Judiciary : సకాలంలో అందని న్యాయం న్యాయమే కాదు. అందుకే ‘ఓడిన వాడు కోర్టులో ఏడిస్తే, గెలిచిన వాడు బయట ఏడుస్తాడు’ అన్న జనశ్రుతిఉండనే ఉంది. ఒకపక్క కోర్టుల్లో పెండింగ్ కేసుల గురించి పదే పదే చర్చించుకుంటున్నాము. ఎందరో మేధావులు ఎన్నె న్నో సలహాలు, సూచనలు ఇస్తుంటారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మారినప్పుడల్లా పెండెన్సీ తగ్గించేం దుకు ఎన్నో న్యాయపరమైన సంస్కరణలు తెస్తూనే ఉంటారు. అయినా కోర్టులో పెండెన్సీ తగ్గిందని చెప్పు కోవడానికి ఎలాంటి ఆధారాలు చూపలేదు. లోకాయుక్త లలోమధ్యవర్తిత్వం, రాజీ అయినా మరికొన్ని కేసులు జమ అవుతూనే ఉంటాయి. కోర్టు ఏ స్థాయిదైనా మౌలిక వసతులు, వనరులు లేని కోర్టులలో న్యాయం చెప్పే విషయంలో ఎలాంటి జాప్యం అవుతుందో అత్యున్నత ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ఆ దివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో చెప్ప చూసారు. కొన్ని అమూల్యమైన సంగతులను నివేదించారు. అందరికీ న్యాయమనే లక్ష్యం సాకారం కావాలంటే సరైన మౌలిక వసతులు అవసరం. న్యాయవ్యవస్థ స్వతంత్రపై తీర్పులు, సమావేశాలు, రాజ్యాంగ చర్చల్లో తరచూ మాట్లాడుకుంటున్న విషయాలే. చెల్లాచెదురుగా ఉండే ఇరుకిరుకు భవనాల్లో హైకోర్టు నిర్వహణ ఇబ్బంది కరమే. న్యాయవ్యవస్థ స్వతంత్రకు మౌలిక వసతులు అత్యంత అవశ్యకం.
Read Also : Pema Khandu Corruption : రూ.1,270 కోట్ల కాంట్రాక్టులపై CBI దర్యాప్తు
Judiciary : ప్రశాంత వాతావరణం
హైదరాబాద్లో వంద ఎకరాల్లో హైకోర్టు సముదాయ నిర్మాణం పూర్తయితే సమగ్ర న్యాయ నిర్వహణకు అవకాశముంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిభాషణలో వ్యక్తమయిన అభిప్రాయాలివి. పనిచేసే వాతావరణం లేని చోట ఎవరూ పనిచేయజాలరు. ప్రధానంగా న్యాయనిర్ణేతలుగా ఉండే వారికైతే ఇరువైపులా వాదనలు వినేందుకు ప్రశాంత వాతావరణమూ ముఖ్యమే. ఇలాంటి అభిప్రా యం న్యాయ కోవిదులందరిలోనూ ఉన్నా ఆచరణ దుస్సాధ్యం. అందుకే కొత్తగా నిర్మించుకునే భవనాలు ఆ రీతిలో ఉండాలని భావిస్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో అలాంటి పరిస్థితులు కలిసొచ్చాయి. పనులు సజవుగా సాగుతున్నాయి. తెలంగాణలో ఆ లక్ష్యం క్రమేపీ ఆచర ణలోకి వస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రజలకు కోర్టు అంటే బెంచ్, జాతీయ చిహ్నం, విచారణలు మాత్రమే కన్పిస్తాయని, వాటి వెనుక నిలువెత్తు నిబ్బరంగా ఉండే మౌలిక వసతులే కోర్టును నడిపిస్తాయని ఆయన భావన. ప్రస్తుతమున్న హైకోర్టు భవనాలు అవసరాలకు సరిపోకపోవడంతో రాబోయే నూరేళ్ల అవసరాలకు సరిపడే విశాలమైన, ఎన్నో మౌలిక వనరులు, వసతులు ఉన్న నూతన హైకోర్టు భవనాలను వేగవంతంగా నిర్మించుకుంటున్నం దుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
