📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

YCP MLC: తిరుమల బ్రేక్​ దర్శనానికి రూ. 65 వేలు వసూలు చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీపై కేసు

Author Icon By Divya Vani M
Updated: October 20, 2024 • 1:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖాన్‌పై తిరుమల పోలీసుల వారు ఒక కేసు నమోదు చేశారు శ్రీవారి దర్శనానికి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ బెంగళూరుకు చెందిన ఒక భక్తుడు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు ఈ ఫిర్యాదుల జకియా ఖాన్ వీఐపీ బ్రేక్ దర్శనం ఇప్పిస్తానని చెప్పి ఆరుగురి నుంచి రూ. 65 వేలు తీసుకున్నారన్న ఆరోపణ ఉంది అంతేకాకుండా టికెట్ల కోసం డబ్బులు వసూలు చేసినప్పుడు జకియా తన చేతిలో సిఫార్సు లేఖను చూపించారని పేర్కొన్నారు భక్తుడి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అధికారులు ఆరోపణలు నిజమని నిర్ధారించారు దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా చంద్రశేఖర్ ఏ2గా ఎమ్మెల్సీ జకియా ఖాన్ ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజి పేర్లను చేర్చారు ఈ కేసుపై తూర్పు దర్యాప్తు చేసి ఆరోపణలు నిజమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు తెలిపారు ఇక ఈ ఘటనపై వైసీపీకి సంబంధం లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు ఆయన మాట్లాడుతూ జకియా ఖాన్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని వెల్లడించారు ఈ వివరణతో పార్టీకి నష్టం తగలకుండా జకియా ఖాన్ వ్యక్తిగత స్థాయిలో మాత్రమే ఈ ఘటనకి బాధ్యత వహించవచ్చని స్పష్టం చేశారు.

Jakia Khanam case MLC Police case tirumala VIP Darshanam ycp

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.