📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Education : చదువే పేదరిక నిర్మూలనకు మార్గం

Author Icon By Sudha
Updated: July 13, 2026 • 4:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Education : విద్య అనేది వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాదు, సమాజప్రగతికి, రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి, దేశ భవిష్యత్తుకు కూడా మూలాధారం. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన విద్యావకాశాలను కల్పించాలనే లక్ష్యం తో సామాజిక న్యాయ స్ఫూర్తిని ప్రతి ష్ఠించింది. ముఖ్యంగా ఆర్థికంగావెను కబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థు లకు ఉన్నత విద్య అందుబాటులోకి రావాలంటే ప్రభుత్వం ప్రత్యేక బాధ్యత తీసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు కేవలం సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే కాదు, అవి సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రాజ్యాంగ విలువలను ఆచరణలో నిలబెట్టిన చారిత్రాత్మక సంస్కరణ లు. ఈపథకాల ద్వారా లక్షలాది మంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, న్యాయశాస్త్రం, డిగ్రీ, పీజీ, నర్సింగ్, మేనేజ్ మెంట్, ఇతర వృత్తి విద్యా కోర్సులను అభ్యసించి దేశ, విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించారు. చదువుతో ఒక్క విద్యార్థి మాత్రమే కాదు, అతని కుటుంబం, తదుపరి తరం కూడా పేదరికం నుంచి బయటపడగలదని ఈ పథకం స్పష్టంగా నిరూపించింది.

Read Also : AP SSC New Pattern: ఏపీ టెన్త్ బోర్డు సంచలన నిర్ణయం.. మారనున్న పబ్లిక్ పరీక్షల విధానం

Education

Education : రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి

ఒక కుటుంబంలో ఒకరు ఉన్నత విద్యను పూర్తి చేసి స్థిరమైన ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబ ఆర్ధిక పరిస్థితి పూర్తిగా మారుతుంది. కుటుంబ ఆదాయం పెరుగు తుంది. అప్పుల భారం తగ్గుతుంది. తల్లిదండ్రులకు భరోసా లభిస్తుంది. తదుపరి తరానికి మెరుగైన విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు అందుబాటులోకి వస్తాయి. ఈ విధంగా విద్య ఒక వ్యక్తి జీవితాన్నే కాకుండా మొత్తం కుటుంబాన్ని, సమాజాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తిగా మారుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా విద్యను పేదరిక నిర్మూలనకు అత్యంత శక్తివంతమైన సాధనంగా గుర్తిస్తున్నారు. ప్రభు త్వం విద్యపై చేసే ప్రతి రూపాయి ఖర్చు వ్యయం కాదు, అది మానవ వనరుల అభివృద్ధిపై, రాష్ట్ర భవిష్యత్తుపై చేసే అత్యంత విలువైన పెట్టుబడి. 2008లో ప్రారంభమైన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం భారత సంక్షేమ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన విద్యా సంస్కరణలలో ఒకటిగా నిలిచింది. పేదరికం కారణంగా ఉన్నత విద్యకు దూరమవు తున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ పథకం ఆశాకిరణం గా మారింది. గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు, కార్మికులు, చిరు వ్యాపారుల కుటుంబాలకు చెందిన యువత వైద్యులు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు అధికారులు, ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దడం లోనూ, పరిశ్రమలు, ఫార్మా, బయోటెక్నాలజీ, సేవారంగం, స్టార్టవ్ల అభివృద్ధికి అవసరమైన నైపుణ్య మానవ వనరుల ను అందించడంలోనూ ఈ పథకం కీలక పాత్రపోషించింది. ఈ అభివృద్ధి వల్ల రియల్ ఎస్టేట్, రవాణా, ఆరోగ్యం, విద్య, సేవారంగం వంటి అనుబంధ రంగాలు కూడా విస్త రించాయి.

విద్యార్థులు ఫీజులు చెల్లించలేక

రాష్ట్ర ఆదాయం, ఉపాధి అవకాశాలు, తలసరి ఆదాయం పెరగడంలో కూడా ఈ పథకం పరోక్షంగా విశేష పాత్ర పోషించిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈపథకం ప్రభుత్వాల దయాదాక్షిణ్యంతో అమల్లోకి వచ్చినది కాదు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో జరిగిన ఉద్యమాల ఫలితమే ఇది. చదువే పేదరిక నిర్మూలనకు మార్గం’ అనే సామాజిక తత్వానికి ఈ పథకం ప్రతీకగా నిలిచింది. అందువల్ల దీనిని సాధారణ సంక్షేమ పథకంగా కాకుండా సామాజిక హక్కుగా చూడాల్సిన అవ సరం ఉంది. అయితే ఇటీవలి కాలంలో స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల విడుదలలో చోటుచేసుకున్న జాష్యం విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బకాయిలు వేల కోట్ల రూపాయలకు చేరినట్లు వెల్లడవుతోంది. ప్రభుత్వ నిధులు సమయానికి విడుదల కాకపోవడంతో అనేక మంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేక చదువులు మధ్యలో నిలిపివేయాల్సిన పరిస్థితు లు ఏర్పడుతున్నాయి. కళాశాలలు ప్రభుత్వ చెల్లింపులకోసం ఎదురుచూస్తూ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని నిర్వ హణ కొనసాగించాల్సి వస్తోంది. అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లించడం కష్టమవుతోంది. ప్రయోగశా లలు, గ్రంథాలయాలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్వ హణ కూడా ప్రభావితమవుతోంది. దీని ప్రభావం నేరుగా విద్యా నాణ్యతపై పడుతోంది. ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ప్రభుత్వ బకాయిలు విడుదల కాకపో వడంతో అనేక మంది విద్యార్థులు తమ విద్యా సర్టిఫికెట్లు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సామాజిక అసమానతలు మరింత పెరిగే ప్రమాదం

