భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో తులసి మొక్కకు (Tulsi Plant) అత్యంత పవిత్ర స్థానం ఉంది. ఇది కేవలం మొక్కే కాదు, లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తారు. అయితే, తులసి పత్రాలను కోయడానికి, ఉపయోగించడానికి కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి.
తులసిని కోయకూడని రోజులు, వ్యక్తులు
శాస్త్రాలు, పండితుల సూచనల ప్రకారం, తులసి మొక్కకు(Tulsi Plant) సంబంధించిన పనుల్లో పాటించాల్సిన నియమాలు కింద ఇవ్వబడ్డాయి:
- నిషిద్ధ దినాలు: శుక్రవారం, ఆదివారం, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి వంటి ముఖ్యమైన పర్వ దినాలలో తులసి మరియు ఉసిరి పత్రాలను (Amla Leaves) కోయడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది.
- స్త్రీలు కోయకూడదు: తులసిని ఆడవారు కోయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.
- నాటడం/తొలగించడం: తులసి మొక్కను నాటడం లేదా తొలగించడం వంటి పనులను కూడా మగవారే చేయాలని పండితులు సూచిస్తున్నారు.
తులసిని కోసే విధానం, పూజల్లో వినియోగం
- నమస్కరించి కోయాలి: తులసిని కోసే ముందు లేదా ఉపయోగానికి తీసుకునే ముందు దానికి నమస్కరించి అనుమతి తీసుకున్న తర్వాతే కోయడం మంచిది.
- పూజకు: మగవారు కోసిన తులసి పత్రాలతోనే దేవుడికి పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు.
- నిషిద్ధ పూజలు: తులసిని సాధారణంగా విష్ణుమూర్తి పూజలో వినియోగిస్తారు. అయితే, గణపతి (Lord Ganesha) మరియు శివుడి (Lord Shiva) పూజల్లో తులసి పత్రాలను ఉపయోగించడం నిషిద్ధం. ఈ ఇద్దరు దేవతలకు తులసిని సమర్పించకూడదు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: