📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘనంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

Author Icon By Anusha
Updated: March 9, 2025 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కల్యాణోత్సవం శనివారం రాత్రి పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడింది. ఏకశిఖరవాసుడైన నారసింహుడు, ఏకపత్నీవ్రతుడైన శ్రీరాముని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చాడు.

అద్భుతమైన కళ్యాణ వేడుక

నారసింహస్వామి కళ్యాణం గజవాహనంపై ఊరేగింపుగా, మహాలక్ష్మి అమ్మవారు పుష్పాల పల్లకిలో కల్యాణ వేదికకు చేరుకున్నారు. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట, మామిడి తోరణాలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ పవిత్ర ఘట్టం జరిగింది. భక్తుల కరతాళ ధ్వానాల మధ్య లక్ష్మీ అమ్మవారి మెడలో స్వామివారు మాంగళ్యధారణ చేశారు. వేద మంత్రోచ్ఛారణలతో, మంగళ వాయిద్యాలతో ఆలయం మారుమోగిపోయింది.వేదపండితుల ప్రకారం, స్వామివారు ‘ధర్మో రక్షతి రక్షితః’ సందేశాన్ని భక్తులకు అందించారు. హనుమంత వాహనంపై శ్రీరామ అలంకారంలో స్వామి భక్తులను ఆశీర్వదించారు. కళ్యాణ మండపంలో విశ్వక్సేనుడి తొలి పూజలతో వేడుక ప్రారంభమైంది. యజ్ఞోపవీతధారణ, పాదప్రక్షాళన అనంతరం అభిజిత్ లగ్న సమయమైన రాత్రి 8.45 గంటలకు జీలకర్ర బెల్లం ఉత్సవం నిర్వహించారు.యాదాద్రి పుణ్య క్షేత్రంలో పంచ నరసింహుడు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. రెండు గంటలపాటు శాస్ర్తోక్తంగా జరిగిన తతంగం ఆధ్యాత్మిక శోభను సంతరింపజేసింది. ప్రధాన పూజారులు నల్లన్‌థీఘళ్‌ లక్ష్మీనరసింహా చార్యులు, మోహనాచార్యులు పూజారులు కల్యాణ పర్వాలను నిర్వహించారు. కల్యాణోత్సవంలో అర్చక బృందం, పారాయణీకుల వేదఘోష, భక్తుల గోవింద నామస్మరణతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వైభవం నెలకొంది.

స్వామి అమ్మవార్ల కల్యాణ ఘట్టం

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, బంగారు ఆభరణాలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు, దేవదాయ శాఖ కార్యదర్శి అర్చకులకు అందజేశారు. స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. స్వామి అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు తమ జన్మ ధన్యమైందని భావిస్తూ ఆనంద పరవశుల య్యారు. సమస్త దేవతలు, మహర్షులు, ప్రకృతిలోని ప్రాణకోటి మొత్తం ఈ కల్యాణ వేడుకను తనివితీరా వీక్షించి పరవశించారని వేదపండితులు భక్తులకు ప్రవచించారు.

#HinduTempleFestivals #LakshmiNarasimhaKalyanam #SpiritualFestival #YadadriBrahmotsavam Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.