📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Uttarakhand: హరిద్వార్ ఘాట్లలో హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం?

Author Icon By Radha
Updated: January 6, 2026 • 9:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరాఖండ్‌లోని(Uttarakhand) ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం హరిద్వార్‌లో ఉన్న 105 ఘాట్లకు హిందూయేతరుల ప్రవేశాన్ని పరిమితం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ నిషేధాన్ని 2027 జనవరిలో జరగనున్న అర్ధ కుంభమేళా నుంచి అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Devotional Wear: పూజలో ధరించాల్సిన సాత్విక రంగుల దుస్తులు

సాధువులు, గంగా సభ ప్రతినిధులు గత కొంతకాలంగా చేస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అంశంపై ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గంగా ఘాట్ల పవిత్రతను కాపాడటం, సంప్రదాయాలను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో రిషికేశ్, హరిద్వార్(Uttarakhand) నగరాలను ‘సనాతన్ పవిత్ర నగరాలు (Holy Cities)’గా ప్రకటించే యోచన కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ హోదా కల్పిస్తే, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడేందుకు ప్రత్యేక నియమ నిబంధనలు అమలు చేసే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఈ అంశంపై అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉండగా, ప్రతిపాదిత చర్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Google News in Telugu HolyCity Latest News in Telugu SanatanaDharma

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.