Online commerce : ఆ న్లైన్లో కనిపించే ధరే అసలు ధర కాదు. పెద్ద అక్ష రాల్లో కనిపించే రాయితీ వెనుక, చిన్న అక్షరాల్లో కొన్ని షరతులు దాగి ఉండవచ్చు. ఒక వస్తువును కొనుగోలు చేసే ముందు దాని అసలు ధర ఎంత, గతంలో ఎంతకు అమ్మారు, తిరిగి ఇవ్వవచ్చా, చెల్లించిన డబ్బు ఎలా వెనక్కి వస్తుం ది, హామీ ఎవరిది, వస్తువు ఎక్కడ తయారైంది, చేరవేతకు అదనపు రుసుము ఉందా వంటి విషయాలు తెలుసుకోవడం అవసరం. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభు త్వం ఈవాణిజ్యానికి సంబంధించిన నిబంధనలను తాజాగా సవరించింది. ఈ సవరణలు 2027 జనవరి 1నుంచి అమ ల్లోకి రానున్నాయి. ఈ మార్పుల ప్రాధాన్యాన్ని అర్థం చేసు కోవాలంటే గతాన్ని గుర్తు చేసుకోవాలి. 2020లోనే ఈవాణిజ్య సంస్థలపై వినియోగదారుల ప్రయోజనాలనుకాపాడే నిబంధనలు వచ్చాయి. అందువల్ల ఇప్పటివరకు రక్షణేలేదని చెప్పలేం. కానీ అప్పటి నుంచి ఆన్లైన్ కొనుగోళ్లు విపరీతం గా పెరిగాయి. వస్తువులను అమ్మేపద్ధతులు మారాయి. విని యోగదారుడి దృష్టిని ఆకర్షించే కొత్త మార్గాలు వచ్చాయి. ఏ వస్తువును ముందుగా చూపించాలి, ఏ ధరను తగ్గించిన ధరగా చూపించాలి, ఏ సమాచారాన్ని ఎక్కడ ఉంచాలి అన్నదీ కొనుగోలుపై ప్రభావం చూపుతోంది. తాజా నవర ణలు ఈ కొత్త సమస్యలకు మరింత స్పష్టమైన హద్దులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.
Read Also : Phone Pe : ఫోన్ పేకు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ నుంచి లైసెన్సులు..!
Online commerce : పాత ధరను కూడా చూపాలి
వినియోగదారుడు ఏదైనా వస్తువు కోసం వెతికినప్పుడు, అతను అడిగిన దానికి సం బంధం లేని విధంగా ఫలితాలను మార్చి చూపించడం లేదా తన వ్యాపార ప్రయోజనానికి అనుగుణంగా వాటిని తారుమారు చేయడం కుదరదు. డబ్బు చెల్లించి ముందుకు తెచ్చిన వస్తువులను కూడా అవి అటువంటి ప్రకటనలని స్పష్టంగా తెలియజేయాలి. దీనివల్ల వినియోగదారుడికి తాను చూస్తున్నది సహజంగా ముందుకు వచ్చిన వస్తువా, డబ్బు చెల్లించి ముందుకు తెచ్చినదా అన్నది తెలుసుకునే అవకాశం ఉంటుంది. తెరపై ఏది ముందుగా కనిపిస్తుందన్న దే కొనుగోలును నిర్ణయించే పరిస్థితుల్లో ఇది ముఖ్యమైన మార్పు, ధరల విషయంలోనూ సవరణ వినియోగదారుడికి ఉపయోగపడుతుంది. ఒక వస్తువు ధర తగ్గించామని ప్రక టించినప్పుడు, కొత్త ధరతో పాటు పాత ధరను కూడా చూపాలి. ఆ పాత ధరగా గత 30 రోజుల్లో ఉన్న అత్యల్ప ధరనే పరిగణించాలి. దీంతో ముందుగా ధరను పెంచి, ఆ తర్వాత దానిపై భారీ రాయితీ ప్రకటించే పద్ధతులకు కొంత అడ్డుకట్ట పడుతుంది. ఇంతకాలం ఇంత శాతం తగ్గింపుఅన్న మాట వినగానే కొనుగోలు చేసేపరిస్థితి ఉండేది. ఇకపై ఎంత తగ్గించారు? అనే ప్రశ్నతో పాటు నిజంగా గతంలో ఎంతకు అమ్మారు? అన్నదీ తెలుసుకునే అవకాశం ఉంటుంది.
