📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Educational kits : విద్య ఆశయాలు ఘనం, పంపిణీలో విలంబనం!

Author Icon By Sudha
Updated: August 7, 2026 • 4:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Educational kits : పాఠశాల పునఃప్రారంభమై నెలరోజులు దాటిపోతున్నా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందాల్సిన విద్యా కిట్లు పూర్తిస్థాయిలో చేరకపోవడం విద్యా పరిపాలనా యంత్రాంగపు ప్రణాళికారాహిత్యానికి, నిరంతర అలసత్వా నికి నిదర్శనంగా నిలుస్తోంది. విద్యా సంవత్సరం తొలి రోజునుంచే సమాన అవకాశాలతో, నాణ్యమైన చదువును అందించడంతో పాటు పేద కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఉన్నతాశయంతో ప్రభుత్వం ఉచితంగా రెండు జతల యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, వర్క్ బ్బుక్లు, నోట్ బుక్లు, పాఠశాల బ్యాగు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, టైలతో కూడిన సమగ్ర విద్యా కిట్లను ప్రతి ఏటా పంపిణీ చేస్తోంది. తొలి రోజు నుంచే విద్యార్థు లందరూ ఎలాంటి ఆత్మన్యూనతా భావానికి లోనుకాకుండా సమభావనతో, ఆత్మవిశ్వాసంతో తరగతి గదుల్లోకి అడుగు పెట్టాలన్న ఈ శ్రేయోరాజ్య ప్రాథమిక లక్ష్యానికి క్షేత్రస్థాయి లోని నిర్వహణ లోపాలు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. చిరిగిపోయిన, వర్ణం వెలసిన పాత దుస్తులతోనే బడికి వస్తున్న పిల్లల దృశ్యాలు ఒకవైపు కాగా, కొనుగోలు శక్తి లేక తోటి విద్యార్థుల నుంచి కాగితాలు అడిగి తెచ్చుకుని నోట్లు రాసుకుంటున్న దృశ్యాలు మరొకవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కనిపిస్తుండటం విద్యా వ్యవస్థ తీరుపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ విద్యా సంక్షేమ పథకాల విసృతిని పరిశీలిస్తే, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు కేజీబీవీలు, మోడల్ పాఠశాలలు, గురుకులాల్లో అభ్యసిస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు విద్యా సామగ్రిని ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రతిసారీ బడ్జెట్లో వందల కోట్ల రూపాయలు కేటా యిస్తోంది.

Read Also : School nutrition: ఇకపై బడుల్లో పండ్లు, మొలకలు

Educational kits

Educational kits : ఆర్ధిక భారాన్ని తగ్గించడమే

నేటి ఆర్ధిక పరిస్థితుల్లో ఒక సగటు నిరుపేద శ్రామిక కుటుంబానికి ఇద్దరు పిల్లలు ఉంటే, వారి విద్యా సామగ్రి, నూతన దుస్తుల కొనుగోలుకే బహిరంగ మార్కెట్లో వేలాది రూపాయలు వెచ్చించాల్సివస్తుంది. అటువంటి ఆర్ధిక భారాన్ని తగ్గించడమే కాకుండా, పాఠశాలల్లో నమోదు శాతాన్ని గరిష్టస్థాయికి పెంచడం, మధ్యలోనే బడి మానేసే ప్రవృత్తికి అడ్డుకట్ట వేయడం, ధనికపేద వ్యత్యాసాలు లేని సమ్మిళిత విద్యా వాతావరణాన్ని ప్రోత్సహించడంలో ఈ కెట్ల పంపిణీ కీలకంగా మారింది. అయితే, ఏడాది కేడాది పునరావృతమవుతున్న సరఫరా జాప్యాలు ఈ పథకవిస్పత ఆశయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఈ జాప్యానికి అధి కారుల వైపు నుంచి అనేక కారణాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లను ఖరారు చేయడంలో చోటుచేసుకునే సాంకేతిక, పరిపాలనా ఆలస్యాలు, తయారీ సంస్థలకు ఆర్డర్లు ఇవ్వడం లో జాప్యం, మార్కెట్లో వస్త్ర ముడిసరుకు ధరల అస్థిరత ప్రధాన అవరోధాలుగా నిలుస్తున్నాయి. దీనికితోడు వస్త్రాల నేత, కుట్టుపనులు, నాణ్యతా ప్రమాణాల పరిశీలనకు ఎక్కు వ సమయం పట్టడం, రవాణా ఇబ్బందులు, జిల్లా స్థాయి గిడ్డంగుల నుండి మారుమూల పాఠశాలలకు సరఫరా చేయ డంలో సమన్వ య లోపం ఉండటం సమ స్యను మరింత జటిలం చేస్తు న్నాయి.

సమయ పాలన మాత్రమే నిజమైన విజయానికి కొల మానం

విద్యా సంవత్సరం ప్రారంభంలో సంభవించే కొత్త చేరికల ఆధా రంగా అదనపు అవసరాలను ముందస్తుగా ఖచ్చితంగా అంచనా వేయలేకపోవడం కూడా ఈ లోపానికి తోడవు తోంది. కొన్ని వస్తువుల నాణ్యత ప్రమాణాల విషయంలో అధికారులు తీసుకుంటున్న అదనపు జాగ్రత్తల వల్ల పంపిణీ మరింత ఆలస్యమైందని వివరణ ఇస్తున్నప్పటికీ, సమయ పాలన లేని నాణ్యత విద్యార్థుల సమయ నష్టానికి పరిహా రం కాలేదు. సంక్షేమ పథకాలు కేవలం నిధుల కేటాయిం పుతోనో, ప్రకటనలతోనో సంపూర్ణం కావు. వాటి అమలు లోని సమయ పాలన మాత్రమే నిజమైన విజయానికి కొల మానంగా నిలుస్తుంది. పాఠశాల తెరిచిన తొలిరోజే విద్యార్థి చేతికి కావలసిన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు అందితేనే బోధన అభ్యసన ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుంది. తరగతి గదిలో విద్యార్థులందరూ ఒకే విధమైన దుస్తులు ధరించడం ద్వారా వారిలో సమానత్వ భావన, క్రమశిక్షణ పెంపొందుతాయి. సామాజిక శ్రేణులు, ఆర్థిక తారతమ్యాలను తుడిచిపెట్టే ఈ సమభావన సూత్రం, సామగ్రి సమయానికి అందకపోవడం వల్ల ఆటంకానికి గుర వుతోంది. నెలరోజులు దాటినా నోట్బుక్లు, పుస్తకాలు చేతికి రాకపోవడంతో రోజువారీ పాఠ్యాంశాల అభ్యాసన వెనుక బడి, విద్యా సంవత్సరం ఆరంభంలోనే విద్యార్థులలో నిరా సక్తత చోటుచేసుకుంటోంది. ఈ పరిపాలనా అలసత్వం వల్ల అత్యంత ప్రతికూల ప్రభావానికి గురవుతున్నదిగ్రామీణ, గిరిజన ప్రాంతాల నిరుపేద విద్యార్థులే. కొన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు చొరవతీసుకుని తాత్కా లిక ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, అది సంపూర్ణ పరిష్కారం కానేరదు.

Educational kits

వికేంద్రీకరణ పద్ధ తులను ప్రోత్సహించాలి

రాబోయే విద్యా సంవత్సరానికి కావలసిన పం పిణీ ప్రక్రియలను కనీసం మూడునుండి నాలుగు నెలల ముందే, అంటే విద్యా సంవత్సరం ముగిసే సమయానికే ప్రారంభించాలి. మార్చి మాసానికే టెండర్లను పూర్తి చేసి, మే నెలాఖరు నాటికి పంపిణీకి సిద్ధంగా ఉంచేలా కఠినమైన కాల పట్టికను నిర్దేశించుకోవాలి. కొనుగోలు, తయారీ, నాణ్య తా పరిశీలన, రవాణా ప్రక్రియల పర్యవేక్షణ కోసం డిజిటల్ ట్రాకింగ్ విధానాన్ని (జియోటాగింగ్, క్యూఆర్ కోడ్ ఆధారిత పర్యవేక్షణ) ప్రవేశపెట్టాలి. దీని ద్వారా ఏ వస్తువు ఏదశలో ఉందో సెంట్రల్ డాస్బోర్డ్ ద్వారా తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా, కేంద్రీకృత కొనుగోలు వ్యవస్థలపైనే ఆధారపడకుండా వికేంద్రీకరణ పద్ధ తులను ప్రోత్సహించాలి. స్థానిక మహిళా స్వయం సహాయక బృందాలు (మెప్మా, సెర్చ్). చేనేత సహకార సంఘాలు, చిన్న తరహా పరిశ్రమలకు యూనిఫారాల కుట్టుపనులు, అనుబంధ విద్యా సామగ్రి తయారీ బాధ్యతలను అప్పగించడం ద్వారా సమయపాలన సాధ్యమవ్వడ మే కాకుండా, స్థానిక గ్రామీణ ఆర్ధికవ్యవస్థకు ఊతం లభిస్తుంది. నాణ్యతలో లోపాలు రాకుండా కఠినమైన నిబంధనలు అమలు చేస్తూనే, సరఫరా దారులకు సమయానికిబిల్లుల చెల్లింపులు జరిగేలా పారదర్శ కతను నెలకొల్పాలి. అత్యవసరంగా పెరిగే విద్యార్థులసంఖ్య కు ప్రతి జిల్లాస్థాయిలో అదనపునిల్వలను సిద్ధంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలి. విద్యారంగానికి ప్రభుత్వం చేసే ఖర్చు కేవలం సంక్షేమవ్యయం మాత్రమే కాదు,అది దేశ భవిష్యత్తు కోసంచేసే అత్యంత ప్రాధాన్యమైన మూలధన పెట్టుబడి.

-రామ కిష్టయ్య సంగనభట్ల

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News education education department educational kits kit distribution latest news Latest Telugu News School students Telugu News Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.