📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దేవుడి దగ్గర రాజకీయలు ఎందుకు?- శ్రీనివాస్ గౌడ్

Author Icon By Sudheer
Updated: December 29, 2024 • 8:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల శ్రీవారి ఆలయంలో అందరిని సమానంగా చూడాలని తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. దేవాలయాల్లో ప్రాంతాల మధ్య తేడాలు లేకుండా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ అనే బేధాలు లేవు. కానీ సిఫారసు లేఖల విధానాన్ని ఆపితే ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాలు అందరికీ సమాన ప్రాధాన్యతను ఇస్తున్నాయని శ్రీనివాస్ గౌడ్ స్పష్టంచేశారు. మేం తెలంగాణలో ఎవరి ఆధారంగా ప్రవర్తించటం లేదు. అందరినీ సమానంగా చూసే విధానాన్ని పాటిస్తున్నాం. తిరుమల ఆలయంలో కూడా అదే విధానం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ కూడా హైదరాబాద్‌లో నివసిస్తున్నారని, దీనిపై ఎలాంటి వివక్ష చూపలేదని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. మేము తెలంగాణ నాయకులుగా ఉన్నప్పటికీ, దేవాలయాల విషయంలో ఎప్పుడూ తేడాగా ప్రవర్తించలేదు. ఈ విషయంలో దేవుని సన్నిధిలోనూ అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అని, తిరుమల ఆలయంలో ఇటువంటి వివక్షల వల్ల అనవసర తేడాలు రావొచ్చని, వాటిని నివారించాల్సిన బాధ్యత మనందరిదేనని శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

Srinivas Goud tirumala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.