📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Plastic covers : సామాజిక ఉద్యమమే శాశ్వత పరిష్కారం!

Author Icon By Sudha
Updated: July 3, 2026 • 4:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Plastic covers : మనం ప్లాస్టిక్ను వాడుతు న్నామా.. లేక ప్లాస్టిక్కేమనల్ని వాడుకుంటూ నిశ్శబ్దంగా మన సమా ధిని తవ్వుతోందా? ఆధునిక మాన వాళి అలవాటు చేసుకున్న “యూజ్ అండ్ త్రో సంస్కృతి నేడు భూగోళా నికి నిశ్శబ్ద ముప్పుగా మారింది. ఉదయం లేచింది మొదలు పాలు, కూరగాయల నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి అవసరానికి ప్లాస్టిక్ కవ ర్లపై ఆధారపడటం ఒక సామాజిక వ్యసనంగా మారింది. కేవలం 12 నిమిషాల సగటు కాల పరిమితి కోసం మనం వాడి విసిరేసే ఈ ఒక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచి, ఈ భూమిపై పూర్తిగా విచ్ఛిన్నం కావడానికి 500 నుండి 1000 సంవత్సరాల సమయం పడుతుందనే నిజం మనల్ని నిలువునా వణికించకమానదు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం విడుదల చేసిన పర్యావరణ నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 10 లక్షల ప్లాస్టిక్ సంచులు వినియోగంలోకి వస్తున్నాయి. వాటిలో అత్యధికం చివరికి చెత్తకుప్పలకే చేరుతున్నాయి. ఇక్కడ ఉద్భవిస్తున్న పదునైన ప్రశ్న ఒక్కటే. పర్యావరణాన్ని నిశ్శబ్దంగా మింగేస్తున్న ఈ మహమ్మారిని అరికట్టడానికి తెచ్చిన కఠినమైన చట్టాలు, క్షేత్రస్థాయిలో ఎందుకు కాగితాలకే పరిమితమవుతున్నాయి?

Read Also : Shadnagar Petrol Bunk:పెట్రోల్ బంక్‌లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు!

Plastic covers

Plastic covers : ప్లాస్టిక్ వ్యర్థాలే ప్రధాన కారణమని..

ప్రస్తుత వర్షా కాలంలో విచ్చలవిడిగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి, ఆకాశం, జలాలను కలుషితం చేస్తూ పర్యావరణ సమతుల్యతను దారుణంగా దె బ్బతీస్తున్నాయి. ప్లాస్టిక్ సంచుల వల్ల మురుగు కాల్వలు, డ్రైనేజీ వ్యవస్థలు పూడి పోయి నగరాలు స్వల్ప వర్షాలకే జలమయమవుతున్నాయి. అందుకు 2005 జులైలో ముంబై నగరంలో సంభవించిన భారీ వరదలకు ప్లాస్టిక్ వ్యర్థాలే ప్రధాన కారణమని నిపు ణుల కమిటీలు అధికారికంగా తేల్చడం ఒక చారిత్రకసాక్ష్యం అంతకంటే భయంకరమైన విషయం ఏమిటంటే, ఎల్లెన్ మాక్ఆర్థర్ ఫౌండేషన్ పరిశోధనా పత్రాల ప్రకారం, ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి సముద్రాలలో చేపల మొత్తం బరువు కంటే ప్లాస్టిక్ వ్యర్థాల బరువే ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈవ్యర్థాలు నీటిలో విచ్ఛిన్నమై మైక్రోప్లాస్టిక్స్ (కంటికి కనిపించని ప్లాస్టిక్ రేణువులు) రూపం లో మారి సముద్ర జీవుల శరీరాల్లోకి, వాటి ద్వారా తిరిగి మానవ ఆహార గొలుసులోకి ప్రవేశిస్తున్నాయి. మనం పారే సిన విషం తిరిగి మన ప్లేట్లలోకే వస్తోందని, దీనివల్ల మానవ శరీరంలో క్యాన్సర్ కారకాలు, హార్మోన్ల అసమతు ల్యత పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు వాచ్చరిస్తున్నాయి.

