📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

old age : వార్ధక్యానికి వరమౌనా?

Author Icon By Sudha
Updated: March 31, 2026 • 3:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

old age : భక్తితో కానీ భయంతో గానీ తమ బిడ్డలు వార్ధక్యం లో తమను చూసుకుంటారని ఎదురు చూసే తల్లి దండ్రులకు ఇప్పుడు నిరాశే మిగులుతోంది. వారి జీవన పరిస్థితులు భయంకర స్వప్నంలా మిగిలిపోతున్నాయి. అవసాన దశ అతి దుర్భరంగా మారుతోంది. ఇదేదో ‘తరం మార్పు’ తకరారుగా సరిపెట్టుకోలేము. అడ్డాల నాడు బిడ్డలు కానీ గెడ్డాలొచ్చాక బిడ్డలా? అనే లోకోక్తి ఆధునిక కాలానికి తగినట్లుగానే ఉంది. కొడుకులు తన బాధ్యత (responsibility)కు వదులుకుని వెళ్ళిపోతున్నారు. సమాజనికి వెరవడం లేదు. ఎవరెలా పోతే నాకేం? అనే ధోరణికి మారిపోతున్నారు. మానవ సంబంధాలు మృగ్యమైపోతు న్నాయి. మళ్ళీ ఏదో ఒక నాటికి మనమూ వార్ధక్యాన్ని ఎదుర్కొంటామన్న ధ్యాసే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధాప్యాన్ని జయించడమెలాగో చెబుతూనే కేంద్ర ప్రభుత్వం వృద్ధుల కోసం 2007లో కొన్నిచట్టాలు చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక విన్నూత్నఆలోచనతో వృద్ధుల్ని రోడ్ మీద పడకుండా చేయగలిగే ఒక చట్టాన్ని ప్రతిపాదించడం విశేషం.

Read Also: Telangana New Ration Shops: ఏప్రిల్ లో కొత్త రేషన్ షాపులు ప్రారంభం

old age

old age : కుటుంబ విలువల పరిరక్షణకే ఈ బిల్లు

మధ్యవయసులోనే తమకున్న ఆస్తుల్ని బిడ్డలకు బదిలీ చేసి వార్ధక్యం మీదపడి కాళ్లు లాగే సమయానికి చేయూతనిచ్చే కొడుకులు కనీస ఇంగి తం మరచిపోయి తల్లితండ్రులను ఏ వృద్ధాశ్రమాల బయటో వదిలి వెళ్ళిపోతున్న ఉదంతాలు ఎన్నో వింటు న్నాము. ఇలాంటి తరుణంలో కనీసం కొందరు తల్లి తండ్రులకైనా ఈ చట్టం ఉపశమనం కలిగిస్తుంది. చట్టాలు చేయగానే సరికాదు. వాటిని అమలులో ఆచరణలో చిత్త శుద్ధితో వ్యవహరించగల యంత్రాంగాన్ని కూడా ఏర్పరచడం మేలు. అందులో భాగంగానే ప్రభుత్వం ‘వృద్ధుల సంక్షేమ కమిషన్’ ఏర్పాటు చేస్తోంది. కేవలం కుటుంబ విలువల పరిరక్షణకే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు నిండు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సగర్వంగా ప్రకటిం చారు. తల్లిదండ్రుల సంరక్షణకు ఒక మంత్రదండాన్ని ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి సభాముఖంగా స్పష్టం చేశారు. సంపాదన ఉన్నా లేకున్నా కలో గంజో తాగిన ప్రతివ్యక్తి తమ తల్లిదండ్రులను బాధ్యత (responsibility) గా చూసుకోవాలని ఆయన ఆకాంక్ష. ఇలాంటి బిల్లు ప్రవేశపెట్టిన తోలి రాష్ట్రం బహుశా ఇదేనేమో తల్లితండ్రుల సంరక్షణ, పోషణ, పర్యవేక్షణ బిల్లు పేరిట ఈ చట్టం రూపుదిద్దుకుంటోంది. సభా సదులంతా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించారు.

