📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

intoxication : మత్తు వదిలిస్తారా?

Author Icon By Sudha
Updated: August 17, 2026 • 3:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

intoxication : గతి తప్పినా, మతి తప్పినా ఏ వాహన చోదకుడైనా వెళ్లేది నేరుగా యమలోకానికే అన్న విషయంలో ఎవరికీ ఏ భిన్నాభిప్రాయమూ ఉండదు. వాహనాలు నడిపేటప్పుడు అది నేల మీదనైనా, గాల్లోనైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎంతో మంది ప్రయాణికుల ప్రాణాలు, భవిష్యత్తు వాహన చోదకుల అప్రమత్తత మీదనే ఉంటుంది. వారు ఏ తప్పు చేసినా ప్రయాణికుల ప్రాణాల్లో గాల్లో కలిసిపోతాయి. మాదకద్రవ్యాలు, గంజా యి, మద్యం సేవించిన వారువాహనాలు నడిపినప్పుడు రోడ్డు ప్రమాదాల్లో పడి చనిపోయిన సంఘటనలెన్నెన్నో వింటున్నాము. కుటుంబ జీవనాధారమైన వ్యక్తులు విమాన ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాల పరిస్థితి దిక్కుతోచదు. థాయ్లాండ్లోని పుకెట్- ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉండగానే 300 అడుగులు కిందకు పడిపోయిన ఘటనలో ‘బ్లాక్ ”బాక్స్’ డేటా చెప్పిన విషయాలు అవలోకిస్తే కొంత ఆశ్చర్యమూ కొంత దిగులు కలుగుతుంది. విమానంలోని మూడు హైడ్రాలిక్ వ్యవస్థలు ఒకేసారి విఫలమవడంతో దాదాపు 4 సెకెన్లతోపాటు ఫ్లైట్ కంట్రోల్స్ పూర్తిగా మొరాయిం చాయని విమాన తయారీ సంస్థ ఎయిర్బస్ తన ప్రాథ మిక నివేదికలో వెల్లడించింది. ప్రధానంగా చెప్పుకోవాల్సి న విషయం మరొకటి ఉంది. పైలట్ గంజాయి తీసుకు న్నట్లు రెండుసార్లు చేసిన డోపింగ్ పరీక్షలో తేలింది.

Read Also : “Haunted” Maharashtra Hostel : బాలికలకు ‘దయ్యం పట్టిందనే’ ఆరోపణలు..600 మంది విద్యార్థులు హాస్టల్‌ ఖాళీ

intoxication

intoxication : డోపింగ్ పరీక్షల తప్పనిసరి

మాదకద్రవ్యాల ప్రభావంతోనే పైలెట్లు గతి తప్పి విమా నాలు ప్రమాదాలకు గురై ఎన్నోప్రాణాలు గాల్లో కలిసి పోయిన సంఘటనలు వింటున్నాము. మత్తు ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే. ప్రభుత్వాలు అప్రమత్తం చేస్తున్నా, ప్రభుత్వ ఉద్యోగులు, విమాన చోదకులు మాదకద్రవ్యాలు తీసుకోరాదని నిబంధనలున్నా ఎవరూ పాటించడం లేదు. వాటి నిషేధాన్ని అమలు పెట్టాల్సిన అధికారులు కూడా పట్టించుకోరు. ఈభయంకర సత్యాల నేపథ్యంలో ఎయిర్ ఇండియా పైలెట్లకు డోపింగ్ పరీక్షల ను తప్పనిసరి చేసింది. ఏ-320 నియోవిమానం హఠాత్తుగా 300 అడుగుల కిందకుపడిపోయి తీవ్ర సంచల నం సృష్టించింది. ప్రయాణికులు ఎంతగానో గాభరాపడ్డారు. ప్రతి విమానంలోనూ ఉ న్నట్లే ఈ విమానంలో కూడా ‘డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్’ సమాచారాన్ని విశ్లేషించిన అనంతరమే పైలెట్ల వ్యవహారశైలి, తీసుకున్న మాదక ద్రవ్యాల వివరాలు వెల్లడయ్యాయి. విమానంలోని అసా ధారణ పరిస్థితుల వల్లనే విమాన గమనాన్ని ఎత్తును నియంత్రించే ఎలివేటర్లు, అలైరౌన్లు స్పాయిలర్లు నాలుగు సెకన్లపాటు పైలెట్ ప్రమేయం లేకుండా తమంతటతామే కదిలాయని విశ్లేషణలో తేలింది. విమానం రెక్కలుగాల్లో తగినంత లిఫ్ట్ వివ్వలేకపోతున్నాయని ‘స్టాల్ హెచ్చరికలు వచ్చాయి. ప్రయాణికుల భద్రత, నమ్మకమే ప్రధానంగా ఎయిర్ ఇండియా యాజమాన్యం కఠిన నిర్ణయం తీసు కుంది.