గెజెట్ నోటిఫికేషన్

పట్టణాలు, గ్రామాల్లో రోడ్లపై పారేసే ప్లాస్టిక్ చెత్తను ఆహారంగా భ్రమించి అమాయక పశువులు తింటున్నాయి, ఫలితంగా వాటి జీర్ణ వ్యవస్థలు దెబ్బతిని ప్రతిఏటా వేలాది మూగజీవాలు మృత్యువాత పడుతున్నట్లు వెటర్నరీ నివేదికలు నిరూపిస్తున్నాయి. భారతదేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2022 జులై 1 నుండి దేశవ్యాప్తంగా 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల ఉ త్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకాలపై అధికారికంగా కఠిన నిషేధం విధిస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. చట్టం ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడిన వారికి పర్యావరణ పరి రక్షణ చట్టం 1986 కింద భారీ జరిమానాలతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష విధించే నిబంధనలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్లాస్టిక్ సంచుల వినియోగం ఇంకా యథేచ్ఛగా కొనసాగు తుండటం పాలనాపరమైన వైఫల్యాన్ని బట్టబయలు చేస్తోం ది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 127 దేశాలు ప్లాస్టిక్ సంచులపై పూర్తిగా లేదా పాక్షికంగా నియంత్రణ చట్టాలు తెచ్చినప్పటికీ, ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే, ఈ సమస్యకు మరో కోణం కూడా ఉంది.

Plastic covers

పర్యావరణహిత ప్రత్యామ్నాయాలు

ఆల్ ఇండియా ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం, ప్లాస్టిక్ పరిశ్రమలపై ఆధారపడి దేశంలోలక్షలాది మంది కార్మికులు, చిన్న వ్యాపా రులు జీవనోపాధి పొందుతున్నారు. వీరికి సరైన పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను, రాయితీలతో కూడిన బట్ట సంచులు లేదా జూట్ బ్యాగుల తయారీ పరిశ్రమలను ప్రభు త్వం భారీగా ప్రోత్సహించకపోవడం, తగినంత సమయం ఇవ్వకుండా ఆకస్మిక చర్యలకు దిగడం కూడా చట్టం పూర్తి స్థాయిలో విజయవంతం కాకపోవడానికి ఒక ప్రధాన కార ణంగా నిలుస్తోంది. ఈ భూమి మన సొంత ఆస్తి కాదు, రేపటి తరాలకు మనం ఇవ్వాల్సిన పచ్చని ఆస్తి. దీనిని ప్లాస్టిక్ సమాధిగా మార్చే హక్కు ఏ మనిషికీ లేదు. కేవలం ప్రభుత్వాల లాఠీలు, జరిమానాల వల్లే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. చట్టాల పట్ల భయం కంటే సమాజంలో పర్యా వరణం పట్ల నైతిక భయం పెరగాలి. 2024లో జరిగిన ఐక్యరాజ్యసమితి ప్లాస్టిక్ ఒప్పంద చర్చలు సైతం కేవలం వినియోగాన్ని మార్చడం మాత్రమే కాదు, ఉత్పత్తి స్థాయిలోనే ప్లాస్టిక్ను నియంత్రించాలని స్పష్టం చేశాయి. ‘కూరగాయల మార్కెట్కు వెళ్లేటప్పుడు చేతిలో ఒక బట్ట సంచి పట్టుకెళ్లడం’ అనే ఒక చిన్న అలవాటు రేపటి తరం భవిష్యత్తును మార్చగలదు. వ్యాపారులు లాభాపేక్షను పక్కనపెట్టి, వినియోగదారులు బద్ధకాన్ని వదిలిపెట్టి స్వచ్ఛందంగా 3ఆర్ (రిడ్యూస్, రీయూస్, రీసైకిల్) సూత్రాన్ని నిత్యజీవితంలో అమలు చేయాలి. ఒక చేత్తో ప్లాస్టిక్ మహమ్మారిని బహి ష్కరిస్తూ, మరో చేత్తో పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఆహ్వానించినప్పుడే ఈ యుద్ధంలో మనం గెలుస్తాం. అంత ర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని కేవలం ఒక రోజు నినాదాల వేడుకగా కాకుండా, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం ప్రభుత్వాల బాధ్యతతో ముగిసే కార్యక్రమంకాదు, ప్రతి పౌరుడు చేపట్టాల్సిన జీవన ఉద్యమం. అది కేవలం పర్యావరణ పరిరక్షణ కోసం కాదు, రాబోయే తరాల మనుగడ కోసం చరిత్ర మనపై ఉంచిన బాధ్యత.

-ఫిరోజ్ ఖాన్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News Environmental Protection latest news Latest Telugu News plastic covers plastic pollution Plastic Waste Telugu News Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.