కుటుంబ వ్యవస్థలో ప్రధానమైన అంశం

కేంద్ర ప్రభుత్వ చట్టాల మేరకు తల్లిదండ్రులకు రూ.10 వేలకు మించి ఇచ్చే అవకాశం లేదు. ఈ కారణంతో తెలంగాణలో మరికొన్ని అదనపు ప్రతిపాదనలు చేశారు. పదివేల రూపాయలు లేదా నెలవారీ వేతనం 15శాతం తల్లితండ్రుల పోషణార్ధం ఇవ్వాలన్న షరతులు విధిం చారు. తల్లిదండ్రుల అవసరాలు చూడని వ్యక్తిని సామా జికంగా బహిష్కరించినప్పుడే సమాజంలో మార్పు తీసుకు రాగలమన్నది సభ ఏకాభిప్రాయం. ప్రైవేట్ ఉద్యోగులకు ప్రజ ప్రతినిధులకు కూడావర్తిస్తుంది. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా వయోవృద్ధులకు ఆసరాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక చట్టం తీసుకు వచ్చింది. ‘తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీ తనం, పర్యవేక్షణ చట్టం 2026’లో భాగంగా ‘వయోవృద్ధుల కమిషన్’ను ప్రభుత్వం ఏర్పాటు చేయ నుంది. ఇందులో ఒక ప్రధాన కమిషనర్, ఇద్దరు కమిష నర్లు ఉంటారు. ఈమేరకు టీఈ ఏఎంపీఎస్ బిల్లు2026 ను శనివారం ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తల్లితండ్రులను పట్టించుకోకుండా వదిలేసే ఉద్యోగుల వేతనాల నుంచి గరిష్టంగా రూ.10 వేల మేర కోత విధించి, తల్లిదండ్రుల పోషణ నిమిత్తం వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు. తల్లిదండ్రుల యోగక్షేమాలను చూడడం, వారికి సేవలు చేయడం పిల్లల బాధ్యత అని, ఇది భార తీయ కుటుంబ వ్యవస్థలో ప్రధానమైన అంశమని ప్రభు త్వం పేర్కొంది. ప్రస్తుత ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బల హీనమైపోతోందని, పిల్లలు తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా నిరక్ష్యం చూపుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలోనే కుటుంబ విలువల సంరక్షణకు అవసరమైన ప్రమాణాలను రూపొందించాల్సిన ఆవశ్యకత ఏర్ప డింది. తల్లిదండ్రుల యోగక్షేమాలను నిర్లక్ష్యం చేస్తున్న ఉద్యోగుల్లో నైతిక బాధ్యతను చట్టాన్ని తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసింది.

old age

కొడుకుల బాధ్యత

తల్లిదండ్రుల పోషణ కోసం ఉద్యోగి నెల వారి జీతం నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు ఏది తక్కువైతే దానిని మినహాయించి తల్లిదండ్రులకు చెల్లించే ఏర్పాట్లు చేయనున్న ప్రభుత్వ జవాబుదారీకిది నిదర్శనం. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు, పంచాయతీరాజ్ చట్టం, మునిసిపల్ చట్టం కింద పని చేసే సిబ్బంది, ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందికి కూడా వర్తి స్తుందని స్పష్టం చేసింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఆరునెలల్లోపు ఆయా శాఖలు, సంస్థలుతమ ఉద్యోగులకు సంబంధించిన నియమాలను సవరించుకో వాలని సూచించింది. తమ బాగోగులను పట్టించుకోని పిల్లలపై తల్లిదండ్రులు ఇద్దరు గానీ ఒక్కరు గానీ వారి పిల్లలు పనిచేసే శాఖ విభాగాధిపతికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆ అధికారి 60 రోజుల్లోగా ఫిర్యాదును పరి ష్కరించాలి. అక్కడ వరిష్కారం కాకపోతే తల్లిదండ్రులు ‘వయోవృద్ధుల కమిషన్ను ఆశ్రయించాలి. ఆస్తిలో సమానవాటాదారుగా గుర్తింపబడిన కూతుర్ల బాధ్యతలు కూడా నిర్వచించడం అవసరం. ఏదిఏమైనా ప్రస్తుత సామాజిక కట్టుబాట్లు, వాటి ఉల్లంఘన వంటి విషయాల్లో తొలి అడుగులోనే కొడుకుల బాధ్యతను గుర్తింపచేయడం విశేషం. భక్తిలేని కన్నబిడ్డలకు భయం కలిగించినా, బాధ్యత నేర్పినా ముసలి తల్లిదండ్రులకిది శ్రీరామరక్షే.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aging benefits of aging BreakingNews challenges of aging elderly life latest news Old Age Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.