📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంతాన ప్రాప్తి కలిగించే జ్యోతిర్లింగం ఎక్కడ ఉందొ తెలుసా..?

Author Icon By Sudheer
Updated: February 26, 2025 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హిందూ మతంలో ద్వాదశ జ్యోతిర్లింగాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ జ్యోతిర్లింగాల్లో మహారాష్ట్రలోని ఘృష్నేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరిదిగా గుర్తించబడింది. ఈ పవిత్ర స్థలం భక్తులకి అత్యంత శ్రద్ధాసక్తులతో కూడిన దర్శన స్థలంగా మారింది. ఇక్కడ శివుని దర్శనం చేసుకునే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అందుకే, ఈ ఆలయాన్ని సందర్శించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు.

Sri Grishneshwar

భక్తిని చూసి పరమేశ్వరుడు ప్రత్యేక్షం

స్థల పురాణం ప్రకారం, శివుడిని అత్యంత భక్తితో పూజించే ఒక మహిళ కుమారుణ్ని కొందరు కొలనులో పడేస్తారు. దాంతో బాలుడు ప్రాణాలు కోల్పోతాడు. అయినప్పటికీ, ఆ మహిళ తన భక్తిని కోల్పోలేదు. ఆమె నిరంతరం భగవంతుడిని ప్రార్థిస్తూ, నిత్య నైవేద్యంతో శివారాధన చేస్తుంది. ఆమె భక్తిని చూసి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఆమె కుమారునికి ప్రాణం పోసి తిరిగి జీవితం అందిస్తాడు.

జ్యోతిర్లింగరూపంలో వెలిసింది

భక్తురాలి కోరిక మేరకు శివుడు అక్కడే జ్యోతిర్లింగరూపంలో వెలసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ కారణంగా ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే, సంతానయోగం లేనివారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తే, పిల్లల కోసం ప్రార్థించే వారికి ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం. కాబట్టి, సంతాన ప్రాప్తిని కోరికతో భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు.

12 Jyotirlinga Google news Grishneshwar Jyotirlinga location Shri Grishneshwar Jyotirlinga

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.