Government schools : విద్యా వ్యవస్థలో ఆధునిక పోకడలకు అనుగుణంగా ప్రభుత్వాలు విద్యపై ప్రత్యేక దృష్టి సారించడం తద్వారా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే రీతిలో రాష్ట్రాల్లో అమలవుతున్న విద్యావిధానం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే భిన్నాభిప్రాయాలు లేకపోలేదు. ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు విద్యావిధానంలో బోధనా అభ్యసనంలో విద్యార్థుల ప్రగతికి తోడ్పడే విధంగా తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశలో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసు కుంటూ ఉండడం గమనార్హం. విద్యలో డిజిటల్ విద్యా విధానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించడం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ను ఆకర్షించే రీతిలో ఉంటున్నాయని అనిపిస్తుంది. విద్యా ర్థులకు విశాలమైన ఆట స్థలాలు మౌలిక సదు పాయాలు మెరుగైన శానిటేషన్ వ్యవస్థ, త్రాగునీరు, మధ్యాహ్న భోజ నంతోపాటు కొన్ని రాష్ట్రాలు పైలెట్ ప్రాజెక్టుగా అల్పాహారం అందిస్తున్న క్రమంలో ఉ పాధ్యాయులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలపై తమ పిల్లలపై శ్రద్ద వహించే రీతిలో ప్రభుత్వ పాఠశాలలు ఉంటున్నాయనే భావన కల్పించే రీతిలో ప్రధానంగా విద్యాశాఖను నిర్వహిస్తున్నటువంటి మంత్రులు ప్రభుత్వ పాఠశాలల ఆవశ్యకతను సమాజం గుర్తించే విధంగా రాజకీయాలకతీతంగా తోడ్పాటు అంది స్తుండడంతో అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి.
Read Also : AP Schools Sick Rooms: ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో సిక్ రూమ్‌లు
Government schools : అవగాహన చేసుకోవాలి
ప్రభుత్వ పాఠశాల అభ్యు న్నతికి విద్యా కమిటీలు గ్రామయువజన సంఘాలు స్థాని కంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వపాఠ శాలల్లో విద్యార్థుల నమోదుఉంటేనే భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాల మనుగడకు అవకాశం ఉంటుందనే విషయ అవ గాహన చేసుకోవాలి. స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరుచుకునే రీతిలో ప్రభుత్వ పథకాలను సాధ్యమై నంతగా వినియోగించుకుంటూ బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలవైపు మొగ్గుచూపే విధంగా ఉ పాధ్యాయు లు, విద్యా కమిటీలు సంయుక్త సహకారంతో బడిబాట లాంటి కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు విద్యార్థు లను అధిక సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు చేర్పించి నాణ్యమైన విద్యను అందించే విధానంలో బాధ్యతాయు తమైన పాత్రను మరింత పోషించాల్సి ఉం ఈ క్రమంలో సమాజంలోని వారందరూ ఆర్థికస్తోమతతో నిమిత్తం లేకుం డా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తే రాబోవు కాలంలో ప్రవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు ఉ. చితమైన నాణ్యమైన విద్యా విధానం ప్రతి ఒక్కరికి పూర్తిస్థాయిలో అందుతుందని అను కునేవారు లేకపోలేదు.
ఆధునిక నూతన భావనలను ..
విద్యావ్యవస్థలో వస్తున్న మార్పుల గురించి అవగాహనతో ఉన్న సంబంధిత శాఖఅధికారులు, మంత్రులు ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నతమైన విద్యా బోధనను విద్యార్థులకు అందించే రీతిలో ఏర్పాటైన విద్యా కమిటీలు కూడా ప్రభుత్వంతో సమన్వయంగా ఉంటూ ఆశించిన స్థాయిలో విద్యా సంస్కరణల అమలు విధానాల పైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ విద్యావిధానంలో ఎదు రయ్యే సమస్యలపై విభిన్న కోణాల్లో ఆలోచిస్తూ ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులకు ఆధునిక బోధనా విధానాలను అమలుపరచడంలో సఫలీకృతం కావడానికి మరింత ప్రయ త్నించాలి అని కోరుకునే వారు లేకపోలేదు. అంతేకాకుండా సంబంధిత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో ఆధునిక నూతన భావనలను కలిగించడానికి శాస్త్రసాంకేతిక ద్యపై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవడానికి ప్రభుత్వ విద్యారంగం లో అన్నిపాఠశాలలో క్రమక్రమంగా సాంకేతిక ఉపకరణాలు వినియోగించుకునే అవకాశంఉండడంతో సంబంధిత ప్రభు త్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు శిక్షణఇస్తుం డటంతో రాబోవు కాలంలో ప్రభుత్వ పాఠశాలలు మరింత ఆధునికతను సంతరించుకుంటాయి అని అనిపిస్తుంది. విద్యా రంగ అభివృద్ధికి ఎమ్మెల్సీల పాత్రకూడా చాలా ముఖ్యమై నది. రాజకీయాలకతీతంగా రాష్ట్రాల్లో విద్యను ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విధానంలో విద్యా శాఖకు సంబంధించి శాసనమండలి సభ్యులు కూడా చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో నూతన సంస్కరణల విష యంలో ప్రభుత్వానికి సలహాలుసూచనలు ఇస్తూనే ఎదురవుతున్న సమస్యలపై మరింత ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవస రం ఉంది. ఈ క్రమంలో తరచూ ఉ పాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీలు ప్రభుత్వపాఠశాల బలోపేతానికి కావలసిన అం శాలపై వీలైనప్పుడల్లా సంబంధిత విద్యాశాఖతో చర్చ జరు పుతూ ఉండడం రాబోకాలంలో ప్రభుత్వ పాఠశాల విద్య మరింత బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది.
-దాడిశెట్టి శ్యామ్ కుమార్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: