📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Protest : ‘ జెంజి’ మారుతం!

Author Icon By Sudha
Updated: October 13, 2026 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Protest : పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? అనే ధోరణిలో సుప్రీంకోర్టు ధర్మాసనం కాక్రోచ్ జనతాపార్టీ, కాంగ్రెస్ ఆందోళన లపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పు పట్టింది. శుక్రవారం ‘ఈగను చంపడానికి సుత్తిని ఉపయో గించకూడదని సుప్రీం ప్రభుత్వ చర్యలను ఎద్దేవా చేస్తూ మందలించింది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం సిఇసి రాజీనామా కోరుతూ వివిధ వర్గాలు, పార్టీల నేతృత్వంలో జరిగిన నిరసన సభలతో, ప్రదర్శనలతో న్యూఢిల్లీ అట్టు డికిపోయిన సంఘటన గురించి సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. మెట్రోస్టేషననమూసివేత కోర్టు ధిక్కారణే అని ధర్మాసనం చెప్పింది. సిజెపి ఆందోళనలతో మెట్రో సర్వీసు, మరికొన్ని రైలు సర్వీసులను రద్దు చేయడంతో దేశ ప్రజలంతా దృష్టి అటువైపు మళ్లింది. ఇందులో ఉద్య మంతో కానీ ప్రభుత్వ నిర్ణయాలతో ఏమాత్రం సంబంధం లేని ఢిల్లీ ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు. ఈ నిరసన ప్రకంపనలు దేశవ్యాప్తంగా మిన్నుముట్టాయి. లక్షలాది మంది నిరసన కారులను మార్గమధ్యంలోనే అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అశుతోష్ రాంకాలను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రాజధాని నగరం దిగ్బంధానికి గురైంది.

Read Also : CJP Leaders Detained At Jantar Mantar : త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం చట్ట విరుద్ధమా? : అభిజీత్​ దీప్కే

Protest

Protest : యువతరానిదే పై చేయి

ఒక రాజ్యాంగ అధిపతి ఏకపక్ష నిర్ణయాలకు, ఓటు హక్కుపై గొంతెత్తిన విపక్షాలు, విద్యార్థులు తదితర యువత మధ్య సాగుతున్న ‘నిరసన ఘోష’ రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగే ఎత్తులు పై ఎత్తుల స్థాయిలో సాగుతోంది. నిన్న గాకమొన్న సిఇసికి అనుకూలంగా పూర్వ న్యాయమూర్తులు, తాజాగా మాజీ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులువత్తాను పలికారు. సాధారణంగా ‘ఓటు హక్కు’ అంశంపై’ ల కన్నా సిఇసి హోదాలో ఉన్న జ్ఞానేష్కుమార్ వ్యక్తిగత హోదాకే వారి మద్దతు ఇచ్చినట్లు అనిపిస్తోంది. ‘ఓటు హక్కు’ కోల్పోయిన వారి విషయంలో కూడా వారి మద్దతు అవసరముంది. ఒకప్రక్క ప్రధాని నరేంద్రమోడీ సైతం ప్రపంచానికి ప్రస్తుతం ఎంతో అవసరాలను అందించేశక్తి సామర్థ్యాలు ‘జెనీ’ యువతకే ఉందంటూనే మరోపక్క వారి మీద దాష్టీకాలు జరిగినా నోరు మెదపడం లేదనే అపప్రధనెదుర్కొంటున్నారు. చెప్పాలంటే ప్రశ్నించే హక్కు ను కాలరాస్తున్నారా అని అనిపిస్తోంది. వీటన్నిటినీ చూస్తే ‘జెనీ’ ఏ పేరున పిలిచినా ఎక్కడైనా యువతరానిదే పై చేయి అనే పరిస్థితులను పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ఒకసారి చేపట్టిన తొలినాటి ఉద్యమంలో విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ రోజు న కూడా ‘జెన్జ’ ఉద్యమాన్ని తక్కువ అంచనా వేయడం వలనే పరిస్థితులు చేతులు దాటిపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం లొంగక తప్పలేదు. తదుపరి జార్ఖండ్ ప్రభు త్వంపై కూడా విద్యార్థిలోకం ధ్వజమెత్తింది. సాధించింది.

