District Collector Lakshmisha: కృష్ణమ్మ తీరాన కుంచెతో కోటి భావాలు

Read Time:  1 min
District Collector Lakshmisha: కృష్ణమ్మ తీరాన కుంచెతో కోటి భావాలు
FONT SIZE
GET APP

ఉత్సాహంగా ఫ్లోర్ పెయింటింగ్, డ్రాయింగ్ పోటీలు: స్వయంగా పాల్గొన్న కలెక్టర్

విజయవాడ : సామాజిక అంశాలపై ఆయా రంగాల్లో ప్రతిభావం తులైన కళాకారులకు అవగాహన ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ వ్యాఖ్యానించారు. యువత సైతం కళరంగంలో రాణించాలన్నారు. ప్రతి మనిషిలో సృజనాత్మకత ఉంటుందన్నారు. అది బయటకు రావాలంటే ఆయా అంశాలపై పోటీలు నిర్వహించాలన్నారు. జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హరిత బెరం పార్కు కృష్ణా తీరంలో జరిగిన ఫ్లోర్ పెయింటింగ్, డ్రాయింగ్ పోటీల్లో 300 మందికి పైగా యువత, చిన్నారులు పాల్గొని తమ కళా ప్రతిభను ప్రదర్శించారు. స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర విజన్ 2047, పీ4 ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా భాగస్వామ్యం) విధానం, సేనోటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్, స్వచ్చంధ్ర, సేవ్ వాటర్, రెడ్యూస్రియూజ్లో సైకిల్, హరితాంధ్ర అంశాల్లో వేసిన వర్ణ చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

అధికారులు సిబ్బందికి

కొత్త శోభను సంతరించుకున్న కృష్ణా తీరం స్ఫూర్తి వైబ్రెంట్ విజయవాడకు తొలి అడుగు అని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 పురస్కారాల్లో విజయవాడ నగరం సూపర్ స్వచ్ఛతా లీగ్ అవార్డును గెలుచుకున్నందుకు నగర ప్రజలకు, నగరపాలక సంస్థ అధికారులు సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. విజయవాడ నగర పాలక సంస్థ (Vijayawada Municipal Corporation) కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం మాట్లాడుతూ చిన్నారులు, యువత పర్యావ రణం, జల వనరులు, కాలుష్య దుష్పరిణా మాలు తదితర అంశాలపై అవగాహన పెంచు కునేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

District Collector Lakshmisha: కృష్ణమ్మ తీరాన కుంచెతో కోటి భావాలు
District Collector Lakshmisha

మొదటిస్థానంలో

పెయింటింగ్, డ్రాయింగ్ పోటీల విజేతలకు కలెక్టర్ లక్ష్మీశ కమిషనర్ ధ్యానచంద్ర బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఫ్లోర్ పెయింటింగ్ విభాగంలో స్వర్ణాంధ్ర విజన్ సేవ్ వాటర్ పెయింటింగ్తో జి. తనూజ (G. Tanuja) మొదటిస్థానంలో నిలిచి రూ.10వేల నగదు బహుమతితో పాటు ఙ్ఞాపిక, ప్రశం సాపత్రాన్ని అందుకుంది. ద్వితీయ బహుమతి (రూ.7,500)ని పి. యామినీ విశాల, తృతీయ బహుమతి (రూ. 5,000)ను వి. జశ్వంతి, నాలుగో బహుమతి (రూ. 3,000)ని ఎం. సురేష్ పొందారు. ఫ్లోర్ పెయింటింగ్లో ఎల్. శ్వేత. పి.రచన, వి. అనురాధ, కె.హవీలా జెన్నీ, బి. రోహితలు ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు.

ప్రోత్సాహక బహుమతులు

డ్రాయింగ్ పోటీల్లో ఎంఎస్ వైష్ణవ్య తొలి బహుమతి అందుకోగా రెండు, మూడు, నాలుగో స్థానాల్లో రాహిల్ జయాన్, జి. భాష్యశ్రీ, లక్ష్మీ జైన్ నిలిచారు. టి.క్రిష్, జి.ఇషికా కృష్ణన్, జి. ఆధ్వి, సాక్షం సుతార్, రామిరెడ్డి జశ్వితలు ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. పోటీలకు కళానిపుణులు పి.చిదంబరేశ్వరరావు, కళాసాగర్, పి.రమేష్. సంతోష్ కుమార్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్ర మంలో అడిషనల్ కమిషనర్ (Additional Commissioner) డా. డి. చంద్రశేఖర్, ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ పి. కృష్ణచైతన్య, అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో తరుణ్ కాకాని, జిల్లా టూరిజం అధికారి ఎ. శిల్ప, ఆయుష్ అధికారి డా. రత్నప్రియదర్శిని తదితం పలు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Tirumala: తిరుమలేశుని బ్రహ్మోత్సవ ఏర్పాట్లు షురూ

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.