📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Cultivation requirements : సాగుకు జవసత్వాలు!

Author Icon By Sudha
Updated: May 13, 2026 • 4:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Cultivation requirements : ఒక దశాబ్ద కాలంగా దేశవ్యాప్తంగా సాగు గాడి తప్పిం దన్న విస్తృత విశ్లేషణలు విశేషంగా వినపడుతున్నా యి. వరి సాగుకు ప్రత్యామ్నాయంగా తృణధాన్యాలు, ఉద్యాన పంటలు రైతు ఆదాయాన్ని పెంచుతాయనే అంచనాలున్నాయి. కానీ ఇప్పుడు వాటి విస్తీర్ణం తగ్గు తోంది. దేశవ్యాప్తంగా ‘వరి’ సాగు పెద్ద ఆదాయ ‘సిరి’ కాదనే వాదనల మధ్య ఎంతో మంది రైతులు ఇతర పంటల వైపు మొగ్గుచూపారు. పంట సాగులో ఉత్పత్తుల నిల్వ, ప్రాసెసింగ్ వంటి అన్ని అంశాల్లో మానవేతర సాగు ద్వారానే పంట దిగుబడులు పెరిగి సాగు వ్యయాన్ని తగ్గించుకోవచ్చుననే హితవు వినబడుతుంది. అటు రైతులు ఇటు వ్యవసాయ శాస్త్రజ్ఞులు కూడా ఆధునిక సాగు యంత్రాలు పరికరాలు వాడకానికి ప్రోత్సహిస్తున్నారు. ఎవరెన్ని ప్రత్యామ్నాయాలు చూపినా వాటిని స్వీక రించడానికి రైతు సిద్ధంగానే ఉన్నాడు.

Read Also: Meghdoot App: వాతావరణ సమాచారం ఇప్పుడు మీ అరచేతిలో


Cultivation requirements

Cultivation requirements : ఎరువుల మోతాదులను నియంత్రించాలనే ఆలోచన

కాగా కొత్త ప్రత్యా మ్నాయ సాగులో రైతుకు విశేషమయిన ఆర్థిక లబ్ధి పొంద గలరనన్న నమ్మకం చికితేతప్ప కొత్త ఆలోచనల వైపు మొగ్గు చూపలేదు. కొద్ది కాలం క్రితం ‘చేనుకు చేవ – రైతుకు రొఖం’ అనే నినాదం కింద అధిక ఎరువులతో అధిక సాగుబడి అనే ధోరణితో రైతులు అహర్నిశలూ శ్రమపడి వ్యవసాయ క్షేత్రాలను పటిష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సాగు వ్యయకర్తనం, పంటల మార్పిడి, అధిక ఎరువుల నుండి పంటల నియంత్రణ అనే అంశాలమీద ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఈ అంశాల ప్రాతిపది కగా విస్తృతస్థాయిలో ప్రచారం చేపట్టింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం రసాయనిక ఎరువుల ధరల పెంపు, లభ్యతలో సంక్లిష్ట సమస్యలు తలెత్తి ఏకంగా ఎరువుల మోతాదులను నియంత్రించాలనే ఆలోచన పుట్టింది. ఎక్కడో సౌదీ అరేబియా నుంచి రావాల్సిన యూరియా వంటి ఎరువులు భారత్కు చేరుకోకపోవడం పెద్ద సమ స్యగా ఏర్పడింది. అయినా ఆయా ఎరువుల్ని రైతుకందిం చడంలో ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. అంతే తప్ప ధరలు పెంచలేదు.