ఉన్నతవిద్య, విదేశీ విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసు కునే అవకాశాలను కోల్పోతున్నారు. ఒక విద్యార్థి భవిష్యత్తు అనిశ్చితిలో పడితే, దాని ప్రభావం అతని కుటుంబంపైనే కాదు, సమాజంపైనా పడుతుంది. చదువు ఆగిపోవడం వల్ల నిరుద్యోగం పెరుగుతుంది. నైపుణ్యం కలిగిన మానవ వన రుల కొరత ఏర్పడుతుంది. సామాజిక అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభు త్వం ‘బడ్జెట్ లేదు’ అనే కారణాన్ని చూపడం సమంజనం గా కనిపించదు. ప్రతి సంవత్సరం సంక్షేమ, అభివృద్ధి కార్య క్రమాలకు బడ్జెట్ కేటాయించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ మైన, పరిపాలనా బాధ్యత. రాష్ట్ర ఖజానాకు పన్నుల రూ వంలో, కేంద్ర నిధుల రూపంలో, భూముల విక్రయాల ద్వారా, ఇతర ఆర్థిక వనరుల ద్వారా భారీ ఆదాయం సమ కూరుతున్నప్పుడు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నిధులను మాత్రమే విడుదల చేయలేకపో వడం ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ పరిస్థితి ఒక్కసారిగా ఏర్పడలేదు. ప్రతి సంవత్సరం అవసరమైన నిధులనుక్రమం తప్పకుండా విడుదల చేయకపోవడం వల్లే బకాయిలు పేరు కుపోయాయి. వార్షిక బడ్జెట్లో ముందుగానే తగిన నిధులు కేటాయించి, త్రైమాసికం లేదా ఆరు నెలలకొకసారి విడతల వారీగా విడుదల చేసి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రణాళికాబద్ధమైన ఆర్థిక నిర్వహణ ఉంటే కళాశాల లు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంతటి ఇబ్బందులు ఎదు ర్కొనాల్సిన అవసరం ఉండేది. కాదు. అందువల్ల భవిష్య త్తులో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా శాశ్వత ఆర్థిక విధానాన్ని ప్రభుత్వం రూపొందించాల్సిన అవసరం ఉంది.

Education

అనుకూలమైన పరిపాలనా విధానాన్ని రూపొందించ డం

ఇటీవల తీసుకొచ్చిన జీవో నెం. 9 కూడా విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని విద్యార్థుల ఖాతాల్లో జమ చేసి, నిర్దిష్ట గడువులోపు కళాశాల లకు చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని పేర్కొనడం సంక్షేమ పథకాల అసలులక్ష్యా నికి విరుద్ధంగా కనిపిస్తోంది. పేద విద్యార్థులు ఉద్దేశపూర్వకం గా ఫీజులు చెల్లించకుండా ఉండరు. వారికి ఆర్థిక, సాంకేతిక, పరిపాలనా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వారిపై శిక్షాత్మక నిబంధనలు విధించడంకంటే, వారికి అనుకూలమైన పరిపాలనా విధానాన్ని రూపొందించ డం ప్రభుత్వ బాధ్యత, గతంలో అమలులో ఉన్న విధంగా ప్రభుత్వం నేరుగా కళాశాలల ఖాతాలకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేస్తే పారదర్శకత, సౌలభ్యం రెండూ పెరుగుతాయి. అందువల్ల జీవో నెం.9లోని వివా దాస్పద నిబంధనలను ప్రభుత్వం పునఃసమీక్షించడం సము చితంగా ఉంటుంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అమల వుతున్న విధానాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరంఉంది. అక్కడ అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలులో దశలవారీ చెల్లింపుల విధానం కొనసాగుతోందని ప్రభుత్వం పేరొ ంటోంది. విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా, కళాశాలలకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా నిధులు విడుదల చేసే వ్యవస్థపై దృష్టి సారిస్తోంది. మంచి పరిపాలన అంటే ఇతర ప్రాంతాల్లో అమలవుతున్న సమర్థ వంతమైన విధానాలను అధ్యయనం చేసి ప్రజల ప్రయోజ నాల కోసం స్వీకరించడం. విద్యలో పెట్టుబడి పెట్టడం అంటే కేవలం వ్యక్తిగత అభివృద్ధికే కాదు, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడానికి దో హదపడటం.

-మన్నారం నాగరాజు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News education latest news Latest Telugu News learning Literacy Poverty poverty eradication Telugu News Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.