దుస్సంఘటనలకు ఆ విమాన సంస్థే బాధ్యత

ఒక ప్రమాదం జరగడం దాని విశ్లేషణ, పరిణా మాలను బట్టి నిర్ణయాలు తీసుకోవడంవల్లన పోయిన ప్రాణాలు తిరిగిరావు. దాదాపు ప్రపంచంలో ఎలాంటి వాహన చోదకతలో లోపాలున్నాయన్న అయినా విమర్శలకు గురికాకుండా ప్రమాదం వాటిల్లకుండా ముందుజాగ్ర త్తలతో పైలెట్లకు డోపింగ్ తప్పనిసరి చేయడం ఆహ్వానిం చదగినదే. ప్రమాదానికి గురైన విమాన ప్రధాన పైలట్ సుదీప్ విశిష్ట విచిత్ర వ్యవహారశైలి, తడపాటు, నడవలేక తూలుతున్నవైనాన్ని బట్టి మూత్ర నమూనాల పరీక్ష చేయిస్తే అసలు విషయం బయటపడింది. ఈ విమానం కిందకు దిగేక్రమంలో ప్రయాణికులు తీవ్ర ఒత్తిడికిగుర య్యారు. దాదాపు ప్రయాణికులు కుదుపునకు గురై విమా నపై కప్పునుబలంగా ఢీకొట్టారు. విమానాన్ని నడిపే పైలట్ సరైన మానసికస్థితిలో కానీ శారీరక పటుత్వంతో కానీ లేకుంటే జరిగే ప్రమాదాలకు, దుస్సంఘటనలకు ఆ విమాన సంస్థే బాధ్యత వహించాల్సిందే. విమానాల వర్కింగ్ కండిషన్ బాగుంటేనే అవి సజావుగానడుస్తాయి. తాజాగా ఎయిర్ ఇండియా తీసుకున్న నిర్ణయం వలన ఎయిర్ ఇండియా ఎకస్కు చెందిన 5వేల మంది పైలెట్లు డోపింగ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. పైలెట్లు, సిబ్బంది డోపింగ్ టెస్ట్లో నిషేధిత ఆహార పదార్థాలున్న సంకేతాలు కానీ, ఆనవాళ్లు కానీ కనబడితే, నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ వస్తే అది ప్రమాదాలను సూచిస్తుంది.

intoxication

నిబంధనలు పాటించేటట్లు చూసుకోవాలి

ఘటన జరిగినప్పుడే కాస్త హడావుడి. మళ్లీ మామూలే. ముందుగా విమాన భద్రతా లోపం కన్పిస్తే జాగ్రత్తపడేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. విమానయా న సంస్థలు యేటాకనీసం10శాతం ప్లెట్ క్రూను యాదృచ్చి కంగా సైకోయాక్టివ్ ప్రమాదాలు పడుతుంటాయి. ఒక పరీక్షల్లో పాజిటివ్ వచ్చినంత మాత్రాన శరీరం రోగగ్రస్థ మని అనుకోనక్కర్లేదు. ఈ పరీక్షలను ఒక్క పైలట్లకే సబ్ స్టాన్స్ పరిమితం చేయడం తప్పు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ నిబంధనల ప్రకారంయేడాదికి 10శాతం మంది పైలట్లకు మాత్రమే యాదృచ్ఛికంగా డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఆధునిక విమానయాన రంగంలో సిబ్బందిపై విపరీత పనిభారం, సక్రమంగా లేని రోస్టర్ వేళలు, తగినంత విశ్రాంతి దొరక్కపోవడం వంటి అంశాల్లో వారి మానసిక ఒత్తిడివారి ఆరోగ్యం మీద పడుతోంది. డ్రగ్స్ వాడకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడ దు. విమానం నడిపే పైలట్ చేతిలో వందలకొద్దీ ప్రాణా లుంటాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అంతే సంగతులు. ఎయిర్ ఇండియా వంటి విమానయాన సంస్థలు మరికొన్ని తమ సర్వీసులను నడిపిస్తున్నాయి. ఆ సంస్థ లు కూడా తమ పైలట్లు ఇటువంటి నిబంధనలు పాటించేటట్లు చూసుకోవాలి. నిన్నమొన్నటి విమాన ప్రమాదం మొదటిది కాకున్నా, ఇలాంటి ప్రమాదం మరొకటి జరుగకుండా అప్రమత్తంగా ఉండాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

addiction alcohol Breaking News de-addiction intoxication latest news Latest Telugu News Telugu News Treatment Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.