‘వరి’కి బదులు ప్రత్యామ్నాయ పంటల

అదేవిషయాన్ని నరేంద్రమోడీ ప్రజల ముందు ఏకరువు పెట్టి ఎరువుల వాడకం క్రమేపీ తగ్గించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకతను చెప్తూ వచ్చారు. సాంప్రదాయ సాగులో అత్యధిక దిగుబడుల కోసంచేసిన ప్రయత్నమే రైతులోకంలో అలజడి సృష్టిం చింది. సమస్య రైతు దురదృష్టానిదా? పంట నాణ్యత, సాగు నిర్వహణ యాజమాన్యంలో లోపాలా? అన్నది విశ్లేషించుకుంటే ‘కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు’ అన్నట్లు అన్నీ రైతునెత్తిన పిడుగు పడేట్లు చేశాయి. రైతు వ్యవసాయం పట్ల ఆసక్తి కోల్పోయే పరిస్థితులు తలెత్తా యి. ఐదారేళ్ల క్రితం ‘కోవిడ్’ తర్వాత ఇంతవరకు జరిగిన సాగు అధ్యాయాలను తెరచి చూసుకుంటే రైతు ఆత్మ హత్యలు కూడా వ్యవసాయాన్ని కృంగ దీసే పరిస్థితులు తెచ్చిపెట్టాయి. ప్రధానిగా నరేంద్రమోడీ ఎరువులపై సాగు ఖర్చు నియంత్రణ కోరుకుంటే రైతులు ప్రధానంగా పంట మార్పిడిచేసి భూసారాన్ని పెంచుకోవాలని తెలం గాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ పట్టుపడ్తోంది. కారణమే దైనా తెలంగాణలో రైతు ఆత్మహత్యలు బాగా పెరిగిపోయాయన్న వాస్తవాల్ని కాదనలేం. సాగు విస్తీర్ణం గణనీ యంగా పెరుగుతుంటే పంటల మార్పిడి ద్వారానే దిగు బడులు పెరుగుతాయని అందుకే పదిశాతం విస్తీర్ణంలో దైనా ‘వరి’కి బదులు ప్రత్యామ్నాయ పంటల ఆవశ్యకత ఉంది. వారిని ఆరుతడి పంటలనూ ప్రత్యామ్నాయంగా సాగు చేయడం అవసరమని తెలంగాణ రాష్ట్రవ్యవసాయ కమిషన్ ఇటీవలతన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. నీరు సమృద్ధిగా అవసరమైన ‘వరి’ సాగును ఒకసారికే పరిమితం చేయడం అవసరమని ప్రభుత్వానికిచ్చిన నివే దికలో పేర్కొంది. ఈనివేదిక రాష్ట్రంలో అమలు చేయగల వ్యవసాయ విధానాన్ని రూపొందించేందుకు మార్గదర్శకం కావచ్చు.


Cultivation requirements

దళారీ వ్యవస్థ అత్యంత ప్రమాదకరం

రాష్ట్రంలోయేటా ‘వరి’సాగు విస్తీర్ణం పెరుగు తోంది. ఉద్యాన పంటలు సాగు బాగా తగ్గిపోతోంది. కూరగాయల పెంపకానికి కూడా ఓ మోస్తరు రైతులు ఇష్టపడ డం లేదు. ఈరీత్యా వాతావరణ జోన్ల ఆధారంగా పంటల ప్రణాళికను రూపొందించి పంట మార్పిడికి నిర్దిష్టలక్ష్యాలను, ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కమిషన్ సూచి స్తోంది. సుస్థిర వ్యవసాయం, సాగు వ్యయ ఆదాయ, సహజవనరుల సంరక్షణవంటి అంశాలను ఆహార భద్రత కు తోడ్పడాలని నివేదికలో పేర్కొంది. ప్రొసెసింగ్ యూని ట్లు, ప్యాక్ హౌస్లు, కోల్డరేజీల నిర్మాణం తక్షణమే ఏర్పాటు చేయాలి. అపరాలు, చిరుధాన్యాలు, నూనెగిం జల ఉత్పత్తులకు మద్దతు ధర నిర్ణయించే వ్యవస్థను రూపొందించాలి. కేరళ, మహారాష్ట్ర ప్రాంతాలలో ఉన్నట్లు కూరగాయల క్లస్టర్, ఎన్పిసి ఏర్పాటు అవసరం. మార్కె ట్లలో దళారీ వ్యవస్థ అత్యంత ప్రమాదకరంగా రైతు ప్రయోజనాలను దెబ్బకొడ్తోందన్న నిశ్చితాభిప్రాయానికి కమిషన్ వచ్చింది. ఇది నిజమేకాకుండా రైతుకోణంలో చూస్తే వ్యయ ప్రయా సలకోర్చి పంట పండించినా తీరా ఉత్పత్తుల విక్రయం సమయంలో దళారుల జోక్యంధరలు నిర్ణయంలో గిట్టు బాటుధర లేకుండా చూసి బోల్తాకొట్టి స్తారు. అందుకే పంట ఉత్పత్తుల విషయంలో దళారీ వ్యవస్థ ఉండరాదు. పంటల విక్రయంలోనూ వారిపాత్రను కుదించాలని కమిషన్అభిప్రాయపడింది. రైతు ప్రయోజ నాలు కాపాడే విషయంలో కమిషన్ నివేదికలోని అన్ని అంశాలపైనా రైతుపరంగా చర్చించడానికి అసెంబ్లీ సిద్దం గా ఉంది. ఒకే రకమైన పంటల సాగుతో నేలసారం దెబ్బతింటుంది కనుక తప్పనిసరిగా పంటల మార్పిడికి తెలంగాణ సిద్ధపడాల్సిన అగత్యం ఏర్పడుతోంది. కాస్త ఆలస్యమైనా రైతు కమిషన్ సమగ్ర కార్యాచరణ ప్రణాళి కతో నివేదికను సిద్ధం చేసినందున అసెంబ్లీలో చర్చించి తెలంగాణ సాగును బలోపేతం చేయడం అవసరమే.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

agriculture Breaking News cultivation cultivation requirements farming farming essentials latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.