చిన్న అక్షరాలను కూడా చదవడం అవసరం
అయితే ఇక్కడే అసలు సమస్య మరోటి ఉంది. సమాచారం ఇవ్వడం ఒకటి, అది వినియోగదారుడికి కనిపించేలా, అర్థమయ్యేలా ఇవ్వడం మరొకటి. తిరిగి ఇచ్చే నిబంధనలు, డబ్బు వెనక్కి చెల్లించే విధానం, వస్తువుపై హామీ, చేరవేత రుసుము, చెల్లింపు నిబంధనలు వంటి ముఖ్యమైన వివరాలను ఒక పేజీలో చిన్న అక్షరాలతో ఎక్కడో పెట్టి ఉంటే, సంస్థ తన బాధ్యత నెరవేర్చినట్టుగా చెప్పుకోవచ్చు. కానీ కొనుగోలుచేసే వ్యక్తి వాటిని గమనించకపోతే ఆ సమాచారంతో ప్రయోజ నం ఏమిటి? అందుకే ఇకపై పెద్ద అక్షరాల్లో కనిపించే రాయితీని మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకుండా, దాని కింద ఉన్న చిన్న అక్షరాలను కూడా చదవడం అవసరం. చాలాసార్లు అసలు విషయం అక్కడే ఉంటుంది. తాజా నిబంధనలు ఆన్లైన్ వాణిజ్య వేదికలపై కూడా కొన్ని స్పష్ట మైన బాధ్యతలు పెట్టాయి. వస్తువును ఎంతకాలం ఉపయో గించవచ్చో తిరిగి ఎలా ఇవ్వవచ్చో, డబ్బు ఎలా వెనక్కి వస్తుందో, హామీ ఏమిటో, ఎప్పుడు వస్తువు చేరుతుందో, చెల్లింపు ఎలా చేయాలో వంటి వివరాలను వినియోగదారు డికి అందుబాటులో ఉంచాలి. దిగుమతి చేసుకున్నవస్తువుల విషయంలో దిగుమతిదారు వివరాలు, వస్తువు ఏ దేశంలో తయారైందన్న విషయాన్ని కూడా తెలియజేయాలి. దీంతో ఏం కౌంటున్నాం? అన్న ప్రశ్నకు కొనుగోలు చేసే ముందే సమాధానం తెలుసుకునే అవకాశం పెరుగుతుంది.
కొత్త నిబంధ నలు రావడంతో సమస్య
వినియో గదారుడి వ్యక్తిగత సమాచారానికి కూడా ఈ సవరణల్లో రక్షణ కల్పించారు. కొన్ని నిర్దిష్ట అవసరాలకోసం వినియోగ దారుడి సమాచారాన్ని ఉపయోగించాలంటే స్పష్టమైన అను మతి తీసుకోవాలి. అలాగే వాణిజ్య వేదిక అందించే సేవకు సంబంధం లేని రుసుములను వినియోగదారుడిపై అదనం గా వేయడానికీ పరిమితులు విధించారు. అంటే వినియోగ దారుడి జేబుతో పాటు, అతని వ్యక్తిగత సమాచారం కూడా విలువైనదేనని ని బంధనలు గుర్తిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలను పాటిస్తున్నామా లేదా అన్నదాన్ని సంస్థలు ప్రతి సంవత్సరం తామే పరిశీలించుకోవాలి. ఆ నిబంధనలు పాటిస్తున్నామని తెలిపే ధ్రువీకరణనుకూడా ప్రముఖంగా చూపించాలి. ఇది సంస్థలు తమ వెబ్ పేజీలు, కొనుగోలు విధానాలను మరింత జాగ్రత్తగా రూపొందించాల్సిన పరిస్థి తిని తీసుకొస్తుంది. ఫిర్యాదుల విష యంలోనూ వినియోగదా రుడికి కొంతబలం చేకూరింది. ఫిర్యాదుల పరిష్కారఅధికారి నమోదు చేసిన ఫిర్యాదు ప్రతిని ఫిర్యాదు దారుడికి ఇవ్వా లి. అన్ని ఈవాణిజ్య సంస్థలు జాతీయ విని యోగదారుల సహాయ కేంద్రం వ్యవస్థతో కలిసిపనిచేయాలి. 2025లో ఈ సహాయ కేంద్రానికి వచ్చిన 17.71 లక్షలకు పైగా ఫిర్యా దుల్లో సుమారు 5.11 లక్షలు ఈవాణిజ్యానికి సంబంధించి నవేనని కేంద్రం తెలిపింది. ఆన్లైన్ కొనుగోళ్లు ఎంత పెరి గాయో మాత్రమే కాదు, వాటితో పాటు సమస్యలూ ఎంత పెరిగాయో ఈసంఖ్య చెబుతోంది. అయితే కొత్త నిబంధ నలు రావడంతో సమస్య అంతా పరిష్కారమైందని భావిం చడం తొందరపాటు. ఆన్లైన్ వాణిజ్యంలో వినియోగ దారు డికి కావలసింది కేవలం తక్కువ ధరకాదు, తాను ఏం కొంటున్నాడు, ఎంతకు కొంటున్నాడు, ఏషరతులతో కొంటు న్నాడు అన్నది స్పష్టంగా తెలుసుకునే హక్కు. తాజా సవరణలు ఆ హక్కుకు మరింతబలమైన పునాదివేశాయి. ఇప్పుడు ఆ పునాది మీద పారదర్శకమైన వాణిజ్యాన్ని నిర్మించడం సంస్థల బాధ్యత, దాన్ని సమర్ధంగా అమలు చేయించడం ప్రభుత్వ బాధ్యత, తనకు అందుతున్న సమాచారాన్ని పూర్తిగా పరిశీలించడం వినియోగదారుడి బాధ్యత.
-దుంగ జయరాం
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: