EC is an impartial system .. CEC Rajeev Kumar

ఈసీ నిష్పక్షపాతంగా ఉండే వ్యవస్థ : సీఈసీ రాజీవ్ కుమార్

ఎవరైనా తప్పు చేస్తే తమ వ్యవస్థ సహించదని వెల్లడి

న్యూఢిల్లీ: లోక్‌సభతో పాటు ఆయా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ డేటా తారుమారు అయిందంటూ కొంతకాలంగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మరోమారు స్పందించారు. పోలింగ్ డేటా వ్యవస్థ పకడ్బందీగా ఉందని, ఎటువంటి తప్పిదాలకు తావు లేదని మరోమారు స్పష్టం చేశారు. పోలింగ్‌లో అక్రమాలకు అవకాశం ఉందంటూ గతంలో వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.

image

ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యవస్థ అని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా తప్పు చేస్తే తమ వ్యవస్థ సహించదని అన్నారు. పోలింగ్ డేటా వ్యవస్థ పకడ్బందీగా ఉంటుందని స్పష్టం చేశారు. లోక్‌సభ 2024 అట్లాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ బూత్ స్థాయి అధికారులతో సహా లక్షలాది మంది సిబ్బంది పోలింగ్ డేటాలో పాలుపంచుకుంటారని, కాబట్టి పొరబాటు జరగడానికి ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈసీ విడుదల చేసిన పోలింగ్ డేటా‌లో తేడాలు ఉన్నాయని ఇటీవల విపక్షాల నుంచి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

Related Posts
నేడు వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
Today ycp statewide agitations on the increase in electricity charges

అమరావతి: ఏపీలోని కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుపై నేడు(శుక్రవారం) ప్రతిపక్ష వైసీపీ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా Read more

NBK -CBN ‘అన్ స్టాపబుల్’ హైలైట్స్
CBN NBK UNSTOP

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించే 'అన్ స్టాపబుల్' షో నాలుగో సీజన్ ప్రారంభంలోనే పెద్ద మేజర్ సీన్లతో మొదలైంది. ఈ సీజన్ ప్రారంభ ఎపిసోడ్ లో Read more

పెరగనున్న సిగరెట్ ధరలు!
పెరగనున్న సిగరెట్ ధరలు!

ధూమపాన ప్రియులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం చేదువార్త చెప్పబోతోంది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు మరింత పెరగనున్నాయి. పన్ను ఆదాయం తగ్గకుండా చూసుకునేలా, ప్రజలను ధూమపానం నుంచి Read more

భారత వాయు సేనలో అగ్నివీర్ ల నియామకాలు
army

భారత వాయుసేన నియామక ప్రకటన విడుదల చేసింది. అగ్నిపథ్ స్కీంలో భాగంగా చేపట్టే ఈ నియామకం నాలుగేళ్లకు మాత్రమే పరిమితం. ఇంటర్, తత్సమాన కోర్సులు పూర్తిచేసిన అవివాహిత Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *