📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Artificial intelligence : ఎఐ మనిషి మేధోవికాస సాధనం కావాలి

Author Icon By Sudha
Updated: June 30, 2026 • 4:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Artificial intelligence : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మనిషి మేథస్సును ప్రశ్నించే స్థితిలో వుందని ఆధునిక ఆలోచనా పరులు జోస్యం చెబుతున్నారు. ఆధునికత, కంప్యూటర్ విజ్ఞానం, మార్పుల జోన్యం, అన్నీ ప్రపంచం లోని మానవాళికి తెలియజెప్పింది మనిషి మేధస్సే! భస్మాసురుడికి వరమిచ్చిన దేవుడినే భస్మం చేయా లని ప్రయత్నించటం ఇతర దేశస్థు లకు తెలియకపోయినా విజ్ఞాన వీచి కలను దిశ దిశలా వ్యాపింపచేసిన భారతీయులకు ఈ ఇతి హాసం ఏమిటో తెలుసుకదా! అలాగే ఎ.ఐని ఏవిధంగా వినియోగించుకోవాల్నో మన పండితులకు విజ్ఞానులకు తెలిసిన మాదిరి, ప్రపంచంలోని అందరికీ తెలుసనే భావిం చాలి! కంప్యూటర్ యుగంలో మన ప్రమేయం లేకుండా అన్నీ కంప్యూటర్ ద్వారా మేమే సృష్టించాం అని చెప్పు కుంటే తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ మనం సృష్టిం చిన మన ఎ.ఐ మననే మ్రింగే పరిస్థితి రాకూడదు. అణు బాంబును కనుక్కోవటంతో పాటు అణుశాస్త్ర అధ్యయనం వల్ల మానవాళికి శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానం లభించిం ది! లాభాల వినియోగం వల్ల కేవలం విధ్వంసమే కాదు ప్రజలకు మేలు చేకూర్చే విధంగా అణుశాస్త్ర పరిజ్ఞానాన్ని వినియోగించుకోవచ్చు అని తెలిసొచ్చింది!

Read Also : National Ambulance Service 2026: ‘జాతీయ అంబులెన్స్ సేవ–2026’ మార్గదర్శకాలు విడుదల!

Artificial intelligence

Artificial intelligence : ప్రపంచ వినాశనానికే ..

ఆర్టిఫిష యల్ ఇంటలిజెన్సు వల్ల పర్యావరణ మార్పులూ, స్థిరత్వం, అంచ నాలతో పాటు వాతావరణాన్ని ముందుగానే పసిగట్టి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే మానవాళి నిజమైన, స్వ భావ స్వరూపాలను హరించివేసే విధంగా ఎ.ఐను వాడుకో టానికి ఎవరైనా సాహసిస్తే, ప్రపంచ భవిష్యత్తు అంధకార మవుతుంది అన్న భయం శాస్త్రజ్ఞులు, సాంకేతిక విషయాల పండితుల చర్చల వల్ల కలుగుతున్నది. కొంతమంది ఎ.ఐ ప్రొగ్రెస్కు కొంతకాలం ఆటవిడుపు ఇచ్చి తదుపరి పరిశోధ నలు వాయిదా వేస్తే బావుంటుందని కూడా భావిస్తున్నారు! కానీ అలా సలహాలు ఇవ్వటానికి ఈ శాస్త్రజ్ఞులకు ఏవిధ మైన హక్కు వుంది? కొత్త విషయాలను కనిపెట్టే సత్తా, సంపదా వున్నప్పుడు ఏదో సాకు చెప్పి ‘ఎ.ఐ మొత్తం ప్రపంచ వినాశనానికే దారితీస్తుందని ఏ ఆధారంతో చెప్ప గలరు? ఇలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పి ఏవిధంగా ఎ.ఐ చెడు మార్గాలను అవలంభించకుండా వుండేందుకు మానవాళి ఎలాంటి చర్యలు తీసుకోవాలి!” అన్న ప్రశ్నకు జవాబుగా మొత్తం ప్రపంచంలోని దేశాలన్నిటినీ ఒక త్రాటి మీద నడిపించి, సమగ్ర అవగాహన తెచ్చుకొని ఒక విధంగా ఏకగ్రీవంగా ఆ ప్రపోసలను ఆమోదించినప్పుడే ఎ.ఐ నియం త్రణ ప్రపంచ వ్యాప్తంగా కొంతలో కొంతైనా సాధ్యపడే అవ కాశం వుంది! మానవ మేధస్సును ఈ సందర్భంగా తక్కు వచేసి మాట్లాడాల్సిన అవసరం లేదు!

మనిషి మేధస్సు వలన వచ్చిందే

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి కనుగొన్నదే! ఏ కొత్త విషయం ప్రపం చం ముందుకు వచ్చినా అది మనిషి మేధస్సు వలన వచ్చిందే అన్న ప్రాథమిక సూత్రాన్ని అంగీకరించినప్పుడు శాస్త్రజ్ఞులకు కంప్యూటర్ విజ్ఞులకూ, ఆధునిక సాంకేతిక నిపుణులకు తమ మీద అపనమ్మకం పోయి విశ్వాసం రెట్టింపు ఉత్సా హంతో సొంతమవుతుంది! కొత్త వ్యూహాలతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సు ఉపయోగిస్తే మానవ జాతి పురోగతికి సగటు వ్యక్తికి కావల్సిన సామాజిక, సాంకేతిక సదుపాయాల ఉత్పత్తికి క్షణాల్లో మార్గం ఏర్పడుతున్నది! ముఖ్యంగా మానసిక సామర్థ్యాలు, నైపుణ్యాలతో ఎ.ఐ మనిషికంటే బాగా సమస్యలను పరిష్కరించే సరియైన నైపుణ్యంతో ఉపయోగపడ్తుంది! ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విభాగాలకు మానవత్వం, నైతిక విలువలతో కూడిన విజన్ ను సమకూరుస్తేనే అనుకున్న రీతిలో ఫలితాలు రాబట్ట గలం. లేకపోతే మనిషి చేయిదాటిపోయి సామర్ధ్యాలతో కూడిన పనితనం విధ్వంస ధోరణిలో మనిషికి బదులు రాక్షసత్వం బయటకు వస్తుంది! టెర్రీ ఈగలన్ అనే శాస్త్రవేత్త ఎ. ఐని గురించి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసు కోవాల్సి వస్తుంది! ‘అమర్చిన కంప్యూటరైజ్డ్ ఇంటలిజెన్స్ తో మితిమీరిన విశ్వాసం మెషనరీలో కూర్చబడుతే వెనుకటి గ్రీక్స్ ఆకాశం వైపు చూస్తూ చేతులెత్తేసిన వైనం గుర్తుకు రాక తప్పదు. అందుకే మితిమీరిన విశ్వాసం ఎ.ఐ మీద వుంచుతే మొదటికే మోసం వస్తుంది!

ప్రకృత్తికి విరుద్ధంగా నడు చుకోగూడదు

సాంకేతిక నైపుణ్యం చట్టుబండలుగా మారుతుంది! ఒక స్పానిష్ ఫిలాసఫర్ ఎ.ఐ పనితనం సందర్భంగా ఒకటి చెప్పారు ‘ఇప్పటికే మనిషికి తనమీద తనకే అపరిమితమైన నమ్మకాన్ని తన తెలివితేటల మీద మితిమీరిన విశ్వాసాన్ని ఏర్పరుచుకొని, ఎ.ఐ నాచేతిలో కీలుబొమ్మ అంతే వుంటుంది అన్న అన వసరపు విశ్వాసంతో ఈ ఎ.ఐ నైపుణ్యాన్ని సాంకేతికంగా మరీ బలోపేతం చేస్తున్నాడు! దాంతో మరోదారి ఎ.ఐ పట్టి ఘోరమైన ఫలితాలు మానవాళి మూటకట్టుకొనే ప్రమాదం వుంది!’ పెక్కు దేశాల మత గురువులు ఎ.ఐ ను గురించి ప్రస్తావిస్తూ మనిషికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను రక్షించే అవసరం గూడా ఏర్పడవచ్చు! ఆ ఒక్క హెచ్చరిక చాలు ఎ.ఐ ప్రయోగాల వల్ల అనుకూల ఫలితాలు ప్రజల ప్రగతి కోసం ఉపయోగపడే రీతిలో ఏర్పరుచుకోగల్గాలి! అంతేగాని ఎ.ఐని కనిపెట్టిన విజ్ఞాన వేత్తలు తమ గొయ్యి తామే త్రవ్వుకొనే విధంగా ఎ. ఐని ఉపయోగించుకోకూడదు! సహజరీతిలో మనిషి వుండాలి! ప్రకృత్తికి విరుద్ధంగా నడు చుకోగూడదు! విశ్వామిత్ర సృష్టి వల్ల ప్రయోజనం వుండదని భారత పురాణ గాథలు ఇప్పటికే చెప్పాయి! ఎ.ఐ వల్ల కలిగే లాభాలు విభాగాల వారీగా సమీక్షించుకొని పరిమిత రీతిలో రాబట్టుకోవాలి!

Artificial intelligence

ఏ శాస్త్ర విజ్ఞానం మనం అతిగా వాడగూడదు

మనిషి సాధనలో, పనిలో మరో చేయిగా సహకరించే విధంగానే ఎ. ఐని శాస్త్రవేత్తలు తీర్చి దిద్దాలి! ఒకవేళ ఏ కారణం చేతనైనా ఎ.ఐ ప్రయోగాలు వికటిస్తే శాస్త్రవేత్తలు వెనక్కు తీసుకోవటానికి విరుగుడు సదుపాయాలు గూడా అమర్చుకోక తప్పదు! మానవీయ విలువలను, మనిషి గౌరవాన్ని దిగజార్చే ఏ శాస్త్ర విజ్ఞానం మనం అతిగా వాడగూడదు! ప్రపంచంలోని అన్ని దేశాల నాయకులు ఈసందర్భంగా ఒక నిర్ణయం ఏకగ్రీవంగా తీసు కోక తప్పదు ఎ.ఐ చుట్టూ తిరిగేందుకు మనిషి సిద్ధంగా ఉండనవసరం లేదు. మనిషి చెప్పినట్లు చేస్తూ మనిషిచుట్టూ తిరిగే ‘ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్’ మాత్రమే అవసరం! ఈ సందర్భంగా ప్రధాని మోడీ అన్నమాటలు ఎంతో విలువై నవి సముచితమైనవీ!పారిస్లో జూన్నెలలో జరిగినఇండియా ఎఐ ఇంపాక్ట్ సమావేశంలో మాట్లాడుతూ ‘బలమైన అమలు చేసే రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ అవసరం అంతేగాని ఎవరికి వారు తోచిన రీతిలో పద్ధతికి కట్టుబడకుండా ఎ. ఐని వాడే పరిస్థితి వుండగూడదు’ అన్న ప్రధాని సందేశంలో కర్తవ్య బోధన వుంది! తు.చ. తప్పకుండా ఆ సందేశాన్ని అనుస రించగలుగుతే ‘ఏ.ఐ’ మానవాళికి వరంగా మారుతుంది! మానవ మేధస్సుకు సహాయకారిగా భాసిల్లుతుంది!

-రావులపాటి సీతారాంరావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AI Artificial intelligence Breaking News human intelligence innovation latest news Latest Telugu News Technology Telugu News Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.