📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Land scam : వ్యవస్థ కాపలాదారులే దోపిడీదారులైతే..

Author Icon By Sudha
Updated: July 3, 2026 • 4:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Land scam : దేశంలో ప్రజాస్వామ్యానికి, సువరి పాలనకు వెన్నెముక సివిల్ సర్వీ సెస్ వ్యవస్థ. చట్టాన్ని అమలు చేయ డం, ప్రజా వనరులను సంరక్షించ డం, ప్రభుత్వ విధానాలను ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా అమలు చేయడం ఈ వ్యవస్థ ప్రధానబాధ్యత. కానీ చట్టాన్ని కాపాడాల్సిన వారే చట్టంలోని బలహీనతలను తమ లాభాల కోసం వినియోగించడం ప్రారంభిస్తే, ప్రజాస్వామ్యానికి అది తీవ్రమైన హెచ్చరికగా మారుతుంది. మధ్యప్రదేశ్లో వెలుగు చూసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భూ కుంభకోణం, అదే రాష్ట్ర లోకాయుక్త పనితీరుపై బయటపడిన గణాంకాలు, అలాగే తెలంగాణలో బయటపడుతున్న భూవ్యవహా రాల వి వాదాలు, ఇవన్నీ కలిసి భారత పాలనా వ్యవస్థలో దాగి ఉన్న ఒక అసౌకర్యకరమైన సత్యాన్ని బయట పెడు తున్నాయి. అవినీతిని అరికట్టడానికి ఏర్పాటైన వ్యవస్థలే అవినీతికి అద్దం పట్టే పరిస్థితి ఏర్పడింది. మధ్యప్రదేశ్ లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ గత ఇరవై ఏళ్ల అధికారిక గణాంకాలు ఒక చేదు వాస్తవాన్ని చెబుతున్నాయి.

Read Also : PMAY Awas Yojana scheme: సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం 1.50 లక్షలు సాయం!

Land scam

Land scam : అవకాశాలు దాదాపు సమానం

2006 నుంచి 2026 వరకు కోర్టులు లోకాయుక్త కేసుల్లో 2,067 మందిని దోషులుగా నిర్ధారించాయి. మొదటి చూపు లో ఇది విజయం అనిపించవచ్చు. కానీ అదే కాలంలో 966 మంది నిర్దోషులుగా విడుదల కాగా, మరో 105 మంది కేసులు విచారణ దశకే చేరలేదు. మొత్తం 1,071 కేసుల్లో, అంటే దాదాపు 34 శాతం సందర్భాల్లో, అవినీతి నిరోధక వ్యవస్థ కోర్టులో తన వాదనను నిలబెట్టలేకపోయిం ది. ఇటీవలి పరిస్థితి మరింత ఆందో ళనకరం. 2025-26లో కేవలం 71 మందికే శిక్షపడగా, 62 మంది నిర్దోషులుగా బయటపడ్డారు. అంటే లోకాయుక్త వలలో చిక్కిన వ్యక్తి కోర్టులో తప్పించుకునే అవకాశాలు దాదాపు సమానంగా ఉన్నాయన్న మాట. ఇది దర్యాప్తు నాణ్యత, సాక్ష్యాల సమ ర్పణ, కేసుల నిర్వహణలో తీవ్రమైన లోపాలను సూచిస్తోం ది. దోషులుగా తేలిన వారి వర్గీకరణను పరిశీలిస్తే అసలు అసమానత స్పష్టమవుతుంది. శిక్షపడిన వారిలో 85 శాతం మంది అత్యల్ప స్థాయి ఉద్యోగులే. రెవెన్యూ శాఖలో 652 కన్విక్షన్లలో 558 మంది పట్వారీలు, పోలీస్ శాఖలో 321 కేసుల్లో 242 మంది కానిస్టేబుళ్లు లేదా హెడ్ కానిస్టేబుళ్లు. విద్యుత్ శాఖలో 194 కేసుల్లో 91 మంది లైన్మెన్లు. కానీ ఐఏఎస్, ఐపీఎస్, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులవాటా ఒక శాతానికీ చేరలేదు. ఇక్కడే వ్యవస్థలోని వర్గ వివక్ష బయ టపడుతోంది.

చిన్న స్థాయి ఉద్యోగులు శిక్షను ఎదుర్కొం టుంటే..

చిన్న స్థాయి ఉద్యోగులు శిక్షను ఎదుర్కొం టుంటే, పైస్థాయి అధికారులపై చట్టం ప్రభావం చూపలేక పోతోంది. ఈ అసమానతకు భోపాల్ సమీపంలోని గురాడీ ఘాట్ భూ వ్యవహారం ప్రత్యక్ష ఉదాహరణ. 2022 ఏప్రిల్ 4న ఒకే రోజున, ఒకే రిజిస్టర్డ్ పత్రం ద్వారా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, తెలంగాణ కేడర్లకు చెందిన దాదాపు 50 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు గురాడీ ఘాట్ గ్రామంలో 2,023 హెక్టార్ల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమి మార్కెట్ విలువ సుమారు 7.78 కోట్లు కాగా, కొనుగోలు ధర కేవలం 5.50 కోట్లు మాత్రమే. భూమి కొనుగోలు జరిగిన కేవలం 16 నెలలకే, 2023 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం 3,200 కోట్ల వ్యయం తో వెస్టర్న్ బైపాస్ ప్రాజెక్టును ఆమోదించింది. ఆశ్చర్యకరం గా ఆ ప్రతిపాదిత రహదారి ఈ భూమికి కేవలం 500 మీటర్ల దూరంలోనే వెళ్లేలా ప్రణాళిక రూపొందింది. ప్రభుత్వ ప్రాజెక్టులపై ముందస్తు సమాచారం లేకుండా ఇలాంటి పెట్టుబడి సాధ్యమా అన్న ప్రశ్న తప్పనిసరిగాతలెత్తుతుంది. అంతటితో ఆగకుండా, 2024 జూన్లో అదే భూమిని వ్యవసాయ వినియోగం నుంచి నివాస వినియోగానికి మార్చారు. దీంతో భూమి ధరలు అమాంతం పెరిగాయి. 2022లో చదరపు అడుగు ధర 81.75 ఉండగా, బైపాస్ ప్రకటన తర్వాత 557కు చేరింది. ప్రస్తుతం ఆది 2,500 నుంచి 3,000 వరకు పెరిగింది. కేవలం నాలుగేళ్ల వ్యవ ధిలో ఎలాంటి ఉత్పాదక శ్రమ లేకుండా, కేవలం అధికార సమాచారం మరియు విధాన నిర్ణయాల ఆధారంగా 50 నుంచి 60 కోట్ల లాభం ఆర్జించబడింది. ఇంతటి తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందిం చకపోవడం మరింత ఆందోళనకరం.

అవినీతి సమస్య

దేశవ్యాప్తంగా చర్చ జరిగినప్పటికీ అధికారిక విచారణ ప్రకటించలేదు. చివరకు 62 మంది మాజీ సివిల్ సర్వెంట్లతో కూడిన ఒక బృందం ముఖ్యమంత్రికి లేఖ రాసి స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేయాల్సి వచ్చింది. ఇది వ్యక్తిగత అవినీతిసమస్య మాత్రమే కాదని, వ్యవస్థాగత అవినీతి రూపమని వారు హెచ్చరించారు. మధ్యప్రదేశ్ మాత్రమే కాదు, తెలంగాణ లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూదాన్ భూముల వ్యవహారంలో ఉన్నతాధికారులు, వారి బంధువులు, బినామీల పేర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయన్న ఆరోపణలను హైకోర్టు సీరియస్గా పరిగణించింది. భూములు, ప్రజా వనరుల కేటాయింపుల్లో సీనియర్ అధికారుల పాత్రపై తరచుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దిగువ స్థాయి ఉద్యోగులపై విచారణలు వేగంగా సాగుతుంటే, ఉన్నతాధికారులు కేసులు సంవత్సరాల పాటు విచారణలకే పరిమితమవడం ఒకే వ్యవస్థలో రెండు న్యాయాలున్నాయనే భావనను మరింత బలపరుస్తోంది.

Land scam

సమానత్వం కేవలం నినాదం

ఇక్కడ ఒకేవ్యవస్థలో రెండురకాల న్యాయం కనిపిస్తోంది. ఉదా. 500 లంచం తీసుకున్న పట్వారీ లోకా యుక్త వలలో పడతాడు. అతని పేరు మీడియాలో వస్తుంది. అతను నస్పెండ్ అవుతాడు, జైలుకు వెళ్తాడు. అదే సమ యంలో ప్రభుత్వ రహస్య సమాచారం ఆధారంగా కోట్ల రూపాయల లాభం పొందిన ఉన్నతాధికారులు లేదా ప్రజా భూములను ప్రభావంతో మళ్లించిన అధికార వర్గాలు విచార ణకే పరిమితమవుతున్నాయి. చిన్న ఉ ద్యోగి చేసినది నేర మైతే, పెద్ద అధికారి చేసినది పెట్టుబడిగా మారుతోంది. అవినీతిని నిర్వచించే శక్తి కూడా అధికార వర్గాల చేతుల్లో ఉండటంతో చట్ట సమానత్వం కేవలం నినాదంగా మిగిలిపో తోంది. రాజ్యాంగ నిర్మాత బి. ఆర్. అంబేద్కర్ హెచ్చరించి నట్లే, చట్టం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వ్యవస్థ న్యాయబద్ధంగా లేకపోతే సమానత్వం కాగితాలకే పరిమిత మవుతుంది. మధ్యప్రదేశ్ లోకాయుక్త గణాంకాలు, గురాడీ ఘాట్ భూ కుంభకోణం, తెలంగాణ భూదాన్ భూముల వివాదాలు కలిసి ఒక అసౌకర్యకరమైన నిజాన్ని చెబుతున్నా యి. ఇది కేవలం అమలు వైఫల్యం కాదు, వ్యవస్థ రూప కల్పనలోనే ఉన్న అనమానత. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఉన్నతాధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్వతంత్ర విచారణలు జరిపించాలి. లోకాయుక్త, ఏసీబీవంటి సంస్థలకు పూర్తి స్వతంత్రత, పైస్థాయి అధికారులపై కూడా నిర్భయంగా చర్యలు తీసుకునే సామర్థ్యం కల్పించాలి.

-పాపని నాగరాజు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News Corruption land fraud land grabbing Land Scam latest news Latest Telugu News Real Estate Fraud Telugu News Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.