📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

India’s defense : భారత్ ఆచితూచి అడుగులు వేయాలి

Author Icon By Sudha
Updated: August 19, 2026 • 3:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

India’s defense : బలూచిస్తాన్ స్వాతంత్ర్యం ప్రక టించుకుంది. ఇక ఇతర దేశాల గుర్తింపే మిగిలి ఉంది. పాక్ ఆక్రమి త కాశ్మీర్ కల్లోలంగా మారింది. పిఒకే పాక్ నుండి విడిపోవడానికి సిద్ధంగా ఉంది. పాక్ పాలకుల పట్ల, మిలటరీ వ్యవస్థ పట్ల అక్కడి ప్రజల్లో కోపాగ్ని కట్టలు తెంచుకుంది. ఇవన్నీ భారత దేశానికి సానుకూల అంశాలైనప్పటికీ, ఈ అవకాశాలను ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ వినియోగించుకుంటుం దా? లేక మరికొంత కాలం వేచిచూస్తుందా అనే విషయం లో స్పష్టత రావలసి ఉంది. జంతర్ మంతర్లో సిజెపి సాగించిన ఉద్యమం తర్వాత భారత ప్రభుత్వం ఎఫ్సిఆర్ఎ, మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను లోక్ సభ లో ప్రవేశ పెట్టకుండా వాయిదా వేసింది. విదేశీ విరాళాలకు సంబంధించిన ఎఫ్సిఆర్ఎ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని నిర్ణయించింది. ఒకవైపు అంతర్జాతీయ ఒత్తిళ్లు, మరోవైపు ప్రతిపక్షాల నిరసనలు, ఇంకోవైపు జన్ జి హెచ్చరికలతో కేంద్రప్రభుత్వం కొంత ఇరకాటంలో పడిం ది. ఈ పరిస్థితుల దృష్ట్యా పాక్ విషయంలో సంయమనం పాటిస్తుందా? అనే అంశం ప్రస్తుతానికి సందిగ్ధంలోనే ఉంది. ఒకవైపు ఇరాన్ యుద్ధం వలన ఏర్పడిన ఇంధన కొరత వలన దేశం ఆర్ధికంగా సవాళ్లను ఎదుర్కొంటున్నది. దేశం అనేక బాలారిష్టాలను అధిగమించి, వివిధ రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తున్నది.

Read Also : Green Card in the USA : అమెరికాలో గ్రీన్ కార్డుపై పబ్లిక్ ఛార్జ్ పేరుతో కొత్త నిబంధనలు

India’s defense

India’s defense : ప్రపంచ దేశాలకు భారత్ ఆయుధ సామర్థ్యం

విద్య, వైద్య, శాస్త్ర, సాంకేతిక, అణు, ఆయుధ, రక్షణ రంగాలు బలోపేతమైనాయి. అయితే శతృ శేషం మిగిలేఉంది. అమెరికా, చైనా, పాక్, బంగ్లాదేశ్ వంటి దేశాల వైఖరి వలన భారత్ అనేక అవరోధాలు ఎదుర్కొం టున్నది. దేశంలో ఇంకా పేదరికం పోలేదు. ఆర్ధిక అంత రాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉపాధి అవకాశాల కోసం యువత నానా అగచాట్లు పడుతున్నది. చమురు రంగం భారత్ ఆర్థిక పరిస్థితిని శాసిస్తున్నది. అమెరికా భారత్ పై అసూయా ద్వేషాలతో రగిలిపోతున్నది. డ్రాగన్ తన రణవ్యూహాలకు పదును పెడుతున్నది. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న దాయాది దేశం తన భూభాగాలను చైనాకు విక్రయించడానికి ప్రయత్నిస్తుందన్న వార్తలు వెలు వడుతున్నాయి. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిన చందంగా పాక్ వైఖరి దారుణంగా మారింది. సీమాంతర ఉగ్రవాదం ప్రోత్సహిస్తూ, కాశ్మీరంలో కల్లోలం సృష్టించిన పార్కు ఆప రేషన్ సిందూర్ ద్వారా భారత్ తగిన గుణపాఠం చెప్పడం ద్వారా ప్రపంచ దేశాలకు భారత్ ఆయుధ సామర్థ్యం తెలి యవచ్చింది. అమెరికా, చైనా ఆయుధాల పేలవమైన ప్రదర్శన కూడా ఆయా దేశాల ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలను పునరాలోచనలో పడేశాయి.

