ED searches the residence of former CM's son

మాజీ సీఎం కుమారుడి నివాసంలో ఈడీ సోదాలు

ఛత్తీస్‌గఢ్‌: ఈడీ అధికారులు ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేశ్ భగేల్ కుమారుడు చైతన్య నివాసంలో సోమవారం సోదాలు నిర్వహించారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈ తనిఖీలు జరిగాయని సంబంధిత అధికారులు వెల్లడించారు .మొత్తం 15 ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి. వాటిలో భిలాయి ప్రాంతంలో ఉన్న చైతన్య భగేల్ నివాసం కూడా ఉంది. ఈ తనిఖీల నేపథ్యంలో భగేల్ కార్యాలయం నుంచి స్పందన వచ్చింది.

Advertisements
మాజీ సీఎం కుమారుడి నివాసంలో

రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం

ఏడు సంవత్సరాలు నడిచిన తప్పుడు కేసును కోర్టు కొట్టివేసింది. కానీ ఇప్పుడు ఈడీ అతిథులు వచ్చి భగేల్ నివాసంలో తనిఖీలు చేశారు అని మండిపడింది. ఛత్తీస్‌గఢ్‌ మద్యం కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి. మద్యం సిండికేట్‌కు రూ.రెండువేల కోట్ల మేర లబ్ధి చేకూరిందని ఈడీ గతంలో పేర్కొంది. దర్యాప్తులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు వ్యాపారవేత్తలను అరెస్టు చేసింది.

సిఆర్‌పిఎఫ్ జవాన్లకు, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య‌ వాగ్వాదం

కాగా, ఉదయం 7:00 గంటలకు మూడు ఇన్నోవా కార్లలో ఈడీ బృందం భూపేష్ బఘేల్ ఇంటికి వచ్చింది. బంగ్లా లోపల ఈడీ సోదాలు జ‌రుగుతున్నాయి. అయితే.. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు భూపేష్ బఘేల్ ఇంటి బయట గుమిగూడారు. ఈడీ సోదాల నేప‌థ్యంలో భద్రత కోసం హాజరైన సిఆర్‌పిఎఫ్ జవాన్లకు, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య‌ వాగ్వాదం జరిగింది. మీడియా సిబ్బంది కవరేజీని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అయితే కాసేపటి తర్వాత వాతావరణం సద్దుమణిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Related Posts
బంగ్లాదేశ్‌లో భారతీయ పర్యాటకుడిపై హింసాత్మక దాడి
Hindus in bangladesh

భారతీయ పర్యాటకుడు సయన్ ఘోష్ తన బంగ్లాదేశ్ పర్యటన అనంతరం గాయాలపాలై, తీవ్రంగా మనోవేదనకు గురై ఇండియాకు తిరిగి వచ్చారు. 21 సంవత్సరాల సయన్ ఘోష్ తన Read more

UAE: క్షమాభిక్ష..యూఏఈ జైళ్ల నుంచి 500 మందికి పైగా భారతీయులు విడుదల!
Over 500 Indians released from UAE prisons

UAE: భారత్‌తో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే క్రమంలో యూఏఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా భారీ సంఖ్యలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. Read more

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్

భారతదేశంలో రైళ్లు అత్యంత ప్రజాదరణ పొందిన ప్రయాణ విధానంగా ఉంది. రైల్వే ద్వాారా లక్షలాది మంది ప్రయాణికులు రోజూ ప్రయాణిస్తున్నారు. భారతీయ రైల్వేలు ప్రయాణీకుల సౌలభ్యాన్ని పెంచడానికి Read more

మాజీ కేంద్ర మంత్రి ఇళంగోవ‌న్ మృతి
EVKS

మాజీ కేంద్ర మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవ‌న్ ఇవాళ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 73 ఏళ్లు. గత కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధ‌ప‌డ్డారు. నెల రోజుల Read more

×