యువతపై బలప్రయోగం చేయడం

ప్రభుత్వాలు తమకున్న ఆధిపత్య ధోరణిలో ఎలాపడితే అలా కార్యాచరణ చేపడితే తాము కూడా అదే దారిలో బీష్మించుకు కూర్చోగలమని, ఉద్యమించగలనని యువత తేల్చి చెప్పింది. ఇప్పుడు ‘జెన్సీ’ మరో ఉద్యమాన్ని నెత్తిన వేసుకుంది. ఆది నుంచి ‘నర్’ ఉద్యమాన్ని నిలబెట్టిందీ, పట్టువిడుపులు లేకుండా ముందుకురుకుతున్న ప్రధాన వివ క్షం కాంగ్రెస్కు తోడుగా ఇతర వివక్షాలు, నీడగా జెన్నీ యువత, విద్యార్థిలోకం కూడా ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసిన చందాన సిఇని జ్ఞానేశ్ కుమార్ పదవీ త్యాగం చేయాల్సిందేనంటూ ‘జైన్జ’ గొంతు కలిపింది. దేనికైనా తెగించేందుకు సిద్ధంగానే ఉంది. ప్రభుత్వ నిర్ణయాల్లో పార దర్శకత లేనందున్న యువత అసంతృప్తికి గురై తిరగబడు తోందన్న నిజాన్ని అన్యులు గ్రహించినంతగా కేంద్రప్రభు త్వం గ్రహించలేకపోవడం వలనే యువతలో ఆశాంతి ప్రబ లింది. ఎన్ని వ్యూహాలు పన్నినా యువతకు అందాల్సిన భరోసా ఏదీచిక్కడం లేదు. పైగా ఉద్యమిస్తున్న యువతపై బలప్రయోగం చేయడం ఏ ఇతర వర్గాలకూ నచ్చడంలేదు. యువత ప్రస్తుతం కాక్రోచ్ జనతాపార్టీ నేతృత్వంలో ఉద్య మాలకు ఆకర్షితులౌతోంది. నిరసనకారులు జంతర మంతర్ వైపు వెళ్తేనే పోలీసు గణం సహించలేకపోతోంది. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎఐఎస్ఎ, కాంతికారి యువత సంఘటన్ (కెవైఎస్) సభ్యులతోపాటు కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్త లను సైతం ఢిల్లీ పోలీసులు తీవ్రంగా ఆటంకపరిచారు. ఇవన్నీ యువతను అగ్రహవేశుల్ని చేసిన సంఘటనలే.

Protest

‘సర్’ ప్రక్రియ లోప భూయిష్టం

ఒక నాడు కేవలం విశ్వవిద్యాలయాలు కళాశాలలకే పరిమితమైన విద్యార్థి ఉద్యమాలు ‘జంతర్ మంతర్’ వరకు దారితీసా యంటే పాలకుల పట్ల యువతలో ఉన్న అసంతృప్తి విష యం ఆలోచించాల్సిందే. రాజధాని నగరం అట్టుడికి పోతోం దని పత్రికల పతాక శీర్షికలనెక్కుతున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ఢిల్లీలో ఏదో జరుగుతోందనే విష యం పౌరులకు దాదాపుగా చేరిపోయింది. అన్నివర్గాల నుంచి నిరసనలు మిన్నుముట్టాయి. ‘సర్’ _ ప్రక్రియ లోప భూయిష్టంగా ఉండటమే ఈ ఉద్యమాలకు అగ్గిరాజేసింది. ‘సర్’ ఉద్యమాల నేపథ్యాన్ని గ్రహించి దాని ప్రక్రియలో మార్పులు తేవడంగానీ ‘సర్’ ప్రక్షాళన గానీ పూర్తిగా జరు SMS గలేదనే చెప్పాలి. ఎన్నిసార్లు ‘సర్’ విషయంలో సుప్రీంకోర్టు మెట్టెక్కినా సరైనఊరట రాలేదని ప్రఖ్యాత న్యాయకోవి దుడు కపిల్ సిబాల్ సైతం చేతులెత్తేసారు, కానీసుప్రీంకోర్టు ధర్మాసనాధినేతలు -మాత్రం ప్రజలకు న్యాయం ప్రసాదిం చడంలోనూ, న్యాయం కలిగించామన్న నమ్మకం కలిగించ డంలోనూ తాము ముందుంటామని ఎంతో హుందాగా కపిల్సిబాల్ ఆవేదనకు సమాధానంగా వివరించారు. ఏది ఏమయినా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ విపక్షాలు చేపట్టిన నిరసనోద్యమంలో ప్రధాన భాగస్వామ్యంగా ఉన్న ‘జెనీ’ యువతను ప్రశాంతపరచడమొక్కటే పాలకుల ముందున్న తక్షణ కర్తవ్యం. యువతను నిర్మాణాత్మక కార్యక్రమాలవైపు మళ్లించాలన్న కేంద్రప్రభుత్వ యోచన మంచిదే అయినా అటువైపుగా కార్యాచరణ జరగడం అవశ్యం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News Gen Z Marutham Gen Z Protest Gen Z Storm latest news Latest Telugu News Political Protest Telugu News Vaartha Youth Protest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.