📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ceasefire : చిక్కుముడులు వీడినట్లేనా?

Author Icon By Sudha
Updated: June 17, 2026 • 3:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ceasefire : ఇ ల్లలకగానే కాదు ముందుంది ముసళ్ల పండుగ అన్న చందాన పశ్చిమాసియాలో శాంతి వీచికలకు ఇంకా టైం పట్టేట్టుంది. అయితే శాంతి ప్రక్రియ మొదలైంది కనుక కనుచూపు మేరలో యుద్ధానంతర ప్రభావాలు ఒక్కటొక్కటీ కనుమరుగై యుద్ధ విరమణ పర్యవసానా లు వెలుగులోకి వస్తాయని ఆశపడ్తుంటారు. యుద్ధ వీర మణకు సానుకూల ఒప్పందం తుదిరూపు దిద్దుకుందన గానే భారతీయుల్లోనే కాదు యుద్ధ ప్రభావిత దేశాల్లో కూడా ఎంతో సంతోషం వ్యక్తమైంది. హర్మూజలసంధి మార్గంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సాఫీగా జరిగితే బావుంటుందనే ఆలోచన మదిలో మొలకెత్తుతుంది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 4.7 శాతం తగ్గి 84 డాలర్లకు దిగువకు చేరింది. యుద్ధ నేపథ్యంలో కూడా యిల్ ధర 125 డాలర్లకు తాకడమే చెప్పుకోదగిన విపరిణామం. యుఎఇ, ఖతార్, కువైట్, బహ్రెయిన్ సౌదీ అరేబియా దేశాలపై ఇరాన్ దాడులకు తెగబడ డంతో ముడి చమురు, సహజవాయులు తయారీ, సరఫరాకు ఆటంక మేర్పడింది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి తెరుచుకుం టోందంటేనే ప్రభావిత దేశాలు సంబరపడ్డాయి.

Read Also : Strait Of Hormuz : ‘హర్మూజ్ జలసంధి’ మాదే – సార్వభౌమాధికారంపై ఇరాన్ సంచలన ప్రకటన

Ceasefire

Ceasefire: మార్కెట్ల మాయాజలం నుంచి బయట పడడం

అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన ఒప్పందానికీ తమకూ సంబంధం లేదంటూ లెబనాన్పై ఇజ్రాయిల్ విరుచుకుపడట మొక్కటే ఈ ఒప్పందం ఎంతవరకు అమలులోకి వస్తుం దన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినా స్వయం గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన భరోసాతో ఒప్పం దాలు సంతకాల వరకు వచ్చాయి. చమురు ధరలు దిగి రావడంతో మదుపరుల్లో కాస్తంత ఊరట కలిగింది. పశ్చి మాసియా ఉద్రిక్తతలకు ముందు బ్యారెల్ ముడిచమురు ధర 70 డాలర్ల వద్ద ఉండేది. మల్లీ ఆ రేటును చేరు కుంటే తప్ప మార్కెట్ల మాయాజలం నుంచి బయట పడడం. అలా జరిగినా రిటైల్ ధరలు తక్షణమే అదు పులోకి వస్తాయని కానీ, అనేక కారణాల చేత ప్రభావితమైన ధరలన్నీ ఆగమేఘాల మీద తగ్గిపోయే పరిస్థితి ఉంటుందని కానీ చెప్పలేం. యుద్ధం వెంబడి నిత్యా వసర వస్తువులు ఆకస్మికంగా కొండెక్కాసాయి. అలా అని యుద్ధ విరమణ తర్వాత అంతే స్పీడ్లో ధరలు తగ్గించే యంత్రాంగమేదీ లేదు. అంతే వేగంగా పనిచేసే పరిస్థితి ఏర్పడదు. ఇంకా ధరలు పెరిగినా పాత స్టాక్లున్నాయి కనుక మరి కొన్నాళ్లు ధరలు తగ్గించలేరు. మరికొంత కాలం వినియోగదారుని నెత్తిన ధరల భారం తప్పదు. ఈలోగా ఈనాటి శాంతి ఒప్పందం నరపపంచ ఇంధన మార్కెట్లకు శుభ పరిణామమే కావచ్చు కాని సామాన్య వినియోగదారునికి మాత్రం తీవ్ర మనోవేదనే. ఈ ఒప్పందాలన్నీ సజావుగా అమల్లోకి వచ్చినా హర్మూజ్ జలసంధి తెరచుకోవడమే కాదు. అక్కడ జలాల్లో దాచిన మందుపాతరలు (సీమైన్స్ ) తొలగించడం, డ్రోన్ భద్రత లను ఉపసంహరించుకుంటే తప్ప, అక్కడే ఆగి ఉన్న 500 నౌకలు జలసంధి మార్గం నుంచి తమ సొంతదేశ సముద్ర జలాల్లోకి మరలవు. దానికీ దీర్ఘకాలమే పట్టొ చ్చు.

