📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Election Commission : ప్రమాదం అంచున ప్రజాస్వామ్యం!

Author Icon By Sudha
Updated: October 5, 2026 • 3:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Election Commission : ప్రస్తుతం దేశంలో పరిస్థితి చూ స్తుంటే మరో ఉద్యమానికి బాటలు వేస్తున్నట్లుంది వ్యవస్థల తీరుతో, భారతరాజ్యాంగం ప్రజలకు ఒక గొప్ప హామీ ఇచ్చింది. ప్రభుత్వం ప్రజలది, ప్రజల చేత, ప్రజల కోసం నడవాలి. కానీ ప్రజాస్వామ్యం కేవలం ఐదేళ్లకోసారి ఓటు వేయడం కాదు. ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి. ఎన్నికల సంస్థ నిష్పాక్షి కంగా ఉండాలి. అధి కారంలో ఉన్నవారు అధికార దుర్వినియోగం చేయకూడదు. ప్రతిపక్షానికి సమాన రాజకీయ అవకాశం ఉండాలి. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిం చాలి. మీడియా ప్రశ్నించగలగాలి. ప్రజలకు ప్రభుత్వ నిర్ణ యాలపై సమాచారం అందుబాటులో ఉండాలి. ఈ వ్యవస్థ లలో ఏ ఒక్కటి బలహీనపడినా ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది. ‘అందుకే ప్రశ్న ఎవరు గెలిచారు? అనేది మాత్రమే కాదు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు పూర్తి నమ్మ కం ఉందా? అధికారంలో ఉన్నవారిని ఎన్నికల సంఘం సమానంగా ప్రశ్నించగలదా? ‘రాజకీయ విరాళాల విష యంలో ప్రజలకు తెలుసుకునే హక్కు ఎంత?’ ‘కోర్టులు ప్రజాస్వామ్య హక్కులకు చివరి రక్షణగా పనిచేస్తున్నాయా? అనే ప్రశ్నలు కూడా అంతే ముఖ్యమైనవి. భారత రాజ్యాం గంలోని ఆర్టికల్ 324 పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల పర్యవేక్షణ, దిశానిర్దేశం, నియంత్రణను ఎన్నికల సంఘానికి అప్పగించింది.

Read Also : Supreme Court: సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్నికల సంఘానికి నోటీసులు

Election Commission

Election Commission : నియంత్రణ విధిం చాల్సిన సంస్థ

ఎన్నికల సంఘం 25 జనవరి 1950న ఏర్పడిన రాజ్యాంగబద్ధ సంస్థ. అంటే ఎన్నికల సంఘం ఒక సాధారణ ప్రభుత్వ శాఖ కాదు. అది అధికార పార్టీకి కూడా నియంత్రణ విధిం చాల్సిన సంస్థ. ఎన్నికల సంఘం స్వయంగా చెబుతున్న ప్రవర్తనా నియమావళి ప్రకారం అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల ప్రయోజనాలకు ఉపయో గించకూడదు. ప్రభుత్వ నిధులతో రాజకీయ ప్రచారం చేయ కూడదు, అధికారిక పర్యటనలను ఎన్నికల ప్రచారంతో కలవకూడదు. ఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది. చట్టం ఉండటం ఒక విషయం. దాన్ని అందరికీ సమానంగా అమలు చేయడం మరో విషయం. 2023 చట్టం ద్వారా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్రమంత్రిని ఎంపిక కమిటీలో చేర్చారు. ఈ వ్యవస్థపై సవాళ్లు సుప్రీంకోర్టులో కొనసాగి, 2026లో కూడా ఈ నియామక వ్యవస్థపై విచా రణ సందర్భంగా కోర్టు పార్లమెంట్ చాలాకాలం నియామక చట్టం చేయకపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. ఇక్కడ సమస్య ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అయ్యా రనే విషయం కాదు. ఎన్నికలను నిర్వహించే సంస్థకు రాజకీయ కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి ఎంత దూరం ఉండాలి? అనేదే అసలు రాజ్యాంగ ప్రశ్న.