నాటో దేశాలే కారణం

ఆపరేషన్ సిందూర్ తర్వాత అమెరికా వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. పాకిస్థాన్ కు అండగా నిలబడుతూ, వివిధ రకాలుగా భారత్ వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నది. ట్రంప్ భారత్పై ప్రదర్శిస్తున్నఆక్కను వలన భారత్ ఆర్ధికంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికా విధిస్తున్న టారిఫ్లవలన భారత వాణిజ్యం గంద రగోళంలో పడింది. ట్రంప్ ట్రేడ్ పాలసీ, టారిఫ్లు, వీసా నిబంధనలను పరిశీలించి, విశ్లేషించిన తర్వాత భారత్ ఇక ఏ మాత్రం అమెరికాపై ఆధారపడకూడదన్న ఆలోచనభారత ప్రభుత్వానికి స్ఫూరించే ఉంటుంది. ఇంధన రంగంలో ఏర్ప డిన సంక్షోభం దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారత్ స్వయం సంమృద్ధి సాధించవలసిన ఆవశ్యకత ఏర్ప డింది. భారత్కు రష్యాతోగల వాణిజ్య, స్నేహ సంబంధాలు అమెరికాకు ఇష్టం లేదు. రష్యా ఉ క్రెయిన్ల మధ్య జరుగు తున్న యుద్ధానికి అమెరికా, నాటో దేశాలే కారణం. అయితే అమెరికా ఈ విషయంలో భారత్పై ఆకారణ నింద మోప డం హాస్యాస్పదం. రష్యా, ఉక్రెయిన్ల మధ్య గత నాలుగు న్నరేళ్లుగా యుద్ధం కొనసాగడానికి అమెరికాతో పాటు, ఇప్పుడు అమెరికాను విమర్శిస్తున్న నాటో కూటమి అందించిన ఆయుధ, ఆర్ధిక సహకారమే కారణం.

మేకపోతు గాంభీర్యం

ఈ విషయాన్ని పక్క దారి పట్టించి రష్యానుండి భారత్ అధిక మొత్తంలో క్రూడా యిల్ దిగుమతి చేసుకుని, రష్యాకు ప్రధాన ఆదాయ వన రుగా మారిందని, అందువలనే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేయగలుగుతున్నదని అమెరికా వితండవాదం చేయడమే కాకుండా భారత్ ఉత్పత్తులపై 100శాతం సుంకాలు విధి స్తూ అమెరికా సెనేట్ భారీ మెజారిటీతో తీర్మానం ఆమోదించడం విడ్డూరం. ట్రంప్, మోడీలు మంచి స్నేహితులు కాబట్టి ఈటారిఫ్ పై వారే మాట్లాడుకుంటారని ట్రంప్ సల హాదారులు వ్యాఖ్యానించడం కొనమెరుపు. భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ అమల్లోకి వస్తే సెనేట్ ఆమోదించిన తీర్మా నానికి విలువ ఉంటుందా? ఇరాన్ పై యుద్ధం ప్రకటించి, తమకు గల ఆయుధ నిల్వలను ఖాళీవేస్తూ, ఆర్థికంగా దివాలా తీసిన అమెరికాకు ఇతర దేశాల వ్యవహారాల్లో తల దూర్చితే ఏం జరుగుతుందో ఇరాన్ యుద్ధ ఫలితాలు నిరూపించాయి. ఇరాన్ చేతిలో భంగపడి, చేతులు కాల్చుకున్న అమెరికా ఒకవైపు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, మరో వైపు ఇరాన్ను బుజ్జగించి, శాంతి ఒప్పందానికి పాక్ లాంటి దేశాల మధ్యవర్తిత్వం కోసం ఆర్థికసహాయం చేస్తూ, అంత ర్జాతీయంగా అపకీర్తి మూటగట్టుకుంది. భారత్ పై అమెరికా పగబట్టి, ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తుంటే, భారత్కు చైనా మరోవైపు పొగబెడుతున్నది.

