీసం సబ్జెక్టు వరంగా లేక ఫలితం శున్య మే అవుతుంది. ఈ పరిస్థితిలో వున్న పాఠశాలలు దగ్గర్లో ఉన్న పాఠశాలలతో విలీనం చెయ్యాలీ అంటే విద్యా హక్కు నిబంధనలను ఉల్లంఘించినట్టే! లేక నమోదు పెంచాలంటే ఒక స్పష్టమైన దీర్ఘకాలిక ప్రణాళిక, కార్యాచరణ అనివార్యం, దానికంటే ముందు ప్రస్తుత పాఠ శాలలో వున్న కొద్దిపాటి విద్యార్థుల ప్రగతి పురోగమిస్తేనే తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతుంది. ఏకోపాధ్యాయ పాఠ శాలల పిల్లల ప్రగతి స్పష్టంగా కనబడితేనే ఎక్కువ మంది పిల్లలు చేరడానికి దోహదపడుతుంది. అందుకు ఉన్న అవ కాశాలను ఉపయోగించుకొని వినూత్న వ్యూహాలతో ప్రతి విద్యార్థి ప్రగతి, అభ్యసనా సామర్థ్యాలను మెరుగుపరిస్తే పాఠశాల తానంతట తానే విద్యార్థులను ఆకట్టుకుంటుంది. సరిపడినన్ని తరగతి గదులు ఉన్నా లేకున్నా ఉన్న తరగతి గదులను పాఠశాలను చక్కటి రంగులతో, కాన్సెప్ట్ పెయిం టింగ్ ద్వారా మౌలిక వసతుల మెరుగుదలతో సుందరికీ రించాలి. నీరు, పారిశుధ్య వసతులు, తాగు నీటి సరఫరా లను మెరుగుపరచాలి. బాలికలకు ప్రత్యేక వసతులు కల్పిం చడం ద్వారా వైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పరచాలి. పాఠ శాల యాజమాన్య కమిటీలను నిరంతర సమావేశాలతోవారి భాగస్వామ్యాన్ని బలోపేతం చెయ్యాలి. చదువుతోపాటు క్రీడ ల పట్ల శ్రద్ధవహించి ప్రోత్సహించాలి. ముఖ్యమైన పండుగ దినాలను పాఠశాల ప్రాంగణంలో వేడుకలను నిర్వహించి తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని బలపరచాలి. ఒక విద్యార్థిని బడికి చేర్చడానికి జపాన్ ప్రభుత్వం బులెట్ ట్రైన్కు క్యుషిర్ టాకీస్టేషన్ వద్ద స్టాప్ ఏర్పరచి తన బాధ్యతను చాటుకున్న ఉదాహరణలను మనం తీసుకోవడం తప్పని సరి. ఫిన్లాండ్ మాదిరి సులభంగా బోధించేలా స్థానికతను జోడిస్తూ ప్రత్యేక కరికులంను రచించుకొనే ప్రతిపత్తిని ఏకోపాధ్యాయ పాఠశాల కు కల్పిస్తేశాశ్వత పరిష్కారంలభిస్తుందేమో యోచించాలి.
-మల్లాడి శ్రీనగేష్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: