📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

corruption : అవినీతే అసలు సమస్య!

Author Icon By Sudha
Updated: July 25, 2026 • 3:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

corruption : ధర్మాధర్మాలు తెలియవని కాదు, మొదటి ఒంటబట్ట డం లేదు, రెండోది వదిలిపెట్టడం లేదు అన్నట్లుగా ఉంది అవినీతి విషయంలో కొందరు పెద్దలు వ్యవహరి స్తున్న తీరు. ఏ కోణంలో చూసినా అవినీతికిపాల్పడడం ధర్మకాదని అందరికి తెలిసిందే. పైగా అది చట్టబద్ధనేరం కూడా. కానీ దేశంలో అవినీతికి పాల్పడేవారి సంఖ్య కోట్ల ల్లో ఉంది. అవినీతి నిర్మూలనకు దశాబ్దాల తరబడి ప్రయ త్నాలు జరుగుతున్నా ఏమాత్రం తగ్గడం లేదు. అంతకంతకు పెరిగి పోతున్నది. ముఖ్యంగా ఉన్నతస్థాయిలో జరు గుతున్న అవినీతికి అడ్డూఅదుపు లేకుండాపోతున్నది. కిందిస్థాయిలో అవినీతిని అరికట్టే ముందు ఉ న్నతస్థాయి లో ముఖ్యంగా రాజకీయ అవినీతిని నియంత్రించే ప్రయత్నం చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో గతంలో ఒక వ్యూహం ప్రకారం ఏకంగా లంచం ఇచ్చి ఒకమంత్రి ని ఇంటికి పంపారు. అప్పట్లో అది రాజకీయసంచలనం రేపింది. ఈ డబ్బు సంపాదనలో మంచి, చెడు ఆలోచిం చడం లేదు. అందుకే ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాలు క్షేత్రస్థాయిలో పూర్తిగా అర్హులైన లబ్దిదారులకు అందడం లేదు.

Read Also : RBI CKYC 2.0: ఒకే ఒక్క ఓటీపీతో కేవైసీ పూర్తి.. ఆగస్టు నుంచి అమలు!

corruption

corruption : ప్రజా సొమ్మును భోంచేస్తున్నారు

ప్రాజెక్టుల నిర్మాణాల్లో వేలాది కోట్ల రూ పాయలు పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వాలు మారి కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కీలక బాధ్యత వహించినవారిపై విచా రణ జరిపించడం సర్వసాధారణమైపోయింది. వాటిల్లో కూడా సమర్థవంతంగా దర్యాప్తు జరిషి తిరుగులేని రుజు వులతో న్యాయస్థానాల ముందు దోషులను నిలబెట్టలేక పోతున్నారు. ఫలితంగా అన్ని పథకాల్లోనూ, కార్యక్రమా ల్లోనూ ప్రాజెక్టుల నిర్మాణాల్లోనూ అవినీతి చోటు చేసు కుంటున్నది. నిరుపేదలకు ఇచ్చే ఇళ్ల కేటాయింపుల్లోకానీ, వృద్ధాప్యపు పెన్షన్లు, సంక్షేమ కార్యక్రమాలు ఏవి తీసు కున్నా దేశవ్యాప్తంగా దళారులు ఈ అవినీతి అధికారుల తో చేతులు కలిపి ప్రజా సొమ్మును భోంచేస్తున్నారు. అవినీతిని అడ్డుకొని ప్రజాధనాన్ని కాపాడేందుకు ఏనాటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రస్థాయిలో అవినీతి నిరోధక శాఖ, కేంద్రస్థాయిలో సిబిఐతోపాటు ఇడి, నిఘా విభాగాలు మరెన్నో పనిచేస్తున్నాయి. ఎన్నో చట్టాలు చేశారు. జీతభత్యాల రూపేణా కోట్లాది రూపా యలు వెచ్చిస్తున్నారు. వేలాది మంది అధికారులను వల పన్ని పట్టుకుంటున్నారు. మరెందరినో ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినందుకు కేసులు నమోదు చేసి అరెస్టు చేసి జైళ్లకు పంపుతున్నారు. ఎంతమందిపై చర్యలు తీసుకున్నా అవినీతిని నియంత్రించలేకపోతు న్నారు.

ప్రజాసేవ ముసుగులో ..

