📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Education Abroad : విద్యార్థుల్లో విదేశీవిద్యపై తగ్గుతున్న మోజు

Author Icon By Sudha
Updated: July 9, 2026 • 5:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Education Abroad :కొన్ని శతాబ్దాల క్రితం వరకు కూడా భారత్ ప్రపంచ జ్ఞాన కేంద్రంగా గుర్తింపు పొందింది. వాణి జ్యం, ఆధ్యాత్మికత, గణితం, తత్వ శాస్త్రం వంటి రంగాలలో దీని చారి త్రక ప్రభావం బాగా విస్తరించడంతో ప్రపంచవ్యాప్తంగా పండితులు ఇక్కడి ప్రాచీన విద్యా కేంద్రాలకు ఆకర్షితుల య్యారు. ఐరోపాలో ఆధునిక విశ్వ విద్యాలయాలు స్థాపించబడటానికి చాలా ముందు, ప్రాచీన భారతదేశం ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా విలసిల్లడంతో వేలాది మంది విదేశీయులు భారత ఉపఖండంలో చదువుకోవడానికి వచ్చే వారు. ప్రత్యేకించి తత్వశాస్త్రం, వైద్యం, ఖగోళ శాస్త్రాలను నేర్చుకోవడానికి పండితులు ప్రమాదకరమైన భూ, సముద్ర మార్గాల గుండా ఇక్కడికి వచ్చేవారు. మారిన కాలమాన పరిస్థితుల కారణంగా 1990ల చివరి నుండి 2010ల మధ్య వరకు భారతదేశం నుండి మేధో వలసలు (బ్రెయిన్ డ్రైన్) అధికమయ్యాయి. స్వదేశంలో అవకాశాల లేమితో భారీ సంఖ్యలో ఇంజనీర్లు, వైద్యులు, ఐటీ నిపుణులు విదే శాలకు తరలివెళ్లారు. అమెరికాలో సరళీకృత హెచ్ 1బి వీసా విధానాలు, ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగం విస్తరించడం ఈ వలసలకు ప్రధాన కారణం. అయితే ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా భారతదేశాన్ని మరోసారి తిరిగివిశ్వగురువు స్థానం లో నిలబెట్టాలన్న క తనిశ్చయంతో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశాల్లో ఉన్న అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు, వృత్తి నిపుణులను తిరిగి భారతదేశానికి రప్పిం చేందుకు ప్రత్యేక కృషి చేస్తోంది.

Read Also : CSIR-UGC NET 2026: సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

Education Abroad

Education Abroad : మౌలిక సదుపాయాల కొరత

భారతదేశం నుండి మేధో వలస 1960, 1970వ దశాబ్దాలలో బాగా ఊపందుకుంది. మొదట్లో స్వల్ప సంఖ్యలో శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజి నీర్లతో మొదలైన వలసలు, తరువాత ప్రపంచవ్యాప్తంగా అత్యంత నైపుణ్యంగల శ్రామికులకు డిమాండ్ పెరగడంతో మరింత వేగవంతమైంది. ఈ సామూహిక వలసలకు కారణాలు విదేశీ అవకాశాలు ప్రధానంగా దోహదమయ్యా యి. 1960 నుండి 1980 దశకాలలో భారతదేశంలో జటి లమైన లైసెన్స్ విధానాలు, నియంత్రణతో పాటు పెట్టుబడి దారుల అనుకూల విధానాలు లేకపోవడంతో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో, పరిమిత దేశీయ ఉద్యోగావకాశాలు ఉండేవి. ఆ సమయంలో మౌలిక సదుపాయాల కొరత కూడా ఉండేది. పరిశోధన, అభివృద్ధి కోసం తక్కువ బడ్జెట్ కేటాయింపులు, అగ్రశ్రేణి సౌకర్యాల కొరత స్వదేశానికి తిరిగిరా వాలనుకునే పారిశ్రామికవేత్తలను, శాస్త్రవేత్తలను తీవ్రంగా నిరాశపరిచింది. అదే సమయంలో సబ్సిడీ విద్యలో అసమతుల్యత కారణంగా ఐఐటీలు, ఎయిమ్స్ వంటి అత్యంత పోటీతత్వ సంస్థలు ప్రపంచ స్థాయి నిపుణులను తయారు చేసినప్పటికీ, వారి సేవలను దేశీయంగా వినియోగించుకోవడంలో మాత్రంచతికిలబడ్డాయి. స హజంగానే నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులు మెరుగైన జీతం, విలాసవంతమైన జీవనశైలి కోసం అభివృద్ధి చెందిన దేశాలు, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్కింగ్డమ్ కెనడాకు వలసపోయారు. అంతేకాకుండా, పాశ్చాత్య దేశాలలోని అనుకూలమైన వలస చట్టాలు, దేశీయ కొరతను పూరించడానికి విద్యావంతులైన, ఆంగ్లం మాట్లాడడంతో పాటు కష్టపడేతత్తం గల భారతీయ నిపుణులకు అవకాశాలు మెండుగా ఉండడం, కూడా వలసలను బాగా ప్రోత్సహించా యి.

అధిక వేతనాలకు అవకాశం

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రయాణాలు, అనాదిగా కొనసాగుతున్న మేధో వలస ధోరణికి చక్కటి ఉదాహరణలు, భారతీయ నిపుణులు ప్రపంచ ప్రతిభా రంగంలో ఆధిపత్యం చెలాయిస్తూ కీలక ఆర్ధిక వ్యవస్థలలో స్థానిక ఉద్యోగుల కంటే అధిక మధ్యస్థ జీతాలను పొందుతున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ రంగాలలో భారీ ప్రతిభ కొరత కారణంగా, ప్రపంచం ప్రధాన కేంద్రాలలో భారతీయ నైపుణ్యంపై ఎక్కువగా ఆధారపడుతోంది. అమెరికాలో అధిక వేతనాలకు అవకాశంగల స్టె మ్, కార్పొ రేట్ ఉద్యోగాలలో భారతీయులు ఆధిపత్యం చెలాయిస్తూ అమెరికా పౌరులకంటే 10 వేలు అధికంగా సగటున లక్షా నలభై వేల డాలర్లు సంపాదిస్తున్నారు. టెక్, సెమీకండక్టర్లు, ఏఐ రంగాలలో భారతీయులు విశేషంగా రాణిస్తున్నారు. యునైటెడ్ కింగ్డమ్లో కూడా భారతదేశానికి చెందిన స్కిల్డ్ వర్కర్ వీసా హోల్డర్లు స్థానికుల కంటే గణనీయంగా యేడా దికి సగటున 96,000 పౌండ్లు సంపాదిస్తున్నారు. జర్మనీ లో ఆపర్చునిటీ కార్డ్ (ఛాన్సెన్ కార్టే) వంటి కార్యక్రమాల ద్వారా భారీగా ప్రయోజనం పొందుతూ, భారతీయులు ఆటోమోటివ్ , మెకానికల్ ఇంజినీరింగ్తో పాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో కీలకంగా రాణిస్తున్నారు. పన్ను రహిత సంపాదన సామీప్యత కారణంగా యుఏఇలో భారతీయులు ఫైనాన్స్, టెలికమ్యూనికేషన్స్, క్లౌడ్ టెక్నాలజీ న్ రంగాలలో రాణిస్తున్నారు. కెనడా, ఆస్ట్రేలియాలో నిరం తరం కొరత ఉండే హెల్త్కేర్, ఐటి రంగాలలో భారతీయులు పాయింట్ల ఆధారిత ఎక్స్ ప్రెస్ ఎంట్రీ,స్కిల్డ్ పిఆర్ కార్యక్రమాల ద్వారా వలసపోతున్నారు.

