అమెరికాలోని టెక్సాస్ (Texas Floods) రాష్ట్రాన్ని విపరీతమైన వరదలు చుట్టుముట్టాయి. ఈ ప్రళయంలో ఇప్పటి వరకు 69 మంది ప్రాణాలు కోల్పోయారు (69 people lost their lives). ఆమధ్య మరణించిన వారిలో 21 మంది చిన్నారులుండటం మరింత బాధాకరం. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ కొందరి ఆచూకీ తెలియకపోవడంతో, గాలింపు చర్యలు తలెత్తినవి.కెర్విల్లే కౌంటీ వరద తీవ్రతకు కేంద్రబిందువిగా మారింది. ఇక్కడ ఒక్కచోటే 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 21 మంది చిన్నారులుండటం తీవ్ర విషాదం. క్యాంప్ మిస్టిక్ నుంచి వచ్చిన 11 మంది విద్యార్థులు, ఒక కౌన్సిలర్ ఆచూకీ లభించకపోవడంతో గాలింపు మరింత ముమ్మరమైంది.

20 కౌంటీలను ముంచిన వర్షపాతం
టెక్సాస్ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 కౌంటీలు వరదల ప్రభావానికి లోనయ్యాయి. ఇప్పటికే గవర్నర్ గ్రెగ్ అబాట్ మరిన్ని ప్రాంతాలను విపత్తు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. సహాయ చర్యలు వేగవంతం చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ స్పందించారంటూ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శిథిలాల మధ్య గాలింపు కష్టంగా మారిందని పేర్కొన్నారు.రాబోయే 24 నుంచి 48 గంటల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించవచ్చన్న హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు సూచించారు.
మోదీ, ట్రంప్ స్పందన
ఈ విషాద ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. చిన్నారులతో సహా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ట్వీట్ చేశారు. అమెరికా ప్రజలకు, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు.ప్రజా భద్రతా విభాగం ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 18 పడవలు, 9 హెలికాప్టర్లు, 11 టెక్సాస్ రేంజర్లు రంగంలోకి దిగారు. గల్లంతైన చిన్నారులే లక్ష్యంగా గాలింపు కొనసాగుతోంది.
Read Also : Prashant Kishor : విజయ్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ తాత్కాలిక బ్రేక్..