Discussion on budget from today in AP

ఏపీలో నేటి నుంచి బడ్జెట్‌పై చర్చ

అమరావతి: ఏపీలో ఈరోజు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి శాసనసభలో పద్దుపై చర్చ జరుగనుంది. తొలుత పాలవలస రాజశేఖరం మృతికి నివాళులర్పించనున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు పాఠశాలలకు ప్రహరీగోడల నిర్మాణం,వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్లు, వక్ఫ ఆస్తుల రికార్డుల డిజిటైజేషన్, డీఎస్స్సీ నోటిఫికేషన్, శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ తదితర అంశాలపై చర్చించనున్నారు. గిరిజన యువతకు ఉపాధి, గోదావరి పుష్కరాలు, మహిళలు-చిన్నారులపై అఘాయిత్యాలు, మాదకద్రవ్యాల వినియోగం, గోదావరి డెల్టా సాగునీటి కాలువల నిర్వహణ అంశాలపై ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు ఇస్తారు.

Advertisements
ఏపీలో నేటి నుంచి బడ్జెట్‌పై

వివిధ అంశాలపై ప్రశ్నలకు సమాధానం

మరోవైపు శాసనమండలిలో ఈరోజు బడ్జెట్​పై తొలిరోజు చర్చ జరుగనుంది. శాసనమండలిలో నేటి ప్రశ్నోత్తరాల్లో పులివెందుల గృహనిర్మాణ పథకంలో అక్రమాలు, పోర్టుల నిర్మాణం,ఏపీఎండీసీ వాటాల విక్రయం, పేదలకు ఇళ్లస్థలాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీ తదితర అంశాలపై ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు ఇవ్వనున్నారు. కోళ్లకు వైరస్, మండల పరిషత్​లు – గ్రామపంచాయితీల్లో నిధుల దుర్వినియోగం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెవెన్యూ సదస్సులు, ఆరోగ్యశ్రీ పథకం తదితర అంశాలపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు.

ఏపీ బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్ల మార్కు

ఆంధ్రప్రదేశ్​లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను రూ.3,22,359 కోట్లతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శుక్రవారం నాడు అసెంబ్లీ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఏపీ బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి. రూ.48,341 కోట్లతో వ్యవసాయ పద్దును ఆ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. సంక్షేమానికి, అభివృద్ధికి, హామీల అమలుకు సమప్రాధాన్యమిస్తూ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు పద్దులో విస్తృత కసరత్తు చేశారు.

Related Posts
రఘురామ కేసులో ప్రభావతికి షాకిచ్చిన హైకోర్టు
ap high court

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై అక్రమ కేసులను మోపుతున్నది. తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన వ్యవహారంలో Read more

బుమ్రా గైర్హాజరీ, కోహ్లీ సంజ్ఞలు
బుమ్రా గైర్హాజరీ, కోహ్లీ సంజ్ఞలు

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీతో నడవాల్సి వచ్చింది. వెన్నునొప్పి కారణంగా బౌలింగ్ చేయకుండా విశ్రాంతి తీసుకున్న Read more

కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ శ్రేణులు షాక్ …
kamareddy congres

తెలంగాణాలో అధికార పార్టీ కాంగ్రెస్ కు సొంత పార్టీ శ్రేణులే భారీ షాక్ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండామోస్తు వచ్చిన తమను కాదని ఇతర పార్టీల Read more

అసెంబ్లీకి వస్తా.. కాంగ్రెస్ అంతు చూస్తా- కేసీఆర్
పార్టీ కీలక నేతలతో కేసీఆర్ భేటీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, త్వరలోనే రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో Read more

×