అధికార కేంద్రీకరణ ప్రమాదకరం

2024 లోక్సభ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సంబంధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఫిర్యాదులపై ఎన్నికల సంఘం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. ఇది వ్యక్తిగత అభ్యర్థులకు కాకుండా రాజకీయ పార్టీలకు నోటీసులు పంపి న కొత్త విధానంగా అప్పట్లో వార్తల్లో చర్చనీయాంశమై నది. ఇక్కడ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఎన్నిసార్లు ప్రశ్న లు లేవనెత్తినా ఎన్నికలసంఘంసరైన సమాధానమివ్వలేదు. ఎన్నికల సంఘం తీరుచుస్తే అయినవాడికి మంచంలో కాని వాడికి కంచంలో అన్నట్లుంది. 2014 నుంచి ఏ ఎన్నికలు చుసినా పారదర్శకంగా ఉన్నట్లు తెలుస్తుందా? ప్రశ్నించు కుంటే అగమ్యగోచరంగా ఉంది. ఎన్నికల వ్యవస్థపై చర్చలో అత్యంత సున్నితమైన అంశం ఈవీఎం. 2024 ఏప్రిల్ 26న సుప్రీంకోర్టు ఈవీఎంవి.వి. పాట్ వ్యవస్థను పరిశీలిం చిన కేసులో 100 శాతం వి.వి.పాట్ లెక్కింపు లేదాబ్యాలెట్ పేవర్కు తిరిగి వెళ్లాలని కోరిన పిటిషన్లను తిరస్కరించింది. అదే సమయంలో కొన్ని అదనపు భద్రతా చర్యలను కూడా ఆదేశించింది. ఈవీఎంపై అనుమానం వ్యక్తం చేయడంప్రజా స్వామ్య హక్కు కానీ ఆ నమ్మకాన్ని పరీక్షించుకునే పార దర్శక వ్యవస్థ కూడా చాలా అవసరం. ఉదాహ రణకు మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లో ఎక్కోడో ఉన్న సైబర్ నేర గాళ్లు మనప్రమేయం లేకుండా ఎలాడబ్బును తీస్తున్నారో చూస్తున్నాము. అంటే చరిత్ర మనకు రెండు పాఠాలు చెబుతుంది. అధికార కేంద్రీకరణ ప్రమాదకరం. అదే సమయంలో సంస్థలు దాన్ని అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.

ఒకదానిపై మరొకటి అధికార నియంత్రణ

ప్రజాస్వామ్యం అంటే కేవలం మెజారిటీ పాలన కాదు, అది రాజ్యాంగ పాలన, సమాఖ్య వ్యవస్థ, న్యాయ పరమైన సమీక్ష, వ్యక్తిగత హక్కులు, ఎన్నికల స్వేచ్ఛ, సంస్థాగత సమతుల్యత వంటి అన్నింటి సమాహారమే ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఒక్క ఎన్నికల కమిషనర్ వల్ల కాదు. ఒక్క ప్రభుత్వం వల్ల కాదు. ఒక్క న్యాయమూర్తి తీర్పు వల్ల కాదు. అసలు ప్రమాదం సంస్థలు ఒకదానిపై మరొకటి అధికార నియంత్రణ, సమతుల్యత కోల్పోయినప్పుడు. ఒక వ్యవస్థను అధికార రాజకీయాలు ప్రభావితం చేస్తే మరో వ్యవస్థ ప్రశ్నించక పోతే, మూడో వ్యవస్థ ఆలస్యంగా స్పందిస్తే, మీడియా ప్రశ్నించడం మానేస్తే. ప్రజలు సమాచారాన్ని పరిశీలించకుండా ప్రచారాన్ని మాత్రమే నమ్మితే అప్పుడు ప్రజాస్వామ్యపు బాహ్య నిర్మా ణం మిగిలి, దాని అంతర్గత స్ఫూర్తి బలహీనపడే ప్రమాదం ఉంది. రాజ వ్యంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో ఒక కీలకమైన హెచ్చరిక చేశారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే వ్యక్తులు చెడ్డవారైతే అది వారికి అనుకూలంగా మార్చుకుం టారు, చెడుగా మారవచ్చు. రాజ్యాంగం లోపభూయిష్టమై నదైనా దాన్ని అమలు చేసే వారుమంచివారైతే అది మంచి ఫలితాలను ఇవ్వగలదని అన్నారు. సుప్రీంకోర్టు ప్రచురించిన అంబేద్కర్ రాజ్యాంగ సభ ప్రసంగాల అధికారిక సంకల నంలో ఈ భావన నమోదైంది. ఇదే నేటి భారతదేశానికి అత్యంత ముఖ్యమైన పాఠం. రాజ్యాంగం కాగితంపై గొప్పగా ఉండటం మాత్రమే సరిపోడు. రాజ్యాంగ సంస్థలను నడిపే వ్యక్తులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలి. ప్రజాస్వా మ్యాన్ని బలపరచడానికి అధికార పార్టీ అయినా, ప్రతిపక్షం అయినా ఒకే ప్రమాణం ఉండాలి.

Election Commission

బలహీనపడినప్పుడు దాని పునాది నెమ్మదిగా క్షీణిస్తుంది

ఎన్నికల డేటాలో గరిష్ఠ పారదర్శకత పోలింగ్, లెక్కింపు తదితర సమాచారాన్ని సాధ్యమైనంతవరకు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచాలి. ఎవరు రాజకీయ పార్టీలకు ఎంత విరాళం ఇస్తు న్నారు అనే అంశంలో ప్రజల సమాచార హక్కుకు ప్రాధా న్యత, పారదర్శకత ఉండాలి. న్యాయవ్యవస్థలో వేగవంత మైన ఎన్నికల కేసుల విచారణ విధానం అవసరం. ప్రజా స్వామ్య సంస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండే విధానాలు బలపడాలి, ఢిల్లీలో ‘సర్’ ప్రక్రియలో అవకతవకలే ప్రధాన మైనది. ఢిల్లీలో 145కోట్ల ఓటర్లలో 47లక్షల మంది ఓటర్ల పేరును ‘సర్’ ఎన్యూమరేషన్ దశలోనే తొలగించి, ముసా యిదా జాబితాలలోని 97లక్షల మంది ఓటర్లలో 33లక్షల మందికి తార్కికమైన వైరుధ్యాలు అనే కారణంతో నోటీసులు జ 2రీ చేసి, దశాబ్దాలుగా ఓటు వేస్తున్నవారిని తమకు ఓటు హక్కు ఉందని నిరూపించుకోవాలని నోటీసులివ్వడం, అలాగే ఓటర్ జాబితాల నుంచి లక్షలాది ఓటర్ల పేర్లను తొలగించి ప్రజలు ఆగ్రహానికి గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చరిత్ర మనకు ఒక విషయం స్పష్టంగా చెబుతోంది ప్రజాస్వామ్యం ఒక్కసారిగా కూలిపోదు, సంస్థల స్వాతంత్ర్యం, పారదర్శకత, జవాబుదారీతనం ఒక్కొక్కటిగా బలహీనపడినప్పుడు దాని పునాది నెమ్మదిగా క్షీణిస్తుంది. అదే సమయంలో, భారత రాజ్యాంగ చరిత్రలోనే అటువంటి పరిణామాల క్షీణతను అడ్డుకున్న న్యాయవరమైన, సంస్థాగత ఉదాహరణలు కూడా ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడాలి? ఎన్నికల కమిషనర్ కాదు, ప్రభుత్వం ఒక్కటే కాదు, న్యాయమూర్తులు మాత్రమే కాదు, ప్రజలే చివరి రక్షకులు. కానీ ప్రజలు రక్షకు లుగా మారాలంటే వారికి నిజమైన సమాచారం అందించే మీడియా కావాలి, అంతటి సమాచారం కావాలంటే స్వతం త్రమైన సంస్థలు కావాలి. సంస్థలు స్వతంత్రంగా ఉండా లంటే రాజ్యాంగ పరిరక్షణ కావాలి. రాజ్యాంగాన్ని కాపాడా లంటే ప్రజలలో ప్రజాస్వామ్య చైతన్యం కావాలి.

-డా.ఎ. భాగ్యరాజూ

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News Democracy In Danger Democratic Values Election Commission Electoral Reforms Indian Politics latest news Latest Telugu News Telugu News Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.