हिन्दी | Epaper
వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Latest News: Diwali 2025 : దీపావళి పండుగ అక్టోబర్‌ 20 లేదా 21 ఎప్పుడు జరుపుకోవాలి అంటే?

Anusha
Latest News: Diwali 2025 : దీపావళి పండుగ అక్టోబర్‌ 20 లేదా 21 ఎప్పుడు జరుపుకోవాలి అంటే?

ఆశ్వయుజ మాసం అంటేనే విజయానికి ప్రతీక. ఈ మాసం ఆరంభమవ్వగానే శరన్నవరాత్రుల పర్వదినాలు మొదలవుతాయి. దేవీ శక్తి తన వీర రూపంలో మహిషాసురుడిని సంహరించి ధర్మం విజయం సాధించిన సమయమే ఇది.

Congress Alliance : కాంగ్రెస్తో పొత్తు ఉండదని తేల్చేసిన కేజీవాల్

మాసాంతంలో చతుర్దశి నాడు శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చేసి విజయదుందుభి మోగిస్తాడు. ఇలా లోకకంటకులుగా మారిన ఇద్దరు రాక్షసుల సంహారంతో సర్వలోకాలూ విజయ గర్వంతో ఆనంద దీపాలు వెలిగించిన రోజు దీపావళి పండుగ (Deepavali 2025) రోజు పెద్ద చిన్న పేద ధనిక తారతమ్యం లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దీపావళి పండుగ.

అయితే.. ఈ ఏడాది దీపావళి పండుగ తేదీ విషయంలో సందిగ్ధత నెలకొంది. కాబట్టి ఈసారి దీపావళి 2025 పండుగ ఏ రోజు జరుపుకోవాలి, పూజకు శుభ సమయం తదితర విషయాలు తెలుసుకుందాం..దృక్ పంచాంగం ప్రకారం.. ఆశ్వయుజ మాసం 2025 అమావాస్య తిథి అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం 3.44 గంటలకు ప్రారంభమవుతుంది.

సోమవారం రోజు దీపావళి పండుగ జరుపుకోవాల్సి ఉంటుంది

అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5.54 గంటలకు ముగుస్తుంది. కాబట్టి అక్టోబర్‌ 20వ తేదీన సోమవారం రోజు దీపావళి పండుగ జరుపుకోవాల్సి ఉంటుంది. ఈరోజునే లక్ష్మీ పూజ (Lakshmi Puja) ఆచరిస్తారు. ఇక లక్ష్మీ పూజ ఆచరించడానికి సాయంత్రం 7.08 గంటల నుంచి 8.18 గంటల వరకు శుభ ముహూర్తం ఉంది.

Diwali 2025
Diwali 2025

అలాగే.. ప్రదోష కాలం సాయంత్రం 5.46 గంటల నుంచి రాత్రి 8.18 గంటల వరకు.. అదే వృషభ కాలం రాత్రి 7.08 నుంచి 9.03 గంటల వరకు ఉంటుంది.రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతుడై ఈ దీపావళి రోజే అయోధ్యకు తిరిగి వచ్చాడు. శ్రీరాముడు (Lord Rama) సీతా సమేతంగా రావడంతో అయోధ్యానగర ప్రజలు అందరూ దీపాల వరుసలతో సీతారాములకు స్వాగతం పలికి ఆనందోత్సాహంతో, సంతోషంతో సంబురాలు చేశారు..

వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపినది కూడా ఈ దీపావళి రోజు

బాణాసంచాలు కాల్చారు. అలాగే.. పంచపాండవులు అఙ్ఞాతవాసం ముగించుకుని దీపావళి పండుగ రోజే హస్తినకు చేరుకున్నారు.అంతే కాకుండా వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపినది కూడా ఈ దీపావళి రోజునే. అయితే బలిచక్రవర్తి ఈ దీపావళి పండుగ రోజున భూమి మీదకు వచ్చి ప్రజలను తనివితీరా చూసుకుంటారని కేరళ రాష్ట్ర ప్రజల విశ్వాసం.

అందుకే కేరళ రాష్ట్రీయులు ఈ దీపావళి పండుగను బలి అమావాస్యగా జరుపుకుంటారు. మరో విశేషమేమిటంటే.. షట్చక్రవర్తుల్లో ఒకరైన విక్రమార్కుడు ఈ దీపావళి పండుగ రోజే పట్టాభిషిక్తుడయ్యాడు. అలాగే తొలి తెలుగు రాజైన శాలివాహనుడు కూడా ఈ దీపావళి పండుగ రోజే విక్రమార్కుడిని ఓడించి ఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇలా ఇన్ని కారణాలు ఉండటం వల్ల దీపావళి పండుగ అంటేనే ఒక ఎమోషన్‌, క్రేజ్‌.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870