అధికారుల్లో, ఉద్యోగుల్లో ఉన్న అవినీతి ఒక ఎత్తు అయితే కీలక పదవులు నిర్వహిస్తున్న కొందరు పెద్దలు, ప్రజాసేవ ముసుగులో చెలామణి అవుతున్న కొంత మంది రాజకీయ నాయకులు, దళారుల వల్లనే పరిస్థితి అదుపు తప్పిపోతున్నదేమోననిపిస్తున్నది. ‘వారి రాజకీయ అధికారం ధాటికి నిజాయితీ, సమర్థులైన అధికారులు సైతం నిస్సహాయంగా ఉండిపోతున్నారు. అవినీతి మూలంగా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండిఇప్పటివరకు ఎన్ని లక్షలకోట్ల రూపాయలు భారత్ కోల్పో యిందో అంచనాకే అందదు. అవినీతికి ఆరోప్రాణమైన కొందరు నేతలే చట్టానికి చుట్టాలై చక్రం తిప్పుతున్న సంఘటనలు గతంలో ఎన్నో బయటపడ్డాయి. పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి ఒకరు ఉపాధ్యాయుల నియామక కుంభకోణంలో కోట్ల రూ పాయలు దిగమింగి తన ఆప్త మిత్రురాలి ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టిన వైనాన్ని గతంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రట్టు చేసిం ది. కర్ణాటకలో బాధ్యత కలిగిన మంత్రి తన చావుకు కారణమని ఆ మధ్య ఒక యువ కాంట్రాక్టరు ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో తప్పని పరిస్థితుల్లో ఆ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. సబ్బుల తయారీలో ముడిసరుకుల టెండర్ ఆమోదముద్ర పొందడానికి లంచం ముట్టచెప్పాల్సిందేనని కాంట్రాక్టరుగా ఆ ప్రాంతపు ప్రజా ప్రతినిధి తన కుమారుడికి అప్పగించడంతో ఏకంగానలభై లక్షల రూపాయలు తీసుకుంటూ లోకాయుక్త పోలీసులకు చిక్కుకున్నారు. అంతేకాదు సాక్ష్యాత్తు హైకోర్టు న్యాయ మూర్తి ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో లక్షలాది రూపా యల నోట్లకట్టలు బయటపడ్డాయి.

corruption

అవినీతి’ శృతిమించి పోతున్నది

రాజ్యాంగంకల్పించిన రక్షణ వల్ల ఆయనపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేని పరిస్థితి. దీంతో ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు ఎందుకోసం ఇచ్చారో అనే ప్రశ్నలకు జవాబు దొరకలేదు. అయితే చివరకు ఆయన ఆ పదవి నుంచి వైదొలగాల్సివచ్చింది. ఒడిశాలో సబ్కలెక్టర్గా పని చేస్తున్న ఒక ఐఎఎస్ అధికారి పదిలక్షల లంచం తీసు కుంటూ పట్టుబడ్డాడు. ఆయన ఇంట్లో సోదాలు చేస్తే నలభై లక్షలకుపైగా నగదును అధికారులు కనుగొన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎసిబి దాడుల్లో వందలాది కోట్ల రూపాయల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులను కనుగొంటున్నారు. అరెస్టులు చేస్తు న్నారు. జైళ్లకు పంపుతున్నారు. అయినా ఈ అవినీతి ఆగడం లేదు. ఎంతో మంది ఉన్నతాధికారులపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసి చర్యలకు సిద్ధ మైనా అనుమతి లేక ఆగిపోయిన సంఘటనలు కోకొల్లలు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ కమిషన్ రాంచంద్ర సమాల్ బయటపెట్టిన విషయాలు అద్దంపడుతున్నాయి. ఇవన్నీ మూడోకంటికి తెలియకుండా జరుగుతున్న అవి నీతి సంఘటనలు. వాటిని కూడా పసిగట్టి పరిశోధించి బయటపెట్టగలుగుతున్నారు. బహాటంగా నిర్లజ్జగాజరుగు తున్న అవినీతిని పసిగట్టకపోవడం అనే ప్రశ్న ఉదయిం చదు. ఏదిఏమైనా అవినీతి’ శృతిమించి పోతున్నది. ఉన్నత స్థాయిలో ప్రధానంగా రాజకీయ అవినీతి అరికట్టకుండా దేశం నుండి దాన్ని పారద్రోలడం అంత సులభం కాదు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anti-Corruption Breaking News Corruption Governance latest news Latest Telugu News Politics Telugu News Transparency Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.