📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Internet : ఇంటర్నెట్ విస్తరణతో సమాచార భద్రతకు సవాళ్లు!

Author Icon By Sudha
Updated: October 26, 2026 • 4:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Internet : సాంకేతిక ప్రగతిఅంతరిక్షాన్ని అందుకుంటున్నా దేశం లోని అనేక మారుమూల గ్రామాలకు నేటికీ నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందడం లేదు. నగరాల్లో డిజిటల్ విప్లవం పరుగులు తీస్తుంటే కొండప్రాంతాలు, అటవీ గ్రామాల్లో సమాచార సౌకర్యాల కొరత కొనసాగు తోంది. ఈ సమస్యకు ఉపగ్రహ ఇంటర్నెట్ ఆశాజనకమైన పరిష్కారంగా ముందుకొస్తోంది. అయితే దీని విస్తరణతో పాటు సమాచార భద్రత, వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యమి వ్వాలి. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం 2026 మార్చి నాటికి దేశంలో ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య 109.28 కోట్లకు చేరింది. జూన్ నాటికి 111.42 కోట్లకు పెరిగింది. వీటిలో 106.64 కోట్ల కనెక్షన్లు వైర్లెస్ ఆధారితమైనవే. మారుమూల ప్రాంతాల్లో టెలికాం మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అధిక వ్యయం, భౌగోళిక అవరో ధాలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఉపగ్రహ సేవలతో వీటిని కొంతవరకు అధిగమించవచ్చు. సాధారణఇంటర్నెట్ సేవలకు భూగర్భ కేబుళ్లు, సెల్ టవర్లు అవసరం, భూమికి సమీప కక్ష్యల్లో పరిభ్రమించే ఉపగ్రహాల ద్వారా విస్తారమైన ప్రాంతాలకు సమాచార సేవలను అందించ వచ్చు. గ్రామీణ విద్యార్ధులకు ఆన్లైన్ తరగతులు, రైతు లకు వాతావరణ సూచనలు, పంటల ధరల సమాచారం, మారుమూల వైద్యకేంద్రాలకు నిపుణుల సలహాలు అందిం చడంలో ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.

Read Also : Former Army Officer Arrested: సైనిక రహస్యాల లీకేజీ ఆరోపణలతో రిటైర్డ్ ఆర్మీ అధికారి అరెస్ట్!

Internet

Internet : సమాచారానికి రక్షణ కల్పించాలి

వరదలు, తుఫానుల సమయంలో భూమిపై సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నప్పుడు ప్రత్యామ్నాయ సమాచార మార్గంగానూ సేవలందించగలదు. అయితే ఉపగ్రహ ఇంటర్నెట్ విని యోగంలో కొన్ని భద్రతాపరమైన ముప్పులున్నాయి. ఇళ్ల లో ఏర్పాటు చేసే రిసీవర్లు, రౌటర్లలో భద్రతా లోపాలుం టే హ్యాకర్లు వాటిని నియంత్రించే ప్రమాదముంది. సరైన సాంకేతీకరణ లేకపోతే వ్యక్తిగత సమాచారం అనధికార వ్యక్తులకు చిక్కవచ్చు. నకిలీ సంకేతాలతో సమాచార వ్యవ స్థలను తప్పుదోవ పట్టించడం, రేడియో సంకేతాలకు అంతరాయం కలిగించడం వంటి సమస్యలూ తలెత్తవచ్చు. ఉపగ్రహ సేవలను నిర్వహించే భూకేంద్రాలపై సైబర్బాడు లు జరిగితే అనేక ప్రాంతాల్లో సమాచార సేవలు నిలిచి పోయే అవకాశముంది. అత్యవసర సమయాల్లో ఇటువంటి అంతరాయాలు సహాయక చర్యలను దెబ్బతీస్తాయి. ఈ ప్రమాదాల నివారణకు బలమైన సాంకేతీకరణ, సాఫ్ట్వేర్ భద్రతా నవీకరణలు, స్వతంత్ర సాంకేతిక తనిఖీలు అవస రం. వినియోగదారుల వ్యక్తిగత వివరాలు, పరికరాల స్థాన సమాచారానికి రక్షణ కల్పించాలి. ఉపగ్రహ సేవలను సంప్ర దాయ టెలికాం వ్యవస్థకు అనుబంధంగా అభివృద్ధి చేయా లి. పరికరాల ధరలు, నెలవారీ చార్జీలు సామాన్యులకు అందుబాటులో ఉండాలి. డిజిటల్ అక్షరాస్యతను పెంపొం దించడంతోపాటు ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అంతరిక్షం నుంచి అందేఇంట ర్నెట్ సామాన్యుడి జీవితంలో వెలుగులు నింపాలి. సాంకే తిక విస్తరణకు ప్రజల సమాచార భద్రత, ఆర్ధిక స్థోమత, అవసరాలే ప్రామాణికం కావాలి.


-సి. హెచ్. ప్రతాప్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News cyber security Cyber threats Data Privacy Information Security Internet Expansion L:atest telugu news latest news Telugu News Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.