అణ్వాయుధీకరణపై ఇంకా అనిశ్చితి

గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న ఆ వాణిజ్య నౌక లన్నీ ఆయా దేశాలకు ‘చేరిపోతే తప్ప’ అలజడి తగ్గదు. భారత్ తన చమురు అవసరాలకు గల్ఫ్ దేశాల మీదనే ఆధారం. హర్మూజ్ తెరవగానే మరో మూడు నెలలకైనా చమురు తగ్గినా పాత ధరల అమల్లో ఉంటాయి. క్రమేపీ రవాణా ఖర్చులు తగ్గుతాయి. దానిపై ఎంతో కొంత ధరల తగ్గింపు ఉంటుంది. సామాన్యుడి వంటింటి ఖర్చు తగ్గుతుంది. చమురు విరివిగా, చౌకగా దొరికే అవకాశ ముంటే రవాణా ఖర్చులు ఆదా అవుతాయి. అదే జరిగితే ‘కిచెన్బడ్జెట్ తేలికవుతుంది. ఇంధన ధరలపై ప్రతికూల ప్రభావం కూడా తగ్గుతుంది. మొత్తానికి దిగుమతుల వ్యయం తగ్గడం వినియోగదారునికి ఊరటే. ఇరాన్ అణ్వాయుధీకరణపై ఇంకా అనిశ్చితి ఉండనే ఉంది. ప్రతిష్టంభనలో ఉన్న ఇరాన్ నిధులను అమెరికా డీఫ్రీజ్ చేయడం కూడా ముఖ్యమే. అసలు సిసలు ‘పీఠముడి’ ఈ రెండు అంశాలపైన ఉంది. ఈవ్యవహారంలో ఒప్పం దం నాటి షరతుల మేరకు సజావుగా సాగితేనే పరిష్కా రాలు ఫలవంతమౌతాయి. శాంతి వచనాలు వినేందుకు 19న స్విట్జర్లాండ్లోని జెనీవా అధికారిక కార్యక్రమంలోనే బయటపడతాయి. దాదాపు నాలుగు నెలల పశ్చిమా సియా కల్లోలానికి అంతిమఘడియలు సమీపించాయి. కానీ అన్నిదేశాలు, అన్నిషరతులు పాటింపువంటిఅంశాలు కొలిక్కి వచ్చేసరికి మరికొన్ని నెలలు పట్టొచ్చు.

Ceasefire

ప్రపంచానికే శుభపరిణామం

తాజా అవగాహన అమలు జరిగితే పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాల పునరుద్ధరణ, నౌకాయాన, స్వేచ్ఛా వాణిజ’్య నికి అవకాశమేర్పడ్తుందని భారత్ తరపున ప్రధాని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుత పరిష్కారం ద్వారా ఓ కీలకమైన అడుగుపడటం పట్ల ఐక్యరాజ్యసమి తి జనరల్సె\క్రటరీ గుటెరస్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రాంతీయ స్థిరత్వానికి ప్రస్తుత శాంతి ఒప్పందం దోహదపడగలదని భావిస్తున్నట్లు యూరోపియన్ కమిషన్అధ్యక్షురాలు ఉరులాఅభిభాషణ. ప్రస్తుతం ఒప్పందవిశేషాలకు వర్చువల్ సంతకాల ద్వారా ఆమోద ముద్ర పడింది. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఒమన్ దేశాలకున్న సార్వభౌమాధికారం విషయంలో అమెరికా స్పష్టతనివ్వడంలో ఇరాన్ కాస్త మెతకబడినట్లు ఉంది. ఒప్పందంపై డిజిటల్ సంతకాలు చేసినమరునాడు చమురుతో ఆయా దేశాల నౌకలు కదలికలు ప్రారంభమ య్యాయి. ఆది నుంచి అంతంవరకు శషభిషలు లేకుండా, ఒప్పందాలను చిక్కుముడులు పడకుండా అమలు చేయ గలిగితే ప్రపంచానికే శుభపరిణామం కాగలదు.

Read hindi news : hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News Ceasefire conflict resolution Diplomacy International Relations latest news Latest Telugu News Peace Talks Telugu News Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.