Dilsukhnagar twin blasts case..High Court verdict today

Bomb Blasts Case : దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసు..నేడు హైకోర్టు తీర్పు

Bomb Blasts Case : దిల్‌సుఖ్‌ నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో ఈరోజు(మంగళవారం) తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది చనిపోగా.. 130 మందికి గాయాలు అయ్యాయి. ఈ కేసు విచారణ జరిపిన ఎన్‌ఐఏ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ సహా ఐదుగురికి మరణశిక్ష విధించింది. అయితే.. ఈ శిక్షను సవాల్‌ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు.

Advertisements
దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసు

ప్రధాన నిందితుడిగా యాసిన్‌ భత్కల్‌

2013 ఫిబ్రవరి 21న నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన దిల్‌సుఖ్‌ నగర్‌లో పేలుళ్లు సంభవించాయి. ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దర్యాప్తు జరిపింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డ్ చేసింది. ఈ దర్యాప్తులో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌ ప్రధాన నిందితుడిగా తేలింది.

తీహార్‌ జైల్లో శిక్ష

నిందితులలో అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్ నిందితులుగా ఉన్నారు. మూడేళ్లపాటు ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో జరిగిన విచారణ అనంతరం.. నిందితులపై మరణశిక్ష పడింది. ఈ కేసుతో పాటు పలు ఉగ్రదాడుల్లో కీలకంగా వ్యవహరించిన యాసిన్‌ భత్కల్‌ను 2013లో బీహార్‌-నేపాల్‌ సరిహద్దులో పట్టుకోగలిగారు. ఢిల్లీ(2008), దిల్‌సుఖ్‌ నగర్‌ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలడంతో తీహార్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

Read Also : నేడు గుజరాత్ కు సీఎం రేవంత్

Related Posts
యువ చిత్రనిర్మాతలకు సాంకేతిక మార్పులపై అశ్విని వైష్ణవ్ సందేశం
ashwini vaishnav

కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం యువ చిత్రనిర్మాతలకు ఆవశ్యకమైన సాంకేతికతలను స్వీకరించాలంటూ సూచించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, సినిమాటోగ్రఫీ, నిర్మాణం Read more

Hyderabad Metro Rail: మెట్రో రైలుకి పెరుగుతున్న ఆర్ధిక భారం
Hyderabad Metro Rail: మెట్రో రైలుకి పెరుగుతున్న ఆర్ధిక భారం

మెట్రో నష్టాల్లో.. ప్రభుత్వం స్పష్టత హైదరాబాద్ మెట్రో రైలుకు రోజుకు దాదాపు కోటిన్నర రూపాయల నష్టం వస్తుండటంతో, ఆర్థిక స్థితిని మెరుగుపరచేందుకు ఛార్జీలు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదన Read more

Waqf Bill : వక్స్ బిల్లులోని కీలకాంశాలు
Waqf Amendment Bill 2

వక్స్ బిల్లులోని కీలక నిబంధనల ప్రకారం, వక్స్ బోర్డుల్లో సభ్యులుగా ముస్లింలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రత్యేకంగా, కనీసం ఇద్దరు మహిళలు ఈ బోర్డుల్లో సభ్యులుగా ఉండేలా నిబంధనలు Read more

ఎస్సీ, ఎస్టీలకుస్వయంఉపాధి పథకాలు: భట్టి విక్రమార్క
ఎస్సీ, ఎస్టీలకుస్వయంఉపాధి పథకాలు: భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే రైతుల కోసం రైతు భరోసా, రైతు రుణ మాఫీ, Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×