రాజ్యాంగ విధి
భారీ వృక్షం నిలబడాలంటే వేర్లు ఎంత బలోపేతంగా ఉంటాయో అదే మాదిరి న్యాయ వ్యవస్థకు అన్ని సౌకర్యాలూ ఉన్న భవనాలు అవసరమే నన్నారు. పాత తీర్పుల ప్రతులకు భద్రతస్థానం ఎంతో ముఖ్యమైనదైనందున తెలంగాణ హైకోర్టులో సకల సౌక ర్యాలున్న వేర్వేరు భవన నిర్మాణాలు చోటు చేసుకోవడం ప్రధాన న్యాయమూర్తిని ఆకట్టుకుంది. రాజ్యాంగం సజీ వంగా ఉండాలంటే న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే లక్ష్యంతో గమనాన్ని చేరడం అవసరమన్నది ఆయన ఆలోచన. ప్రతి కోర్టు గది వెనుక దాన్ని నడిపించే ఓ ప్రపంచ ఉంటుంది. అక్కడే న్యాయమూర్తులు నివసిస్తా రు. శిక్షణ తీసుకుంటుంటారు. అలాంటి న్యాయాలయా నికి పునాదులు వేసే కార్యాచరణ ఎంతో శుభప్రదం. అదొక రాజ్యాంగ విధిగా భావిస్తున్నట్లు వివరించారు. ప్రతి రాష్ట్రంలో ఓ హైకోర్టు చట్టపరమైన అవసరమే కాకుండా గణతంత్ర రాజ్య నిబద్ధతగా భావించాల్సి ఉం టుంది. అలాంటి నిబద్దతకు ఆధారమైన మౌలిక సదుపా యాలు ఉన్నంత వరకే అర్థం ఉంటుంది. కాకుంటే కేవలం కాగితాల్లోనే మిగిలిపోతుంది. అలా కాకుండా ప్రభుత్వం, న్యాయవ్యవస్థ సమాంతరంగా ఒక సంయుక్త బాధ్యతతో నడక సాగించడం వలన అదొక నిర్దిష్ట రూపాన్ని సంతరించుకోవడం కళ్లెదుట సాక్షాత్కరిస్తోందని జస్టిస్ సూర్యకాంత్ ఒక సమగ్ర న్యాయవ్యవస్థకు మౌలిక వనరుల రూపకల్పనకు నిర్దిష్ట ఆచరణ ఉందంటూ, ఇదే మాదిరి సంకల్పంతో ఇతర రాష్ట్రాల్లో కూడా కోర్టులకు మౌలిక సదుపాయాలు అవసరమని నమ్ముతున్నారు.
మౌలిక వనరులు
ఒక పటిష్టమైన ఆలోచనకు సాదృశ్యమైన ఒక విశేషాన్ని ప్రధాన న్యాయమూర్తి సభముందుంచారు. సమగ్ర మూ లాల్లేని ఏ వ్యవస్థకైనా కూకటివేళ్లే ముఖ్యమన్న పరమా వధిని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఒక భారీ వృక్షానికి కొమ్మలు, ఆకులు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఉధృతం గా తుపాను వచ్చిన సందర్భంలో వేర్లు మాత్రమే ఆ చెట్టును పడిపోకుండా నిలబెడతాయన్నది గుర్తించాల్సి ఉంటుంది. ఇవన్నీ న్యాయవ్యవస్థ మౌలిక వనరులు, వసతులపై ప్రధాన న్యాయమూర్తి వివరించిన విషయాలే. ఎన్నో కోర్టుల్లో కేసుల చిట్టాలు దాచుకునేందుకు కనీసం పటిష్టమైన గదులు ఉండవు. ఎక్కడైనా కోర్టుస్టోర్రూ మ్ లు గమనిస్తే ఫైళ్ల ర్యాక్లు సరిగ్గా ఉండవు. యాభై యేళ్ల నాటి భవనాలున్న చోటవర్షాలకు ఎన్నో రికార్డులు తడిసి పోయి ఉండటం చూస్తుంటాము. న్యాయమూర్తు ల క్వార్టర్లు న్యాయాలయాల సముదాయంలో కాకుండా ఎక్కడో ఉంటే న్యాయమూర్తులు ఎక్కడో దూరంగా వసతి ఉన్న సందర్భాలలో ట్రాఫిక్రద్దీలో ఇరుక్కుని కోర్టులకు ఆలస్యంగా హాజరైతే ఎంతో మంది కక్షిదారులు ఇక్కట్లకు గురౌతుంటారు. ఇలాంటి సమస్యలన్నీ న్యాయవ్యవస్థలో అనుభవైకవేద్యమే!
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: