A helping hand : మానవుడు సాంకేతిక పరిజ్ఞానం ఎంత సంపాదించినా ఇతర రంగాల్లో మరెంత అభివృద్ధి సాధించినా ప్రకృతి ముందు తలవంచని పరిస్థితుల నుంచి బయటపడలేక పోతున్నాడు. తాజాగా ప్రజాజీవనంపై విరుచుకుపడిన అర్నబ్ తీవ్ర తుఫాన్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో బీభత్సమే సృష్టించింది. మొన్న మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఉభయ గోదా వరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలపై విరుచుకు పడి ఆ ప్రజలను చిగురుటాకులా వణికించింది. 130 కిలో మీటర్లకు పైగా వేగంతో వీచిన పెనుగాలులతో వేలాది వృక్షాలు నేలకొరగగా అంతకు రెట్టింపు స్థాయిలో విద్యుత్ స్తం భాలు పడిపోయాయి. అయితే ముందస్తుగా ఎపిలోని కూట మి ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ప్రాణనష్టాన్ని తగ్గించగలిగారు. ఇక తెలంగాణపై కూడా ఈ తుఫాన్ ప్రభా వంతో పగటి ఉ ష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. ఖమ్మం, సూర్యపేట తదితర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. మొత్తం మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు పది మంది ప్రాణాలతోపాటు వేలాది ఎకరాలలోని వంట లకు అపార నష్టం కలిగింది. వరి పంటేకాక అరటి తోటలు, మిర్చి, కూరగాయలు లాంటి మెట్టపంటలకు కూడా జరిగిన నష్టంతో అన్నదాతలు కుప్పకూలిపోయారు. పెట్టుబడులన్నీ పెట్టి నోటికందుతున్న దశలో నీటిపాలు కావడంతో రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉ న్నాయి.
Read Also : AP Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. నవంబర్ 2, 3 తేదీల్లో భారీ వర్షాలు
A helping hand : పాలకులపై విమర్శలు ఎక్కుపెట్టడం ఎంతవరకు సమంజసం
మోకాళ్లలోతు నీటిలో మునిగిన పంటలను కాపాడేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే ఆవేదన కలగకతప్పదు. అయితే అక్క డక్కడ ఏవో చిన్నచిన్న లోపాలు తప్ప ఈ అర్నబ్ తుఫాన్ భారినపడకుండా ప్రజలను కాపాడేందుకు నష్టాలను తగ్గిం చేందుకు పాలకులు శక్తికి మించిన కృషేచేశారని చెప్పొచ్చు. ముందస్తు ప్రణాళికతో ఎప్పటికప్పుడు సమీక్షలు, ఆదేశాల తో చర్యలు చేపట్టడంతో ప్రాణ, ఆస్తినష్టాలు తగ్గించగలి గారు. ఇలాంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు ఎవరు అధికారంలో ఉన్న బాధితులందరినీ అన్నిరకాలుగా ఆదుకో వడం అనేది మానవమాత్రులకు సాధ్యపడేపనికాదు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సర్వసాధారణమైపోయాయి. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శించడమే కర్తవ్యంగా భావించి ఆరో పణలు గుప్పించవచ్చు. అదే అధికారంలో ఉన్నాం గనుక ప్రభుత్వం చేసే అన్ని పనులు సమర్థించుకోవచ్చు. కానీ నిజానిజాలు ఏమిటో ప్రజలకు తెలియకుండాపోదు. అంతే కాదు ఎందుకోఏమోకానీ ఎలాంటి ఇబ్బందివచ్చినాప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించడం కొందరికి రివాజుగా మారి పోయింది. దోమ కుట్టినా, కుక్క కరిచినా, అరిచినా ప్రభు త్వాన్ని బాధ్యత చేస్తూ ఇష్టానుసారంగా విమర్శించడం అల వాటుగా మారిపోతున్నది. ఇలా ఏ చిన్న కష్టం అనిపించినా పాలకులను నిలదీస్తున్నారు. తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోలేక అపరిశుభ్రత వల్ల ఇబ్బందులు ఏర్ప డితే పాలకులపై విమర్శలు ఎక్కుపెట్టడం ఎంతవరకునమం జస్టం? బాధ్యత కలిగిన పౌరులు ఆలోచించాలి. ప్రభుత్వా నికి బాధ్యత లేదని చెప్పడంలేదు. ఎంతవరకు ఎన్ని పనులు చేయగలుగుతుందో ఆలోచించాలి.
చేతనైనంత సహాయం
గతంలో తోటి ప్రజలు కష్టాల్లో ఉంటే వాటిని ఆదుకునేందుకు ప్రజలు, స్వచ్ఛంద సేవాసంస్థలు మరెన్నో సంఘాలు, రాజకీయ పార్టీలు తమ కుతాముగా ముందుకు వచ్చి చేతనైనంత సహాయం అం దించేవారు. మేమున్నాం అధైర్యపడకండి అంటూ బాధితులకు ఎంతో చేయూతనిచ్చేవారు. ఇప్పుడు లేరనికాదు. రాను రాను తగ్గిపోతున్నారు. రికార్డుల్లో మాత్రం స్వచ్ఛంద సేవా సంస్థలు పెరిగిపోతున్నాయి. ఏదిఏమైతేనేం అర్నబ్ తు ఫాన్ ఆయా ప్రాంతాలను అతలాకుతలం చేసిందనే చెప్పొచ్చు. బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడిందనేవార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోస్తా తీరానికి తుఫాన్ల తాకిడి ఎక్కువగా ఉన్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. కారణాల గూర్చి శాస్త్రజ్ఞులే స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకో ఏమోకానీ బంగాళాఖాతంలో మాత్రం ఈతుఫాన్లు పెరిగి పోతున్నాయని శాస్త్రజ్ఞులుకూడా అంగీకరిస్తున్నారు. బంగాళా ఖాతంలో నాలుగు తుఫాన్లు వస్తే అరేబియా సముద్రంలో ఒకటి వస్తున్నది. వీటి ప్రభావం ఎక్కువగా కోస్తాపైనే పడు తున్నది. 1892 నుంచి 1989 వరకు లెక్కలు పరిశీలిస్తే 69 తుఫాన్లు కోస్తా తీరాన్ని దాటాయి. ఈ తుఫాన్లు కొన్ని పెనుతుఫాన్లుగా మారి ధనధాన్యాలతో తులతూగే పల్లె సీమలను మరుభూమిగా మార్చాయి. అన్నిటికంటే ముఖ్యంగా 1977 నవంబరు 19న సంభవించిన తుఫాన్ ధాన్యాగారమైన దివి సీమను దిక్కులేని శవాల సీమగా మార్చివేసింది. వేలాది మంది ప్రాణాలు నీటిలో కలిసిపో యాయి. ఇప్పటికీ ఆ బీభత్సాన్ని మరిచిపోలేకపోతున్నారు. రికార్డుస్థాయిలో గంటకు 260 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అంతటి పెను తుఫాన్ అంతకుముందు కానీ, ఆ తర్వాత కానీ రాలేదని చెప్పొచ్చు.