బలుచిస్తాన్ ప్రాంతాల్లో అంతర్యుద్ధం చెలరే గింది

చైనా బ్రహ్మపుత్ర నదిపై 14 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి భారత్న ఇబ్బంది పెట్టా లని చూస్తున్నది. జల విద్యుత్ ప్రాజెక్టు పేరుతో చైనా నిర్మి స్తున్న ఈ డ్యామ్ వలన భారత్ ఈశాన్య రాష్ట్రాలకు నీటి సరఫరా చేయకుండా నిలిపి వేయడం, వరదలు సంభవిస్తే ఈ ప్రాంతాలను ముంపుకు గురిచేసే దురుద్దేశ్యం ఇందులో దాగివుంది. భారత్ పాకక్కు సింధు జలాలను నిలిపివేయడం వలన పాక్లో నీటి సంక్షోభం ఏర్పడగా మరోవైపు, పాక్క్ర మిత కాశ్మీర్, బలుచిస్తాన్ ప్రాంతాల్లో అంతర్యుద్ధం చెలరే గింది. త్వరలో బ్రిక్స్ దేశాల సమావేశం భారత్లో జరగను న్న దృష్ట్యా భవిష ్యత్ అవసరాలదృష్ట్యా చైనా దేశం భారత్ పట్ల సానుకూల వైఖరి ప్రదర్శిస్తుందా? అమెరికాకు వ్యతిరే కంగా భారత్తో చేతులు కలుపుతుందా? అనే విషయంలో ఒక స్పష్టమైన సంకేతం వెలువడే అవకాశముంది. ఏదిఏమై నప్పటికీ పొరుగు దేశాల వలన భారత్కు అనేక ఇబ్బందు లు తలెత్తుతున్నాయి. ‘యు కెన్ ఛేంజ్ ఫ్రెండ్స్ బట్నాట్ నైబర్స్’ అంటూ అప్పటి మన ప్రధాని వాజ్ పేయి చెప్పిన మాటలు అక్షరసత్యాలు. ఈ వాస్తవం వర్తమాన భారతంలో జరుగుతున్న పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఒకప్పుడు పాక్ అగడాలు, అలసత్వం, నియంతృత్వం భరించలేక భారత్ శరణు జొచ్చి, తూర్పు పాకిస్థానన్ను ‘బంగ్లాదేశ్ ప్రత్యేక దేశం గా ఏర్పాటు చేయడంలో భారత్ చేసిన కృషిని నేడుఅక్కడి పాలకులు, యువత మరచిపోవడం దురదృష్టకరం.

India’s defense

భారత్ను రక్షణపరంగా శతృ దుర్చే ద్యంగా మార్చాలి

చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్ దేశాలతో భూ సరిహద్దులను పంచుకుంటున్నభారత్ కు చైనా, పాక్, బంగ్లాదేశ్లలతో ప్రస్తుతం బద్ధవైరం నెలకొని ఉంది. భారత్ తో సముద్ర సరిహద్దులు గల శ్రీలంక, మాల్దీ వులతో గతంలో కొన్ని విబేధాలుతలెత్తి ప్రస్తుతం సద్దుమణి గాయి. ఇప్పుడు శ్రీలంక భారత్తో సఖ్యంగానే ఉంటున్నా భారత్కు జరగవలసిన అనర్ద ఇప్పటికే జరిగిపోయింది. ఇక పొరుగునున్న నేపాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా భారత్ పై వాటి విదేశాంగ విధానం కూడా మారుతున్నది. ఇస్లామిక్ దేశాల్లో చాలా వరకు మనకు అనుకూలత ఉన్నా, ఇతర దేశాల కుట్రలతో ఆయా దేశాలు ఎప్పుడెలా మారతా యో తెలియదు. ఇస్లామిక్ నాటో పట్ల కూడా భారత్ ఆచి తూచి అడుగులువేయాలి. మన చుట్టూ ముప్పుపొంచిఉంది. సరికొత్త వ్యూహాలతో, భారత్ను రక్షణపరంగా శతృ దుర్చే ద్యంగా మార్చాలి. భారత్ సాంకేతికంగా, ఆయుధపరంగానూ బలీయమైన శక్తిగా ఎదిగినప్పటికీ మధ్య ప్రాచ్యంలో గతకొన్ని నెలలుగా జరుగుతున్న యుద్ధ పరిణామాలు, ఆయిల్ సంక్షో భంవలన ఆర్ధికంగా నష్టపోతున్న విషయంవిదితమే. యుద్ధాల అంచుల్లో పయనిస్తున్న ప్రపంచంలో ఎప్పుడు ఏసంక్షోభం తలెత్తుతుందో ఊహించలేం. వర్తమాన అంతర్జాతీయ పరిణామాలనుబట్టి భారత్ ఆచితూచి అడుగులువేయాలి.

-సుంకవల్లి సత్తిరాజు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News defense india Indian Defence latest news Latest Telugu News Military National Security Telugu News Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.