Education Abroad

కఠినమైన వీసా నిబంధనలు

భారతదేశాన్ని దీర్ఘకాలంగా పీడిస్తున్న ఈ మేధో వలసను అరికట్టడంతో పాటు దానిని దేశాభివృద్ధికి దోహదపడే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోంది. ప్రపంచంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, ప్రయోగశాలలు, పరిశోధనా సంస్థలలో సేవలందిస్తున్న భారతీయ సంతతికి చెందిన ప్రతిభావంతులైన పరిశోధకులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులువృత్తి నిపుణులను, భారతదేశంలోని కీలకప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, జాతీయ ప్రయోగశాలలుపరిశోధనా కేంద్రాలతో కలిసి పరిశోధనలు చేయడానికి ఆహ్వానిస్తోంది. ఈ ప్రత్యేక చొరవకింద, విద్యా మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి పరిశోధన పీఠం పథకం 2026″ (ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ చైర్ స్కీం 2026) కోసం 13 ప్రాధాన్యతా రంగాల ను గుర్తించి దరఖాస్తులను ఆహ్వానించింది. 2026-27 నుండి 2030-31 వరకు 5సంవత్సరాల పాటు రూపొం దించబడిన ఈ కార్యక్రమానికి రూ.200 కోట్ల బడ్జెట్ కేటా యించ బడింది. ఫెలోషిప్లు, పరిశోధన గ్రాంట్లు, పునరావాస ఖర్చులుసంస్థాగత నిర్వహణ ఖర్చులను భరించడానికి ఈ ప్యాకేజీలు మూడు శ్రేణుల వర్గాలుగా రూపొందించబడ్డాయి. యంగ్ రీసెర్చ్ ఫెలోస్ రూ.4 కోట్ల వరకు, సీనియర్ రీసెర్చ్ ఫెలోస్ రూ.6.50 కోట్ల వరకు, రీసెర్చ్ చైర్స్ రూ.14 కోట్ల వరకు పొందవచ్చు. స్వదేశానికి తిరిగివచ్చే నిపుణులకుఇక్కడ జీతభత్యాలు, పరిశోధనా మౌలిక సదుపాయాలు, పని చేసే స్వేచ్ఛ వంటివి ఏమి లభిస్తున్నా యనేది కీలకంగా మారనుంది. ప్రపంచ శాస్త్రీయ ప్రతిభకు భారతదేశం ఎంత ఆకర్షణీ యమైన గమ్యస్థానంగా మారుతుందో ఈ అంశాలు నిర్ణయి స్తాయి. విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య అధి కంగా ఉ న్నప్పటికీ, కఠినమైన వీసా నిబంధనలు, అధిక ఖర్చుల కారణంగా కోవిడ్ 19 తరువాత విదేశాలకు వెళ్లేవారి సంఖ్య తగ్గిందని ఇటీవలి గణాంకాలునూచిస్తున్నాయి. ప్రభు త్వ గణాంకాల ప్రకారం, గత రెండేళ్లలో విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులసంఖ్య 31శాతం తగ్గింది. 2023లో 9.08 లక్షలుగా ఉన్న ఈసంఖ్య 2025 నాటికి 6.26 లక్షలకు పడిపోయింది. కెనడా, ఆస్ట్రేలియా, యూకే, అమెరికా లో కఠినమైన వీసా నిబంధనలు, పెరుగుతున్న ఖర్చులే ఈ తగ్గుదలకు కారణం. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆర్థిక సవాళ్లు, ఏఐ కారణంగా ఏర్పడుతున్న ఉద్యోగాల అని శ్చితి, వలస వ్యతిరేక ఉద్యమాలు మేధో వలసల తిరోగమ నానికి ఉత్ప్రేరకంగా మారే అవకాశం లేకపోలేదు.


-యేచన్ చంద్రశేఖర్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BreakingNews Education Abroad international education latest news Latest Telugu News Overseas Education students Study Abroad Telugu News Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.