📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Narcotics : మత్తును వీడితేనే మేలైన భవిష్యత్తు!

Author Icon By Sudha
Updated: September 30, 2026 • 3:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Narcotics : మాదకద్రవ్యాల వినియోగం ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు, కుటుంబాన్ని, సమాజాన్ని, చివరకు దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే తీవ్రమైన సమస్య. ముఖ్యంగా యువతలో మత్తు పదార్థాల వినియోగం పెర గడం ఆందోళన కలిగించే అంశం. విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు, సామాజిక భద్రతపై దీని ప్రభావం పడుతోంది. అందుకే మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటాన్ని కేవలం పోలీసు వ్యవస్థకు పరిమితం చేయ కుండా ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ 2020 ఆగస్టు 15న నషా ముక్త్ భారత్ అభియాన్ను ప్రారంభించింది. తొలుత 272 జిల్లాల్లో ప్రారంభమైన ఈ కార్యక్రమం 2023 ఆగస్టు నుంచి దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరించింది. అవగాహన, సమాజ భాగస్వామ్యం, చికిత్స, పునరావాసం, తిరిగి సామాజిక జీవితంలోకి తీసుకురావడం ఈ కార్యక్రమంలో ప్రధానఅంశాలుగా ఉన్నాయి. 2026 జూలైలో కేంద్ర ప్రభు త్వం వెల్లడించిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా నషా ముక్త్ భారత్ అభియాన్ ద్వారా 29.68 కోట్లకు పైగా ప్రజలకు అవగాహన కల్పించగా, 28.29 లక్షల మందికి పైగా చికిత్స, పునరావాస సేవలు అందాయి. విద్యా సంస్థల్లోనూ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే గణాంకాలు మాత్రమే సమస్యకు పరిష్కారం కావు.

Read Also : Gandhi jayanti: అక్టోబర్ 2న వైన్ షాపులు, మాంసం బంద్

Narcotics

Narcotics : నషా ముక్తభారత్

మత్తుకు బానిసైన వ్యక్తిని నేరస్థుడిగా మాత్రమే చూడటంవల్ల సమస్య మరిం త సంక్లిష్టమవుతుంది. చికిత్స, కౌన్సెలింగ్, కుటుంబ సహ కారం, పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పించడంకూడా అంతే ముఖ్యం. మాదకద్రవ్యాల వినియోగాన్ని తగ్గించడం తోపాటు, దాని బారిన పడిన వారికి తిరిగి గౌరవప్రదమైన జీవితం అందించే వ్యవస్థబలపడాలి. ఇందులో తల్లిదండ్రులు, ఉ పాధ్యాయులు, వైద్యులు, పోలీసులు, అందరూకీలక పాత్ర పోషించాలి. పాఠశాలలు, కళాశాలల్లో కేవలం హెచ్చరికలు ఇవ్వడం కాకుండా మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నిర్వ హణ, చెడు స్నేహాల ప్రభావం, మత్తు పదార్థాల వల్ల కలిగే దీర్ఘకాలిక నష్టాలపై నిరంతర అవగాహన అవసరం. మత్తు పదార్థాల సరఫరాను అరికట్టడం ఎంత అవసరమో, వాటికి డిమాండ్ను తగ్గించడం కూడా అంతే అవసరం. అందుకే నషా ముక్తభారత్ అభియాన్లో పోలీను, ప్రభుత్వ విభా గాలు, వైద్య, విద్యా సంస్థలు, ప్రజా సంఘాలసమన్వయం కీలకం. ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని అవగాహనతో పాటు చికిత్స, పునరావాస సేవలతో అనుసంధానిస్తోంది. మత్తు నుంచి బయటపడాలని కోరుకునే వారికి సహాయం అందుబాటులో ఉందనే నమ్మకం కల్పించాలి. కేంద్ర సామా జిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 2018 లో నిర్వహించిన సమగ్రజాతీయ సర్వే మత్తుపదా ర్థాల వినియోగం తీవ్రతనుస్పష్టంగా వెల్లడించింది.

Narcotics

అవగాహనతో ముందుకు సాగాలి

దేశంలో సుమారు 16కోట్లమంది మద్యం, 3.1కోట్ల మంది గంజాయి ఉత్పత్తులు, 2.26కోట్ల మంది ఓపియాయిడ్లు వినియోగి స్తున్నట్లు సర్వే అంచనావేసింది. వీరిలో తీవ్రంగా ప్రభావి తమైన వారికి చికిత్స, సహాయం అవసరమని కూడాసర్వే గుర్తించింది. ఓపియాయిడ్ల వినియోగదారుల్లో సుమారు 77 లక్షలమందికి సహాయం అవసరమని అంచనావేసింది. అత్యంత ఆందోళన కలిగించే అంశం పిల్లలు, కిశోరుల పరి స్థితి. 10-17 ఏళ్ల వయస్సులో సుమారు 40లక్షల మంది ఓపియాయిడ్లు, 20లక్షల మంది గంజాయి, 20లక్షలమంది సెడేటివ్స్, 30లక్షల మంది ఇన్హేలెంట్స్ వినియోగిస్తు న్నట్లు 2018 సర్వేఅంచనా వేసింది. ఇవి ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన తాజా లెక్కలు కావు. అందుబాటులో ఉన్న జాతీయ స్థాయి అధికారిక సర్వే గణాంకాలు. నషా ముక్త్ భారత్ అంటే మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి అనే నినాదం కాదు. యువతకు ఆరోగ్యకరమైన జీవితం, కుటుం బాలకు భద్రత, సమాజానికి బాధ్యత, బాధితులకు పునరావా సం కల్పించే సమగ్ర ఉద్యమం. మత్తును నిర్మూలించాలంటే భయంతో కాదు. అవగాహనతో ముందుకు దుకు సాగాలి.

-డా. మోటె చిరంజీవి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News Drug Awareness Drug Free Future latest news Latest Telugu News Narcotics Say No To Drugs Substance Abuse Prevention Telugu News Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.