📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Deepavali 2025: ఈ ఏడాది దీపావళి ఎప్పుడు 20నా.. 21నా?

Author Icon By Anusha
Updated: September 25, 2025 • 5:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశంలో ప్రతి సంవత్సరం చిన్నారులు, పెద్దలు మధ్య తేడా లేకుండా ఎంతో ఉత్సాహంగా, వైభవంగా జరుపుకునే పండుగ దీపావళి (Deepavali )మరికొద్ది రోజుల్లో రానుంది. దీపావళి అనేది లైట్ ఫెస్టివల్ (Light Festival)అని కూడా పిలవబడుతుంది. దీపావళి రోజున, సంపద, శ్రేయస్సు, సుఖసంతోషం కోసం లక్ష్మీదేవి, గణేశుడులకు ప్రత్యేక పూజలు చేయడం అనేది ప్రధానాంశం. సంపూర్ణ కుటుంబం ఒకచోట కలిసి దీపాలు వెలిగించడం, మిఠాయిలు, ద్వారా ఆనందాన్ని పంచుకోవడం దీపావళి ఉత్సాహానికి ప్రధాన లక్షణాలు.

Shah Rukh Khan: షారూక్ ఖాన్‌పై మాజీ నార్కోటిక్స్ ఆఫీస‌ర్ ప‌రువున‌ష్టం కేసు

ఈ సంవత్సరం, 2025లో దీపావళి పండుగ అశ్వయుజ బహుళ అమావాస్య రోజున జరుపుకోబడుతుంది. సాధారణంగా దీపావళి అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది.ఈ దీపావళి పండగను జరుపుకునే విషయంలో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ రోజు 2025 లో దీపావళి పండగ ఎప్పుడు వచ్చింది? ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత.. గురించి తెలుసుకుందాం.దీపావళి రోజున లక్ష్మీదేవిని , గణేశుడిని పూజించే ముందు..

దృక్ పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం అమావాస్య తిథి అక్టోబర్ 20, 2025న తెల్లవారుజామున 3:44 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 21, 2025న ఉదయం 5:54 గంటలకు ముగుస్తుంది. కనుక 2025 దీపావళి పండుగ అక్టోబర్ 20 సోమవారం నాడు జరుపుకోవాల్సి ఉంటుంది.

ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసి ప్రవేశ ద్వారం వద్ద ముగ్గు వేయాలి. ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగించండి. పూజా స్థలంలో ఎర్రటి వస్త్రంతో వేసి ఆ పీటం మీద లక్ష్మీదేవి, గణేశుడు, కుబేరుడి విగ్రహాలను ప్రతిష్టించండి. ఒక నీరు ఆచమనం చేసి పూజ ప్రారంభించాలి.  పూజ ప్రారంభించాలి. తరువాత ముందుగా గణేశుడిని పూజించాలి. ఆయనకు స్నానం చేయించి, బట్టలు, చందనం పేస్ట్, పువ్వులు, దర్భ గడ్డిని సమర్పించండి.

దీని తరువాత లక్ష్మీదేవి (Goddess Lakshmi) ని పూజించండి. అమ్మవారికి తామర పువ్వులు, సింధూరం, అక్షతలు, పసుపు, సుగంధ ద్రవ్యాలు, స్వీట్లు, పండ్లు సమర్పించండి. ఈ రోజున కొత్త ఖాతా పుస్తకాలు, ఇనప్పెట్టెలు, సంపదను కూడా పూజిస్తారు. పూజ సమయంలో 11, 21, లేదా 51 దీపాలను వెలిగించండి. చివరగా మొత్తం కుటుంబంతో కలిసి లక్ష్మీ-గణేష్ కి హారతి ఇవ్వండి. తర్వాత అందరికీ ప్రసాదం పంపిణీ చేయండి.

Deepavali 2025

పసుపు రంగు దుస్తులు ధరించడం

దీపావళి సాయంత్రం తులసి మొక్క దగ్గర తొమ్మిది నెయ్యి దీపాలను వెలిగించండి. ఇది ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుందని, లక్ష్మీ దేవిని ప్రసన్నం అవుతుందని నమ్ముతారు.దీపావళి రాత్రి రావి చెట్టు కింద నూనె దీపం వెలిగించి, వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి తిరిగి వెళ్లండి. అలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.దీపావళి పూజ సమయంలో తెలుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు.

ఇంట్లో ఏదైనా అప్పు ఉంటే దీపావళి నాడు కొత్త ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం శుభప్రదం.దీపావళి చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని, జ్ఞానానికి దేవుడైన గణేశుడిని పూజిస్తూ ఈ పండగను జరుపుకుంటారు. ఈ రోజు ఇంటికి ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకువస్తుందని నమ్మకం. ఈ రోజున లక్ష్మీ దేవిని స్వాగతించడం వల్ల కుటుంబానికి ఆనందం , శ్రేయస్సు వస్తుంది.

పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు

దీపాలు వెలిగించడం వల్ల చీకటి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. దీపావళి సంబంధాలను బలోపేతం చేయడానికి కూడా ఒక అవకాశం.గమనిక:ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Ashwayuja Amavasya Breaking News Deepavali Celebration Diwali 2025 Family Celebration festival Ganesha Puja Happiness india Lakshmi Puja latest news Prosperity Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.