తుఫాన్లకు పేర్లు
గాలి వేగాన్ని బట్టి తీవ్రతను అంచనా వేస్తారు. అంతేకాదు వాయుగుండమా, తుఫానా, పెనుతుఫానా లాంటివి కూడా నిర్ధారించేవి గాలివేగాన్నిబట్టే. గాలివేగం 32కిలో మీటర్ల లోపల ఉంటే దాన్ని అల్పపీడనం అంటారు. 32 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల వరకు వాయుగుండం, ఆ తర్వాత 59 వరకు తీవ్ర వాయుగుండం, 60-90 కిలోమీటర్ల వరకు తుఫాన్, 90-119 వరకు తీవ్ర తుఫాన్, 119-220 వరకు భారీ తుఫాన్, 220 నుండి ఆపైన పెనుతుఫాన్గా నిర్ధారిస్తారు. ఈతుఫాన్లను గుర్తుం చుకునేందుకు తుఫాన్లకు పేర్లు పెడుతున్నారు. అయితే ఈ తుఫాన్లకు సంబంధించి అధ్యయనం దాదాపు ఏడు దశాబ్దాల కిందట ఆరంభమైనా రాకడా, పోకడ గురించి కొంత సమాచారం ప అందించగలుగుతున్నా నివారించే చర్య లు తీసుకునే సాంకేతిక పరిజ్ఞానం ఇంకా శాస్త్రవేత్తలు కను గొనలేదు. తుఫాన్ల గురించి ముందుగా హెచ్చరిస్తున్నారే తప్ప వాటి ప్రభావం ప్రజ జీవనంపై పడకుండా దిశను మార్చేశక్తి మన శాస్త్రవేత్తల పరిశోధనలకు అందలేదు. 1961 నుంచి కృత్రిమ ఉపగ్రహాలు అందుబాటులోకి వచ్చినా వాతా వరణాన్ని అవగాహన చేసుకొని రాకపోకల రహస్యాలను కొంతమేరకు కనుగొంటున్నారు. తుఫాన్ల కాలపరిమితి సగటున ఐదు, ఆరు రోజులకు మించి ఉండదు. కానీ శాస్త్ర జ్ఞులు ఊహించని విధంగా కొన్నిసార్లు ముప్ఫైఒక రోజులకు మించిపోయింది. 1994లో వచ్చిన ‘టైఫూన్’ తుఫాన్ 31 రోజులు ఉండగా, 1971లో వచ్చిన ‘హరికేన్ జింజర్’ తుఫాన్ 28 రోజులు ఉంది. ప్రస్తుతం వచ్చిన అర్నబ్ తుఫాన్ అపారనష్టం కలిగించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
చూసిపో వడమేతప్ప వారు చేసేదీఏమీలేదనే వాదన
ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నప్పుడు అంతోఇంతో ఆయా రాష్ట్రప్రభుత్వాలు స్పంది స్తున్నాయి. తలదాచుకునేందుకు షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. తాత్కాలిక సహాయం అందిస్తున్నారు. ముందుగాముప్పు నకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడం, విద్యుత్ అంతరా యాలు, రోడ్లకు గండ్లుపడడంతో రాకపోకలు స్తంభించే ప్రాంతాలను కూడా గుర్తించడం, అలాగే విమానాల, రైళ్ల రాకపోకలను రద్దు చేయడం లాంటి ముందస్తు చర్యలను కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అవసరమైన రీతిలో సకాలంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోకి రైతులకు చేయూతనివ్వ డం లేదు. ఇలాంటివి జరిగినప్పుడు నష్టం అంచనాలకు అధికార బృందాలను వంపి చేతులు దులుపుకుంటున్నారు. అది కూడా ఆ బృందాలు దొంగలుపడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లు వారికి తీరినప్పుడు, అంతా మరిచిపోయిన ప్పుడు వచ్చి మొక్కుబడిగా చూసివెళ్లుతున్నారు. ఆ బృందా లపై ప్రజలకు ఎప్పుడో నమ్మకాలు సన్నగిల్లాయి. చూసిపో వడమేతప్ప వారు చేసేదీఏమీలేదనే వాదనకు కేంద్రప్రభుత్వ వ్యవహారశైలి బలం చేకూరుస్తున్నది. రాష్ట్రప్రభుత్వాలు సర్వే ల ఆధారంగా నష్టాల నివేదికను తయారు చేసి ఆర్ధికసహా యం అందించాలని అడుగుతున్నదాంట్లో పదోవంతు కూడా కేంద్రం ఇవ్వడం లేదు. ఇలాంటి ఆపదలు సంభవించినప్పుడు కేంద్రప్రభుత్వం ఆపన్నహస్తం అందించాలి. స్వచ్ఛంద సంస్థలు ఇందులో భాగస్వామ్యులు కావాలి. ఆపదలో ఉన్న అన్నార్థులకు ఆపన్న హస్తం అంది వ్వాల్సిన తరుణమిది.
-దామెర్ల సాయిబాబ
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: